బనగానపల్లె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


బనగానపల్లె
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో బనగానపల్లె మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో బనగానపల్లె మండలం యొక్క స్థానము
బనగానపల్లె is located in ఆంధ్ర ప్రదేశ్
బనగానపల్లె
ఆంధ్రప్రదేశ్ పటములో బనగానపల్లె యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°19′00″N 78°14′00″E / 15.3167°N 78.2333°E / 15.3167; 78.2333
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము బనగానపల్లె
గ్రామాలు 38
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 89,030
 - పురుషులు 45,555
 - స్త్రీలు 43,475
అక్షరాస్యత (2001)
 - మొత్తం 53.79%
 - పురుషులు 67.19%
 - స్త్రీలు 39.77%
పిన్ కోడ్ 518124
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బనగానపల్లె (ఆంగ్లం: Banaganapalle) ఒక చిన్న పట్టణం మరియు మండలము. పిన్ కోడ్: 518124. కర్నూలు జిల్లాలో నున్న బనగానపల్లె 1790 నుండి 1948 వరకు అదే పేరు కలిగిన సంస్థానం గా ఉండేది.

చరిత్ర[మార్చు]

1601 లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరు కు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తిఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ మేనమామ, ముబారిజ్‌ ఖాన్‌ దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది.

బనగానపల్లె సంస్థాన పటము

అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులు గా కొన్నాళ్ళు, ఆ తరువాత 1724 లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో మైసూరు రాజు హైదరాలీ సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. 1783లో హుసేను మరణించాక, అతని కుమారుడు, చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన టిప్పు సుల్తాను వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు హైదరాబాదు లో తలదాచుకున్నారు. మళ్ళీ 1789 లో బనగానపల్లె కు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని చెంచెలిమల జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.

1800 తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియా లో ఒక సంస్థానం గా మారిపోయింది. ఆర్ధిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905 లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901 లో బనగానపల్లె సంస్థానం 660 చ కి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. 1948 లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953 లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పడ్డాయి.

పట్టణం స్వరూపం, జనాభా[మార్చు]

పట్టణంలో విద్య , వైద్యం, రవాణా సదుపాయాలు[మార్చు]

బనగానపల్లె పట్టణంలో, ప్రభుత్వ ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలలు మరియు కలవు. బాలుర మరియు బాలికల ఉన్నత పాఠశాలలు కలవు. ప్రైవేటు విద్య సంస్థలు కూడా కలవు.
బనగానపల్లెలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఉన్నవి.
బనగానపల్లె లో ఒక సార్వజనిక వైద్యశాల మరియు ప్రభుత్వ పశు వైద్యశాల కలదు.
బనగానపల్లెలో ఆర్.టి.సి. డిపో ఉన్నది. బనగానపల్లె నుండి రాయలసీమ లోని అన్ని ముఖ్య పట్టణాలకి రవాణ సౌకర్యం కలదు. రాష్ట్ర రాజధాని, హైదరాబాదు కి ప్రతి రోజు రాత్రి బస్సులు కలవు. రైల్వే స్టేషన్ లేదు

మండలంలో వ్యవసాయం, నీటివనరులు[మార్చు]

ఆలయాలు[మార్చు]

  • బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు.
  • బనగానపల్లె కి 10 కి.మి దూరంలో యాగంటి అను పుణ్యక్షేత్రం ఉన్నది.
  • శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నేలమఠం,కాలగ్నానాన్ని పాతిపెట్టిన చింతమాను మఠం, ravvalakonda ఇక్కడ ప్రసిద్ది చెందిన ఆలయాలు.

మామిడి[మార్చు]

బనగానెపల్లె "బేనిషా" మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక NTR చిత్రంలో "బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది.

చింతమాను మఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె
నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె
నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె

మండలంలో గ్రామాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

బనగానపల్లె సంస్థానము చరిత్ర