వ్యవసాయం

వికీపీడియా నుండి

వ్యవసాయంలో సాయం చేస్తున్న యెద్దులు, బండికి కట్టబడినవి
వ్యవసాయానికి సిద్ధం చేయబడుతున్న పొలం, చిత్రంలో గోదావరి నదిని కూడా చూడవచ్చు

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార మరియు ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు.

వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది.

ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమిష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.[1]

వరి పొలం

విషయ సూచిక

[మార్చు] హరిత విప్లవం

ప్రధాన వ్యాసం: హరిత విప్లవం

భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్దతులు పాటించడం. వ్యవసాయంలో యాంత్రీకరణం ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచే నిమిత్తమై మూడో ప్రణాళికా కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్యోద్దేశం.

[మార్చు] భారతదేశంలో వ్యవసాయం

భారతదేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అవి

  1. ఖరీఫ్ పంట కాలం
  2. రబీ పంటకాలం
  3. జైద్ పంటకాలం

జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరు శనగ. అక్టోబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు - గోధుమ, బార్లీ, మినుములు, ప్రొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి. మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు - పుచ్చకాయలు, దోస కాయలు, కూరగాయలు, మొదలైనవి.

[మార్చు] వ్యవసాయ పనులు

  • భూమిని చదునుచేయడం:
  • ఎరువులు వేయడం:
  • దుక్కి దున్నడం:
  • నీరు పెట్టడం:
  • దమ్ము చేయడం:
  • చదునుచేయడం:
  • విత్తనాలను శుద్ధిచేయడం:
  • విత్తనాలు జల్లడం:
  • నారు నాటడం లేదా ఊడ్చడం:
  • దారులు చేయడం:
  • కలుపు మొక్కల్ని తొలగించడం:
  • పురుగు మందులు చల్లడం:
  • పంట కోయడం:
  • కోసిన పంటని ఎండబెట్టడం:
  • కట్టలు కట్టడం:
  • కుప్ప వేయడం:
  • నూర్చడం లేదా ధాన్యాన్ని వేరుచేయడం:
  • తూకం, బస్తాలు నింపడం:

[మార్చు] వ్యవసాయ పనిముట్లు

ఎద్దుల బండి

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

  1. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html#Econ.
పేజీకి సంభందించిన లింకులు