చీమకుర్తి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చీమకుర్తి
—  మండలం  —
ప్రకాశం జిల్లా పటములో చీమకుర్తి మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో చీమకుర్తి మండలం యొక్క స్థానము
చీమకుర్తి is located in ఆంధ్ర ప్రదేశ్
చీమకుర్తి
ఆంధ్రప్రదేశ్ పటములో చీమకుర్తి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°34′55″N 79°52′05″E / 15.581992°N 79.868066°E / 15.581992; 79.868066
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము చీమకుర్తి
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 64,590
 - పురుషులు 32,779
 - స్త్రీలు 31,811
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.29%
 - పురుషులు 69.53%
 - స్త్రీలు 46.73%
పిన్ కోడ్ 523226
చీమకుర్తి
—  రెవిన్యూ గ్రామం  —
అక్షాంశరేఖాంశాలు: 15°34′55″N 79°52′05″E / 15.581992°N 79.868066°E / 15.581992; 79.868066
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చీమకుర్తి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 22,042
 - పురుషులు 11,296
 - స్త్రీలు 10,746
 - గృహాల సంఖ్య 4,928
పిన్ కోడ్ 523 226
ఎస్.టి.డి కోడ్ 08592

చీమకుర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 523 226., ఎస్.టి.డి.కోడ్ నం. 08592.

  • చీమకుర్తి ఇసుకవాగు ప్రాంతంలో పునర్నిర్మాణం చేసిన శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి దేవస్థానంలో ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు 2014,మార్చ్-18, మంగళవారం నుండి ప్రారంభమైనవి. ఈ సందర్భంగా పంచాహ్నిక దీక్షా కార్యక్రమం నిర్వహించినారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర పూజలు నిర్వహించినారు. విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం, 2014,మార్చ్-22, శనివారం నాడు, వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా, ఉదయం నుండి ఆలయంలో వేదపండితులు ప్రత్యేకపూజలు చేశారు. పది గంటలకు భక్తుల జయజయ ధానాలమధ్య, విగ్రహ, ధ్వజస్థంభాల ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆరు వేలకు మందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2] & [3]
  • చీమకుర్తి గ్రామములోని శ్రీ హరిహర క్షేత్ర 8వ వార్షికోత్సవ వేడుకలు, శ్రీ శిద్దా వెంకటేశర్లు,వెంకటసుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో, 2014,ఏప్రిల్-13, ఆదివారం నాడు, వైభవంగా ప్రారంభమైనవి. ఆ రోజున మహాగణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, మండపారాధన, మహాపడిపూజలు నిర్వహించినారు. సోమవారం నాడు శ్రీ హరిహరసుత అయ్యప్ప, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, వాసవీ కన్యకా పరమేశ్వరి, పార్వతీ సమేత నగరేశ్వరస్వామి, ప్రసన్నాంజనేయస్వామివార్ల విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా దేవాలయంలో రంగురంగుల విద్యుద్దీపాలంకరణ చేశారు. [4]


పరిశ్రమలు[మార్చు]

  • చీమకుర్తిలో గ్రానైట్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన గ్రానైట్ చాలావరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నది. అనేక రాష్ట్రాలనుండి వచ్చినవారు కూడా ఇక్కడ గ్రానైట్ పరిశ్రమలో పని చేస్తున్నారు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 22,042.[1] ఇందులో పురుషుల సంఖ్య 11,296, మహిళల సంఖ్య 10,746, గ్రామంలో నివాస గ్రుహాలు 4,928 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,788 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

  • కె.వి.పాలెం 2 కి.మీ, పులికొండ 5 కి.మీ, చండ్రపాడు 6 కి.మీ, మంచికలపాడు 7 కి.మీ, తొర్రగుడిపాడు 7 కి.మీ, పల్లామల్లి 9 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

  • తూర్పున సంతనూతలపాడు మండలం, ఉత్తరాన తాళ్ళూరు మండలం, దక్షణాన కొండపి మండలం, తూర్పున మద్దిపాడు మండలం.


మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మార్చ్-19; 2వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మార్చ్-23; 2వ పేజీ. [4] ఈనాడు,ప్రకాశం/సంతనూతలపాడు;2014;ఏప్రిల్-14;1వ పేజీ.

"http://te.wikipedia.org/w/index.php?title=చీమకుర్తి&oldid=1120120" నుండి వెలికితీశారు