వేటపాలెం
| ?వేటపాలెం మండలం ప్రకాశం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 6 మీ (20 అడుగులు) |
| ముఖ్య పట్టణము | వేటపాలెం |
| జిల్లా(లు) | ప్రకాశం |
| గ్రామాలు | 6 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
67,990 (2001) • 33880 • 34110 • 64.14 • 74.18 • 54.24 |
వేటపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము. తెలుగు పుస్తకాల అమూల్య నిలయమైన సారస్వత నికేతనం వేటపాలెంలోని ఒక గ్రంధాలయము.
వేటపాలెం గ్రామ పంచాయతి చీరాల పట్టణానికి 9 కి.మీ దూరంలో వుంది. ఈ వేటపాలెం మండలంలో ఆరు గ్రామాలు కలవు. వేటపాలెం గ్రామం తెనాలి - మద్రాసు రైల్వే లైనులో ఉంది. చీరాల నుండి వేటపాలెంకు బస్సు ప్రయాణం అరగంట పడుతుంది. "వేటపాలెం" పేరును సంస్కృతీకరించి "మృగయాపురి" అని కొన్నిచోట్ల వ్రాస్తారు.
ఈ గ్రామము కోస్తా ప్రాంతంలోనే జీడిపప్పు వ్యాపారానికి ఎంతో పేరు గాంచినది.
విషయ సూచిక |
గ్రామ స్వరూపం [మార్చు]
2001 జనాభా లెక్కల ప్రకారం వేటపాలెం జనాభా 37,037. ఇందులో మగవారు 49%, మరియు ఆడవారు 51%. అక్షరాస్యత 59%. జాతీయ సగటు అక్షరాస్యత 68%కి ఇది తక్కువ. జనాభాలో 6 సంవత్సరాలలోపు పిల్లలు 11% ఉన్నారు.
Latitude 15.7833 Longitude 80.3167 Altitude (feet) 19 Lat (DMS) 15° 46' 60N Long (DMS) 80° 19' 0E Altitude (meters)
Approximate population for 7 km radius from this point: 27320
ఈ గ్రామం సముద్ర తీరం నుండి 4.5 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలొని నాయునిపల్లిలో ఒక ప్రసిద్ద శివాలయం (భొగ లింగెశ్వర ఆలయమం) ఉన్నది. ఆ ఆలయంలో పూజారిగా కారంఛేటి సాంబశివరావు గారు(రిటైర్డ్ హెడ్ మాస్టరు), వారి కుమారులు.
ఈఊరి మీద సామెతలు [మార్చు]
- ఎచ్చులకు వేటపాలెం పోతే తన్ని తల గుడ్డ తీసుకున్నారట
సారస్వత నికేతనం [మార్చు]
"సారస్వత నికేతనం" అనే గ్రంధాలయం ద్వారా వేటపాలెం ప్రసిద్ధమైనది. ఇది తెలుగు భాషకు 80 సంవత్సరాలుగా మహోన్నత సేవలు చేసింది. దీన్ని 1918లో వి.వి.శ్రేష్టి స్థాపించాడు. స్వాతంత్ర్యము రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లో కెల్ల ఇటువంటి అరుదైన ఏకైక గ్రంథాలయము సారస్వత నికేతనం.
ఈ గ్రంథాలయానికి 1929లో జాతిపిత మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించి ఆశీర్వదించారు. కట్టడము పూర్తైన భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్ మరియు టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు.
ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ కలదు. కొన్ని వార్తాపత్రికలు 1909వ సంవత్సరమునుండి కలవు. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బస చేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు.
వ్యవసాయం, పరిశ్రమలు [మార్చు]
జీడి పప్పు పరిశ్రమ మరియు చిన్న పరిశ్రమలు వేటపాలెంలో ముఖ్యమైనని.
విద్య [మార్చు]
నాయునిపల్లి గ్రామంలో సెయింటాన్స్ ఇంజినీరింగ్ కాలేజి మరియు చీరాల ఇంజినీరింగ్ కాలేజి ఉన్నాయి. బండ్ల బాపయ్య హిందూ జూనియర్ మరియు డిగ్రీ కాలేజి కలదు.
మండలంలోని గ్రామాలు [మార్చు]
- వేటపాలెం (ct)
- పందిళ్లపల్లి
- పుల్లరిపాలెం
- కొత్తపేట (గ్రామీణ)
- నాయనిపల్లి (గ్రామీణ)
- రామన్నపేట
- రావూరిపేట
- చల్లారెడ్డిపాలెం
ఇవికూడా చూడండి [మార్చు]
- సారస్వత నికేతనం - వేటపాలెంలోని ఒక ప్రముఖ గ్రంధాలయము
- సెయింటాన్స్ ఇంజినీరింగ్ కాలేజి - చల్లారెడ్డిపాలెం లోని ఒక ఇంజినీరింగ్ కళాశాల
బయటి లింకులు [మార్చు]
|
|||||||
|
|
|
|---|---|
| వేటపాలెం (ct) · పందిళ్లపల్లి · పుల్లరిపాలెం · కొత్తపేట (గ్రామీణ) · నాయనిపల్లి (గ్రామీణ) · రామన్నపేట · రావూరిపేట · చల్లారెడ్డిపాలెం |