ఇంజనీరింగ్

వికీపీడియా నుండి

పారిశ్రామిక విప్లవానికి చోదకునిగా పనిచేసిన జేమ్స్ వాట్ ఆవిరియంత్రం. స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని ETSIIM భవనంలో ప్రదర్శనకు ఉంచబడినది.

చ్ (Engineering) అనగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజజీవితంలో అవసరమైన నిర్మాణాలను, వ్యవస్థలను, యంత్రాలను, వస్తువులను, పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక అధ్యయన శాస్త్రం. ఆధునిక సమాజం ఇంజనీరింగ్ ఫలాలైన అనేక వస్తువులను దైనందిన జీవితంలో ఉపయోగిస్తున్నది. వంతెనలు, భవనాలు, వాహనాలు, కంప్యూటర్లు మొదలైనవన్నీ ఇంజనీరింగ్ అద్భుతాలే. ఈ రంగం చాలా విశాలమైనది.


విషయ సూచిక

[మార్చు] అభియాంత్రికత - తెలుగు పదం

ఇంజనీరింగ్ అనే పదం ఆంగ్లంలో ఇంజన్ (Engine) నుంచి వచ్చినది. ఇంజనీరింగ్ కు సమానమైన తెలుగు పదం "అభియాంత్రికత". ఇంజన్ అంటే యంత్రం. ఇంజనీరింగ్ రంగంలో ప్రవేశం ఉన్నవ్యక్తిని ఇంజనీర్ (Engineer)(అభియాంత్రికుడు) అంటారు.


[మార్చు] చరిత్ర

ఇంజనీరింగ్ అనే భావన పురాతన కాలం నుంచీ అమల్లో ఉంది. మన ప్రాచీనులు తయారు చేసిన చక్రము, పుల్లీ, లివరు మొదలైనవన్నీ ఇంజనీరింగ్ సృష్టే.

[మార్చు] ఇంజనీరింగ్ విభాగాలు

  • సివిల్ ఇంజనీరింగ్ (Civil Engineering) - భవనాలు, వంతెనలు, డ్యాములు మొదలైన కట్టడాల నిర్మాణాల గురించిన శాస్త్రం.
  • కెమికల్ ఇంజనీరింగ్ (Chemical Engineering) - ముడి పదార్థాలను వాడుకునేందుకు వీలుగా తయారు చేసే ప్రక్రియల గురించి అధ్యయనం
  • ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (Aeronautical Engineering) - విమానాలు, మరియు అంతరిక్ష వాహనాల రూపకల్పన దీని క్రిందకు వస్తాయి.
  • మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical Engineering) - భౌతిక, యాంత్రిక వస్తువుల రూపకల్పన.
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (Electrical Engineering) - ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాల రూపకల్పన.
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (Automobile Engineering) - మోటారు వాహనాల రూపకల్పన.
  • కంప్యూటర్ ఇంజనీరింగ్ (Computer Engineering) - కంప్యూటర్ల రూపకల్పన.

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు