Coordinates: 17°02′30″N 80°05′51″E / 17.04167°N 80.09750°E / 17.04167; 80.09750

కాంతబంసుగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంతబంసుగూడ
కాంతబంసుగూడ is located in Andhra Pradesh
కాంతబంసుగూడ
కాంతబంసుగూడ
భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్
Coordinates: 17°02′30″N 80°05′51″E / 17.04167°N 80.09750°E / 17.04167; 80.09750
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
Population
 (2001)
 • Total6,126
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationAP

కాంతబంసుగూడ, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ మండలానికి చెందిన ఒక జనగణన పట్టణం.ఇది అరకు వ్యాలీ మండల ప్రధాన కార్యాలయం. [1] ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని, అరకులోయ శాసనసభ నియోజకవర్గం పరిధికింద ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, కాంతబంసుగూడ పట్టణ పరిధిలో మొత్తం 1,433 కుటుంబాలు నివసిస్తున్నాయి. పట్టణ జనాభా మొత్తం 6,714, అందులో 3,921 మంది పురుషులు, 2,793 మంది మహిళలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 1000:712.పట్టణ జనాభా 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 697, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 389 మంది మగ పిల్లలు, 308 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలల లైంగిక నిష్పత్తి 792, ఇది సగటు లింగ నిష్పత్తి (712) కంటే ఎక్కువ. అక్షరాస్యత రేటు 82.6%. విశాఖపట్నం జిల్లాలో 66.9%తో పోలిస్తే కాంతబంసుగూడ అక్షరాస్యత ఎక్కువ. కాంతబంసుగూడలో పురుష అక్షరాస్యత రేటు 91.02%, స్త్రీల అక్షరాస్యత రేటు 70.54%.పట్టణ పరిధిలోని 1,433 ఇళ్లకు పైగా పరిపాలనను స్థానిక స్వపరిపాలనా సంస్థ నిర్వహిస్తుంది. వీటికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను సరఫరా చేస్తుంది. పట్టణ పరిధిలోని రహదారులను నిర్మించడానికి, నిర్వహణక దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి అధికారం ఉంది.[2]

2001 గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం కాంతబంసుగూడ పట్టణ జనాభా మొత్తం 6126.అందులో పురుషులు 56% మంది ఉండగా, స్త్రీలు 44%. మంది ఉన్నారు.అక్షరాస్యత రేటు 82% ఉంది.ఇది జాతీయ సగటు అక్షరాస్యత 59.5% కన్నా ఎక్కువుగా ఉంది.పురుషుల అక్షరాస్యత 89% ఉండగా స్త్రీల అక్షరాస్యత 72% ఉంది. పట్టణ జనాభాలో 6 సంవత్సరాల వయస్సుగల పిల్లలు 10% మంది ఉన్నారు.[3]

చదువు[మార్చు]

ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యను రాష్ట్ర పాఠశాల విద్య విభాగం క్రింద ప్రభుత్వ, సహాయక, ప్రైవేట్ పాఠశాలలు అందిస్తాయి. [4] [5] వివిధ పాఠశాలలు అనుసరించే బోధనా మాధ్యమం ఇంగ్లీష్, తెలుగు భాషలలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Visakhapatnam District Mandals" (PDF). Census of India. pp. 274, 319. Retrieved 19 February 2016.
  2. "Kantabamsuguda Population, Caste Data Visakhapatnam Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-05-02. Retrieved 2021-05-02.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  4. "School Education Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 27 December 2015. Retrieved 7 November 2016.
  5. "The Department of School Education - Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 November 2016. Retrieved 7 November 2016.

వెలుపలి లంకెలు[మార్చు]