తాత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్ణాటకలో ఉన్న బ్రహ్మ శిల్పం

నాన్నకు లేదా అమ్మకు నాన్నను తాత లేదా తాతయ్య (Grandfather) అంటారు.[1] అమ్మ నాన్నను మాతామహుడు అని, నాన్న నాన్నని పితామహుడు అని కూడా అంటారు. తాత బ్రహ్మదేవునికి మరోపేరు.

ఉమ్మడి కుటుంబంలో తాత పాత్ర గొప్పది, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో కూడిన పెద్ద సంసారాన్ని నాన్నమ్మ లేదా అమ్మమ్మతో కలిసి నడపడం ఆయన బాధ్యత.

పురాణాలు[మార్చు]

రామాయణంలో వాల్మీకి లవ కుశలను పెంచి, వారికి శ్రీరాముని గొప్పతనాన్ని చెప్పి, వారిని సన్మార్గంలో పెంచి, తాత అనే పదానికి మొదటిసారిగా అర్ధం ఛెప్పినది వాల్మీకి మహర్షి.

మహాభారతంలో భీష్ముడు కౌరవులకు, పాండవులకు ఇరువురికీ పితామహుడు కాబట్టి భీష్మ పితామహుడుగా గౌరవించబడ్డాడు.

గాంధీ తాత[మార్చు]

బోసినవ్వుల గాంధీ తాత

భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చి ఇచ్చిన మహాత్మా గాంధీని భారత ప్రజలంతా "గాంధీ తాత"గా పిలుస్తారు.

"భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ" అనే పాటను దొంగ రాముడు (1955) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు.

నామకరణం[మార్చు]

కొన్ని హిందూ కుటుంబాలలో తాత గారి పేరును మనవడికి పెట్టుకుంటారు. ఇది పెద్దల పట్ల మనకు గల గౌరవాన్ని సూచిస్తుంది. ఈ సంప్రదాయం మూలంగా తాత, మనవడి పేర్లు ఒకటేగా ఉంటాయి.

ఉదాహరణ

వేదము వేంకటరాయ శాస్త్రి : ఇతని మనవడి పేరు కూడా వెంకటరాయశాస్త్రే. ఈయన తాతగారి లాగే నాటక రచయిత. వ్యామోహం మొదలైన నాటకాలను రచించాడు. తాతగారి జీవిత చరిత్రను "వేదం వెంకటరాయ శాస్త్రి జీవిత సంగ్రహము" పేరుతో వ్రాశాడు.

క్రైస్తవుల పర్వదినమైన క్రిస్మస్ రోజు "క్రిస్మస్ తాత" (శాంతా క్లాజ్) అందరికీ ఎన్నో బహుమతుల్ని ఇస్తాడు.

సినిమా[మార్చు]

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తాత&oldid=3917576" నుండి వెలికితీశారు