రేపల్లె

వికీపీడియా నుండి
  ?రేపల్లె మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో రేపల్లె మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో రేపల్లె మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°01′N 80°51′E / 16.02, 80.85
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము రేపల్లె
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 17
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,04,190 (2001)
• 51400
• 52790
• 67.03
• 72.48
• 61.74


రేపల్లె గుంటూరు జిల్లా లోని పట్టణం మరియు అదే పేరుతో గల మండలానికి కేంద్రం. రేపల్లె గుంటూరు పట్టణం నుండి 28 మైళ్ళ దూరంలో ఉన్నది.

విషయ సూచిక

పేరువెనుక చరిత్ర [మార్చు]

ప్రస్తుతం రోజులు ఎలా ఉన్నాయంటే` ఎవరైనా బంధువులు వస్తే వారెప్పుడు వెళ్ళి పోతారా? అని ఎదురు చూసేట్లుగా ఉన్నాయి. కారణం`పెరిగిపోయిన ధరలే! కానీ ` అక్కడ మాత్రం బంధువులోస్తే వెళ్ళనివ్వరు. వాళ్ళు వెళ్తామంటే రేపెళ్ళండంటారు. ఏ రోజు కా రోజు`ఇదే మాట! అంత అతిథి మర్యాద! దాంతో ఈ ప్రాంతాన్ని ‘రేపెళ్ళి’ గా ముద్దుగా పిలిచేవారు. అదే కాలక్రమంలో రేపల్లెగా స్థిరపడిరది.

రవాణా వ్యవస్థ [మార్చు]

రేపల్లె గుంటూరు డివిజన్ లో తెనాలి - రేపల్లె లైన్ కు చివరి స్టేషన్. రేపల్లె నుండి తెనాలి,గుంటూరు మరియు హైదరాబాద్ కు రైళ్ళు ఉన్నాయి. రేపల్లె లో బస్సు డిపో ఉన్నది. చుట్టుపక్కల అన్ని గ్రామాలకు రేపల్లె నుండి బస్సులు ఉన్నవి. పెనుమూడి వారధి నిర్మాణం తరువాత రేపల్లె నుండి కృష్ణా జిల్లా లో ఉన్న గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించడం జరిగినది.

దర్శనీయ స్థలములు [మార్చు]

పెనుమూడి గ్రామం వద్ద ఉన్న కృష్ణా నది ఒడ్డు మరియు మోర్తోట వద్ద ఉన్న శివుని ఆలయము ప్రసిద్థి స్థలములు. రేపల్లెని కృష్ణా జిల్లాతో కలుపుతూ కృష్ణా నది మీద 2006 లో వంతెన ప్రారంభించబడినది. వంతెన ప్రారంభం తరువాత కృష్ణా జిల్లా తో రాకపోకలు బాగా పెరిగాయి.

మండలంలోని గ్రామాలు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=రేపల్లె&oldid=837660" నుండి వెలికితీశారు