తిక్కన

వికీపీడియా నుండి
(తిక్కన సోమయాజి నుండి దారిమార్పు చెందింది)
తింటే గారెలే తినాలి
వింటే భారతం వినాలి

అన్నది నానుడి. జయం పేరుతో సంస్కృతంలో భగవాన్ వ్యాస మహర్షి రచించిన మహాభారతాన్ని నన్నయ భట్టారకులు, తిక్కనసోమయాజి, ఎఱ్ఱన ఆంధ్రీకరించారు. వీరు కవిత్రయంగా ప్రసిధ్దులు.

విషయ సూచిక

కాలాదులు [మార్చు]

తిక్కనసోమయాజి చిత్రపటం

తిక్కన జీవిత కాలం 1205 - 1288. విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిధ్దికి మంత్రిత్వం వహించారు.కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి

బిరుదులు [మార్చు]

ఈయనకు "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.

తిక్కన శిష్యుడు మారన. ఇతడు రాసిన మార్కండేయ పురాణం ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో ఒకడైన నాగయగన్న మంత్రికంకితం చేసెను.మార్కండేయ పురాణంనందు మారన శ్రీమధుభయ కవిమిత్ర తిక్కన సోమయాజి ప్రసాద లబ్ద సరస్వతీ పాత్ర తిక్కనామాత్యుపుత్ర. అని రాసుకొనుటచే మారన తిక్కన శిస్యుడని తెలుస్తుంది.మారన తండ్రి తిక్కన కాకుండా వేరొక తిక్కన అయియున్నాడు.మన్మురాజును తిక్కనసోమయాజును కాకతీయ ప్రభువైన గణపతి దేవుని కాలమున ఉన్నట్లు నిశ్చయము.తిక్కన గణపతిదేవుని దగ్గరికి పోయేటప్పటికి తిక్కనసోమయాజి యజ్ఞము చేయలేదు.భారతముని కూడా రచించలేదు.

తిక్కన సోమయాజి పెదతండ్రి కుమారుడు అయిన సహొదరుడు ఖడ్గతిక్కన.తిక్కన కుమారుడు కొమ్మన.తిక్కన మనుమరాలి భర్త యల్లాడమంత్రి.ఈ యల్లాడమంత్రి మనుమడు కవి సింగన్న.ఈ సింగన్న తండ్రి అయ్యలమంత్రి.తిక్కనసొమయాజి తాత మంత్రి భాస్కరుడు.తిక్కన కవి గౌతమిగోత్రుడు.తద్రి కొమ్మన.తల్లి అన్నమ్మ.కేతన,మల్లన,పెద్దన ఇతని పెదతండ్రులు.


ఈ తిక్కన నియోగిబ్రాహ్మనుడు. ఈయన పూర్వుల నివాసిస్థలము మొట్టమొదట కృష్ణామండలంలోని వెల్లటూరు గ్రామము.ఉద్యొగరీత్య ఇతని తాతకాలమున గుంటూరునకు వచ్చారు.తరువాత నెల్లూరి రాజగు మనుమసిద్ది ఇతని కుటుంబమును ఆదరించి నెల్లూరికి తీసుకొనివచ్చి పూర్వము హరిహర దేవాలయము ఉండిన ఇప్పటి రంగనాయకస్వామి ఆలయ సమీపమున గృహము కట్టించి ఇచ్చి తిక్కనసోమయాజులను అందుంచినాడు.కేతన రాసిన దశకుమార చరిత్రనుబట్టి చూడగా తిక్కన ఇంటి పేరు కొత్తరువుయరయినట్టు తెలియవచ్చునది.తిక్కనకి అంకితము చేయబడిన దశకుమారచరిత్రము అను గ్రంథమునందు తిక్కన వంశావళి సమగ్రముగా వర్ణించబడింది.

తిక్కన తను రచించిన నిర్వచనోత్తర రామాయణమునందు

సారకవి తాభిరామ గుంటూరివిభుని
మంత్రి భాస్కరు మత్పితామహునిన్ దలచి
యైన మన్ననమెయి లోక మాదరించు
వేఱ నాకృతి గుణములు వేయు నేత?

అని తన కావ్యము స్వగుణముచేత కాకపోయిననూ తన తాత అయిన మంత్రిభాస్కరుని సారకవిత్వమహిమచేత అయిననూ లోకాదరనమునకు పాత్రయగునని చెప్పియున్నాడు.సూర్యవంశపు రాజైన మనుమసిద్ది ఆస్థానకవిగా తిక్కన ఉండడమే కాదు అతనితో సమానుడిగా గౌరవముపొందేవాడు.రాజునకు,కవికి మామవరుస కలదు.తిక్కన నిర్వచనోత్తరరామాయనముని మనుమసిద్దికి అంకితం చేసెను.దీనితో మనుమసిద్ది

ఏనిన్ను మామ యనియెడ
దీనికిన్ దగనిమ్ము భారతీకన్యక నా
కీ నర్హుడావగు దనినని
భూ నాయకు పలుకు చిత్తమునకిం పగుడున్

నిన్ను మామా అని పిలుచునందుకైనా భారతముని నాకు అంకితం ఇమ్మని అడిగినట్లు చెప్పబడియున్నది.

తిక్కన నన్నాయని ఆదికవిగా చెప్పలేదు.భారతమున మొదట ముడుపర్వాలుని రాసేనని చెప్పాడు.

తిక్కన కావ్యములు రెండు.1.నిర్వచనోత్తర రామాయణం.దీనినంతటిని పద్యములుగానే రచించెను.ఇది బాల్యమునందు రచించబడింది.ఇందలికథ సంస్కృతంలో ఉన్నంటలేక మిక్కిలి సంగ్రహపరచబడింది.పలుచోట్ల శైలి నారికేళపాకం అని చెప్పవచ్చును.అందుచేత ఈ గ్రంథం భారతమువలె సర్వత్ర వ్యాపిమ్పకున్నది.యితడు 10 ఆశ్వాసములు ఈ గ్రంథమున రచించినను పుస్తకమును మాత్రము ముగుమ్పలేదు.రామనిర్యాణకథను చెప్పుటకు భీతిల్లి దానిని వదిలిపెట్టినయెడల తిక్కన భారతమునందు స్త్రీపర్వకథయు క్రుష్ణనిర్యాణ మును చెప్పుటకేల భయపడలేదని ఒకరు ప్రశ్న వేయుచున్నారు.ప్రతీమరణకథకును భయపడి దానిని విడుచుచూ వచ్చినచో భారతమును రచిమ్పకయే యుండవలెను.తిక్కన భారతముని మనుమసిద్దికి ఇచ్చినచో నరాంకితం అవుతుందని మనుమసిద్దికి ఇవ్వక శ్రీభద్రాదిరామునికి అంకితం చేసెను.

తిక్కన శైలి ఈ క్రింది రెండు పద్యములయందు పొందుపరచబడింది.

మొదటి పద్యము:

మాలిం జంపిన మాల్యవంతున్ డుది తామార్ష ప్రకర్షంబునం
గాలాగ్ని ప్రతిమానుడై నిజభుజాగర్వంబుమై లీల ను
న్మీలజ్జ్వలకరాళ శక్తిన్ గొని మేమే దాకి వక్షస్థ్సలిన్

రెండో పద్యము:

ఎరుగవు గాక భోగముల కెల్లను నెచ్చెలి జవ్వంబున యి
త్తరినుడి వోవకుండ నుచితంబుగ జిక వదోయిన్ బోని క్రి
క్కిరిసినచిన్ని చంనున్ గవ యింపెస లారన్ గ నాదు వక్షమ
న్వరలుసరోవరంబున నవారనన్ గేళి యోనర్పకోమలీ .

తిక్కన కవి రచించిన రెండువ గ్రంథము భారతము.

హరిహరోపాసన [మార్చు]

తన కాలం నాటి సంఘములోని మతవైషమ్యాలను గమనించి శైవ వైష్ణవ మత కలహాలకు అతీతంగా హరిహరాద్వైతాన్ని సృష్టింఛాడు. సంఘసస్కర్తగా నిలిచాడు. తన భారత రచనను హరిహరనాధునకు అంకితమిచ్చారు. శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు:

శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్

మంత్రిత్వ పటిమ [మార్చు]

మనుమసిధ్ది దాయాదుల వలన రాజ్యం కోల్పోయినాడు. తిక్కన, అప్పుడు ఓరుగల్లును పాలించిన కాకతి గణపతి దేవ చక్రవర్తిని దర్శించి మనుమసిధ్ది కి కలిగిన కష్టాన్ని వివరించి ఆయన సాయముతో మనుమసిధ్దిని సింహాసనముపై పునఃప్రతిష్ఠ గావించినాడు.

సమకాలీనులు, శిష్యులు [మార్చు]

మారన, కేతన, గురునాధుడు

మహాకవి తిక్కన రుద్రాక్షమాల లభ్యం [మార్చు]

మహాకవి తిక్కన 12వ శతాబ్దంలో ఉపయోగించిన రుద్రాక్షమాల బయటపడింది. నెల్లూరులో నివసిస్తున్న ఆయన వంశస్థురాలు లక్ష్మీప్రసన్నకు ఆ మాల వంశపారంపర్యంగా సంక్రమించింది. నెల్లూరులోని పెన్నానది ఒడ్డున తిక్కన పార్కులో రుద్రాక్షమాల, పగడాన్ని ప్రదర్శించారు. మహాభారతము]]లో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు అరణ్యపర్వము వరకును నన్నయ రాసి మరణించగా తరువాత ఈ మహాకవి అరణ్యపర్వశేషమును మాత్రము విడిచిపెట్టి విరాటపర్వము మొదలుకొని తిక్కన 15పర్వములను రాసాడు.అరణ్యపర్వముని ఆంధ్రీకరించుటచేతనే నన్నయ మృతిచెందాడని,అందుకే నేనుకూడా మ్రుతిచెండుతాననే భయంతో అరణ్యపర్వముని తిక్కన విడిచిపెట్టినాడు అని కొందరు అంటారు.గ్రంథరచనకు పూర్వము మనుమసిద్ది తిక్కనచే యజ్ఞము చేయించి భారతముని సంపూర్ణముగా తిక్కనచే రచించేటట్లు చెప్పుదురు.కాని ఈ మనుమసిద్దిరాజు తనని రాజరాజ నరేంద్రుని ఆస్థానమునకి పొమ్మనగా తిక్కన పోనని మరామ్చేయడంతో ఈ విషయాన్ని ఎరిగిన రాజరాజనరేంద్రుడు తిక్కనకి నీవు ఎక్కడవుండైనా రచనచేయవచ్చని సమాచారం పంపగా,అప్పుడు తిక్కనచే మనుమసిద్ది నెల్లూరులో యజ్ఞము చేయించెను.అయిననూ తిక్కన మనుమసిద్ధిపై కోపంతో భారతముని మనుమసిద్దికి అంకితం ఇవ్వక ,హరిహరనాథునికి అంకితం చేసెను అని కొందరి వాదన.

తిక్కన మొదట రచించిన పర్వములను చూసి వానియందు విశేషవృత్తములు లేకపోగా పండితులు,అతడు సామాన్య వ్రుత్తములుతో కాలము గడుపుతున్నాడే కాని అపూర్వవృత్తరచనా కుశలుడు కాడని ఆక్షేపించిన మీదట తిక్కన స్త్రీ పర్వమునందు భాహువిధ వృత్తములను రచించాడని చెప్పుదురు.తిక్కన రచించిన 15పర్వములలో 45ఆస్వాసములు కంటే ఎక్కువ గ్రంథము లేదు.ఒక్కొక్క ఆస్వాసమునుకు 445 పద్యములు చొప్పున లెక్క చూసిననూ,భారతంలో తిక్కన 25000 పద్యములుకంటే అధికముండవు.దినమునకు 10పద్యములు చొప్పున రచించినచో ఇంత మహాభారత గ్రంథము 5 లేదా 6 సంవత్సరములలో రచించవచ్చును.కాబట్టి ఇట్టి గ్రంథము ఒకరివల్ల రచించడం అసాద్యము కాదు.సాధ్యమయ్యే అవకాశ0 ఉంది.కాని తిక్కన శైలితో సమానముగా రాయుతమాత్రము ఎవ్వరికి సాద్యముకాదు.తెలుగుభాషలందు ఎన్నిగ్రంథములు ఉన్నానూ,తిక్కన కవిత్వముతో సమానముగా కాని దానిని మించియున్నట్లుగాని కవిత్వము చెప్పగలిగిన వారు నేటివరకు ఒక్కరును కనబడలేదు.తిక్కన కవిత్వము ద్రాక్షాపాకములు మిక్కిలి రసవంతముగా ఉండును.ఇతని కవిత్వమునందు పాదపూరణము కొరకు వాడిన వ్యర్థపదములు అంతగా కనిపించవు.ఈయన కవిత్వము లోలోక్తులతో కూడి జాతియముగా ఉండును.ఇతని కవిత్వములో ఒకవంతు సంస్కృతము,రెండువంతుల తెలుగుపదములు కనిపిస్తాయి.నన్నయవలె తన గ్రంథమును ములమునకుసరిగా రాయలేదు.విరాతపర్వమునందు కథ కొంత పెంచెను.తక్కిన పర్వములందు మిక్కిలిగా కథను సంగ్రహపరిచెను.ఉద్యోగాపర్వమునందలి సనత్కుమారుపదేశమును మూలమున పదిపండ్రిపత్రములున్నా,తెలుగునా 2లేదా 3పద్యములతో సరిపెట్టేను.భగవత్గీతలు,ఉత్తరగీతలు మొదలైనవానిని రాయనేలేదు.

భగవత్గీతలోని కొన్నిశ్లోకములకు దగ్గరగా కొన్ని పద్యములని రాసాడు.ఉదాహరణకు ఈ క్రింది శ్లోకముని చూడుము.

భగవద్గీత శ్లోకము ;;

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుము త్సవః!............... .........మామ కాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః!!

పద్యము ;;

క;;......................మానుగ ధర్మక్షేత్రం
........................బైన కురుక్షేత్రమున మహాహవ మునకున్
........................బూని మనబలమున్ బాండవ
.........................సేనయు నిటు సన్నీ యేమి చేసెంజె పుమా!

అని తిక్కన ఆంద్రీకరించాడు.భాగవత్గీతని అనువదించకపోవడానికి కారణం ఏమిటంటే యుద్ధమునందు శత్రువులు ఉన్నప్పుడు 18అధ్యాయములను కృష్ణుడు అర్జునకు చెప్పడం అసాధ్యము అగును.కావున రాయలేదు అని చెప్పవచ్చును.

ఈయన సంస్కృతమును తెనిగిన్చినరీతిని తెలుపుటకై మూలగ్రంథములోని కొన్ని శ్లోకములను వాని అర్థమును తెలుపు పద్యములును కొన్నింటిని వివరించడం చూడవచ్చును.

విరాటపర్వం శ్లోకము ఆలో కయసి కిం వృక్షం సూద దారుక్రుతేనవై  !

...................................యది తే దారుభిః కృత్యం బహిర్వ్రుక్షాన్ని గృహ్యతామ్ !!

అనువాద పద్యము వలలుం డేక్కడన్ జూచె ?నొండెడ నపెవ్యక్ష్మాజముల్ పుట్టవే?

.............................ఫలితంబై వరశాఖ లోప్పన్ గ ననల్పప్రీతి సంధించుచున్

..............................విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికి న్విశ్రాంతిన్ గావింపన్ గాన్

...............................గల యీ భుజము వంట కట్టయలకై ఖండింపన్ గా నేటికిన్ ?

తిక్కన పద్యములు: [మార్చు]

ద్రౌపది కీచకునితో

దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్
గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా

ఉత్తర గోగ్రహణ సమయమున ద్రోణుడు

సింగంబాకటితో గుహాంతరమునన్ జేర్పాటుమై యుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్

ఈ కవి ఇంకా కవివాక్భంధనం అనే లక్షణగ్రంథముని కృష్ణశతకముని ,విజయసేననము అనువాటిని రచించాడని భావన.

ముగింపు ;;తిక్కన మనుమసిద్ది రాజ్యము అంతరించిన తరువాత కూడా చిరకాలము జీవించి ,సర్వజనులచే గౌరవిమ్పబడేవాడైనా,మరణకాలమునకు విశేషవృత్తవంతుడిగా కనబడడు .అందుచే అతని కుమారుడు కొమ్మన పాటూరి కరినణమును సంపాదించవలసి వాడయ్యేన


చిత్రమాలిక [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=తిక్కన&oldid=837583" నుండి వెలికితీశారు