చీరాల
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?చీరాల మండలం ప్రకాశం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | చీరాల |
| జిల్లా(లు) | ప్రకాశం |
| గ్రామాలు | 2 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,62,897 (2001) • 81754 • 81143 • 66.72 • 76.02 • 57.41 |
చీరాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల పట్టణము. చీరాలకి ఈ పేరు దాని పాత పేరు క్షీరపురి నుండి వచ్చింది (ఇక్కడ సముద్రము తెల్లగా కనపడుతుంది. అంచేత ఈ వూరికి ఆ పేరు వచ్చింది.). ఈ పట్టణము ప్రకాశం జిల్లాలోనే ప్రధాన పట్టణము. వస్త్ర ఉత్పత్తి, వ్యాపారంలో సాధించిన ప్రగతి కారణంగా చీరాల చిన్న బొంబాయిగా పేరుగాంచింది. ఈ పట్టణం భారతీయ వాయుసేనకు చెందిన స్థావరం, సూర్యలంకకు దగ్గరగా వున్నది .
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
నేటి చీరాల పట్టణానికి శంకుస్థాపన 1604 లో ఇద్దరు యాదవ ప్రభువులు - మించాల పాపయ్య, మించాల పేరయ్యలు చేసారు. ఈ పట్టణం పాత చీరాలకు అసలు పేరైన శుద్ధనగరం నుండి ఏర్పడింది. మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారం లోని రికార్డుల ప్రకారం, శుద్ధనగరాన్ని కాకతి గణపతిదేవ చక్రవర్తి వద్ద మంత్రిగా ఉన్న గోపరాజు రామన్న, చీరాల అనంతరాజుకు క్రీ.శ.1145 లో దానమిచ్చాడు. అతని వారసుడు చీరాల వెంకటకృష్ణుడు ప్రస్తుత చీరాలను కొత్త పట్టణాన్ని నిర్మించేందుకు గాను యాదవులకు కౌలుకిచ్చాడు. ఈ ప్రకారం, విశ్వావసు సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నాడు - క్రీ.శ.1604 లో - నేటి చీరాల పట్టణం ఆవిర్భవించింది.
కొత్త పట్టణంలో 1619 లో వేణుగోపాలస్వామి గుడి, 1620 లో మల్లేశ్వరస్వామి గుడి కట్టించారు. మరి కొద్దికాలం తరువాత గంగమ్మ గుడి కట్టించారు. 19వ శతాబ్దపు మధ్య కాలంలో చీరాల రామన్న పంతులు ఈ గుడులకు రథాలు తయారుచేయించాడు.
చెన్నై-కోల్కతా-ఢిల్లీ ప్రధాన రైలుమార్గంలో ఉన్న చీరాలలో రైల్వే స్టేషను ఏర్పాటయ్యాక, వ్యాపారపరంగా చీరాల అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మోటుపల్లి రేవు ద్వారా సముద్ర వ్యాపారం చేసిన పాత చీరాల క్రమేణా ప్రాముఖ్యతను కోల్పోయి, ఓ చిన్న గ్రామంగా మిగిలిపోయింది.
12వ శతాబ్దంలో పలనాటిని పాలించిన హైహయ వంశ పాలకుడైన అనుగురాజు, బ్రహ్మనాయుడితో కలిసి పరివార సమేతంగా పాత చీరాలకు వచ్చినపుడు చెన్నకేశవస్వామి విగ్రహాన్ని, స్వామి దేవేరులు, ఆయుధాలతో సహా ఇచ్చి వెళ్ళాడు. 11వ శతాబ్దంలో చోళులు కట్టించిన పురాతన ఆదికేశవస్వామి గుడి, ప్రస్తుతం జీర్ణస్థితికి చేరుకోగా, వాడరేవు లోని శ్రీ లలితానంద ఆశ్రమానికి చెందిన శ్రీ అరుళానందస్వామి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరుగుతూంది.
బ్రిటిషువారు చీరాలను ఆరోగ్య విడిదిగా భావించేవారు. 1906 లో మొదటగా ఎడ్వర్డు VII పట్టాబిషేక స్మారక ఆసుపత్రి ప్రారంబమైంది. 1912లో డా.బాయరు బాయరు మిషనరీ ఆసుపత్రి ప్రారంభించాడు.
ప్రస్తుత ఎన్.ఆర్ అండ్ పీ.మున్సిపల్ హైస్కూల్ 1912లో ప్రధమాంగ్ల పాథశాలగా స్థాపించబడింది. చారిత్రాత్మక చీరాల-పేరాల స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ మహాత్ముని సూచనమేరకు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 18 వేల ప్రజానీకమంతా పట్టణాన్ని వదలి వెళ్ళిపోవడం వలన-పాఠశాల 1921లోమూతపడి మరల 1924లో మునిసిపల్ మిడిల్ స్కూల్గా పున:ప్రారంభమైంది. 1928లో మొట్టముదటి యస్.యస్.యల్.సి బ్యాచ్ విద్యార్ధులు ఈ స్కూల్ నుండి పబ్లిక్ పరీక్షకు హాజరైనారు. 2004లో ఈ స్కూల్ అశీతి (80) వసంతోత్సవాలను ప్రధానోపాధ్యాయులు చంగవల్లి సత్యనారాయణ శర్మగారి సారధ్యంలో ఘనంగా జరుపుకున్నది. వివిధ రంగాలలో లబ్ధప్రతిష్టులైన ఎన్.ఆర్.అండ్.పి.మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధులు:- భారత మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ డా.జి.వి.జి.కృష్ణమూర్తి; మాజీమంత్రులు-రొండా నారపరెడ్డి, వడ్డె నాగేశ్వర రావు: మాజీ శాసనసభ్యులు ప్రగడ కోటయ్య, అక్కల కోటయ్య, ముప్పలనేని శేషగిరిరావు, ముట్టె వెంకటేశ్వర్లు: పార్లమెంటు సభ్యులు:సలగల బెంజిమన్: భారత రాయబారి పేర్లి దానమ్; ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు; డా.వై.పి.యస్.రావ్ వంటి ప్రఖ్యాత వైద్యులూ; వెంకట్ చంగవల్లి (సిఈఓ,108 అంబులెన్స్): డా.సి.యస్.ఆర్.మూర్తి వంటి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు.. ఎన్నో రంగాలలో ఎందరెందరో ప్రముఖులు ఈస్కూల్లో చదివినవారే! 1946లో కస్తూరిబా గాంధీ మునిసిపల్ గరల్స్ హైస్కూల్ స్థాపించబడింది. 1948లోఎన్.ఆర్.ప్.యమ్ హైస్కూల్లో గాంధీ విగ్రహాన్నిప్రతిష్టించారు. 1951లో పేరాలలో ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్ స్థాపించబడింది. ప్రస్తుత వి.ఆర్.ఎస్ అండ్ యై.ఆర్.ఎన్.కాలేజి 1951లో స్థాపించబడింది.
1923 లో ఐరోపా వారు పొగాకు క్యూరింగు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఇది ఎంతో మందికి ఉపాధి కల్పించింది. యాంత్రికీకరణకు ముందు, 6,000 మంది వరకు ఇక్కడ పనిచేసేవారు. చేనేతకు పట్టుగొమ్మైన చీరాల 25,000 నుండి 30,000 వస్త్రకారులకు ఉపాధి కల్పిస్తున్నది. ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ప్రత్యేక నేత వస్త్రానికి మంచి ఎగుమతి మార్కెట్టు ఉంది. 1959 లో సహకార స్పిన్నింగు మిల్లు కూడా ప్రారంభమైంది.
స్వాతంత్ర్య సమరంలో ప్రత్యేక భూమిక పోషించిన చీరాల 2004, ఏప్రిల్ 27 న (వైశాఖ శుద్ధ సప్తమి) 400 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం చీరాల శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] విద్య
[మార్చు] ఇంజనీరింగ్ కళాశాలలు
- వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
- సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
- చీరాల ఇంజనీరింగ్ కాలేజి
[మార్చు] మండలంలోని పట్టణాలు
- వేటపాలెం - చీరాలకు 7 కి.మీ దూరంలో ఉన్న వేటపాలెం జీడీ పప్పుకు ప్రసిద్ది
- చీరాల
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఈపూరుపాలెం (గ్రామీణ)
- గవినివారిపాలెం
- బుర్లవారిపాలెం
- జాండ్రపేట
- పేరాల పట్టణము
- చీరాల పట్టణము
- తోట వారి పాలెం
- బోయిన వారి పాలెం
|
|||||||