కొత్తవలస
వికీపీడియా నుండి
| ?కొత్తవలస మండలం విజయనగరం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | కొత్తవలస |
| జిల్లా(లు) | విజయనగరం |
| గ్రామాలు | 27 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
62,897 (2001) • 31493 • 31404 • 59.88 • 71.98 • 47.78 |
కొత్తవలస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము. పాలనా పరంగా కొత్తవలస విజయనగరం జిల్లాలోని మండల కేంద్రమైనా ఇప్పుడు దాదాపు విశాఖపట్నంలో కలిసిపొయింది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గంలో విశాఖపట్నంకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తవలస చుట్టూ కొండలు ఉన్నాయి. కనుచూపు మేరలో తూర్పు కనుమలు కనపడతూ ఉంటాయి. కొత్తవలస మామిడి, జీడి తోటలు, ఎర్రమట్టికి ప్రసిద్ధి. ఇక్కడి నుండి ప్రతీ సంవత్సరము కోల్కోత్తకి మామిడి కాయలు ఎగుమతి చేస్తారు. ఎర్రమట్టిని ఉపయోగించి బంగళా పెంకులు తయారు చేసి ప్రక్కనున్న ఒరిస్సా రాష్త్రానికి ఎగుమతి చేస్తారు. ఇక్కడ దాదాపు 30 పెంకుల మిల్లులు ఉన్నాయి.
మండలంలోని పట్టణాలు [మార్చు]
- కొత్తవలస (ct)
మండలంలోని గ్రామాలు [మార్చు]
- అప్పన్నదొరపాలెం
- అప్పన్నపాలెం
- ఉత్తరాపల్లి
- చిన్నిపాలెం
- చినరావుపల్లి
- పెదరావుపల్లి
- కతకపల్లి
- కంటకాపల్లి
- దత్తి
- రాయపురాజుపేట
- నిమ్మలపాలెం
- నరపాం
- దేవాడ
- ముసిరాం
- వియ్యంపేట
- రామలింగపురం
- చీడివలస
- చీపురువలస
- గొల్లలపాలెం
- సుందరయ్యపేట
- వీరభద్ర పురం
- నిమ్మలపాలెం
- బలిఘట్టం
- అద్ధన్నపాలెం
- తుమ్మికాపల్లి
- చీపురువలస
- గులివిందాడ
- దెందేరు
- సంతపాలెం
- గనిశెట్టిపాలెం
- మిందివలస రామచంద్రాపురం
- మంగళపాలెం
- దేశపాత్రునిపాలెం
- చింతలపాలెం
- రెల్లి
- ఎమ్. ఆర్. పురం
- శ్రీ రామ నగర్ , కుమ్మరి బంజరి
