పత్తికొండ
| ?పత్తికొండ మండలం కర్నూలు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | పత్తికొండ |
| జిల్లా(లు) | కర్నూలు |
| గ్రామాలు | 11 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
60,951 (2001) • 31060 • 29891 • 51.26 • 65.60 • 36.31 |
పత్తికొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. పత్తికొండ, గుత్తి - ఆదోని మార్గంలో ఆస్పరి రైల్వే స్టేషను నుండి 12 మైళ్ల దూరంలో ఉన్నది. జిల్లా కేంద్రమైన కర్నూలు నుండి 50 మైళ్ళ దూరంలో ఉన్నది. పట్టణానికి పశ్చిమాన హంద్రీ నది ప్రవహిస్తున్నది.
[మార్చు] చరిత్ర
పత్తికొండ 14వ శతాబ్దంలో హరిహర రాయల కాలంలో నిర్మించబడింది. స్థానిక కైఫియత్తు ప్రకారం ఒక గొర్రెలకాపరి అడవిని నరికి ఇక్కడ ప్రత్తి పండించడం ప్రారంభించాడు. ఈ ప్రదేశంలో పంట బాగా పండటంతో, ఇతరులు ఇక్కడ చేరి, ఒక గ్రామం ఏర్పడింది. కాలక్రమంలో ఇక్కడ నాలుగు కుగ్రామాలు ఏర్పడ్డాయి. విజయనగర యువరాజైన కోనేరురాజు వంశజుడైన వెంకట రాజా ఈ గ్రామాన్ని జాగీరుగా పొంది, గ్రామాన్ని సమీపంలోని కొండమీదికి తరలించాడు. అందుకని గ్రామానికి పత్తికొండ అన్న పేరు వచ్చింది. వెంకట రాజా కుటుంబం క్షీణించిన తర్వాత దేవనకొండ పాలేగారైన బొజ్జప్పనాయుడు (మద్దికెర పాలేగార్ల పూర్వజుడు) పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. అయితే వెంటనే అతని వద్దనుండి మహమ్మదీయులు వశం చేసుకుని, ఆదోని మండలంలో కలుపుకున్నారు. షేర్ అలీబాబా సాహెబ్ అనే మహమ్మదీయుడు గ్రామాన్ని జాగీరుగా పొంది, ఇరవై సంవత్సరాలు అనుభవించాడు. ఆయన కొండ మీద కోటలో నివసిస్తూ, మంచి మనిషిగా పేరుతెచ్చుకున్నాడు.
1756లో బసాలత్ జంగ్ ఆదోని జాగీరును పొంది, పత్తికొండను ఉత్తమాన్ కు జాగీరుగా ఇచ్చాడు. అయితే ఉత్తమాన్ త్వరలోనే జాగీరును కోల్పోయాడు. బసాలత్ జంగ్, చనుగొండ్ల తాసీల్దారుగా నియమించిన మీర్ బక్ష్ సబ్జర్ జంగ్, మార్గాన్ పత్తికొండ ద్వారా వెళుతున్నపుడు ఉత్తమన్ ఆయనకు సరైన గౌరమివ్వలేదు. అవమానంగా భావించిన సబ్జర్ జంగ్, ఆదోని తిరిగివచ్చి రెండు వేల అశ్విక, పదాతి దళాలతో, బసాలత్ జంగ్ వద్ద పనిచేస్తున్న ఫ్రెంచి అధికారి, ఎం.లాల్లీ సైనిక ఆధ్వర్యాన పత్తికొండపై దాడిచేసి ముట్టడించాడు. 1800లులో పట్టణం దత్తమండలాలలో భాగంగా బ్రిటీషువారి పరమైంది. మద్రాసు రాష్ట్ర గవర్నరు సర్ థామస్ మన్రో 1827లో జూన్ 6న కలరా వ్యాధి సోకి ఇక్కడే మరణించాడు. [1]
పత్తికొండ 1858 వరకు బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్నది.అప్పట్లో ఈ ప్రాంతాన్ని పంచపాల్యం తాలూకాగా వ్యవహరించేవాళ్లు. ఈ ప్రాంతాన్ని ఐదుగురు పాలేగాళ్ళు పాలించడం వళ్ల ఆ పేరు వచ్చింది.[2] ఈ పాలేగాళ్ల రాజధానులు, చెన్నంపల్లి, ప్యాపిలి, కప్పట్రాళ్ల, మద్దికెర మరియు దేవనకొండలలో ఉండేవి. ఈ ఊళ్లన్నింటిలో పాలేగార్లు నిర్మించిన కోటదుర్గాలు ఉండేవి. కానీ అవి జీర్ణావస్థకు చేరాయి. [3]
[మార్చు] గ్రామాలు
- చెక్కరాళ్ల
- చిన్నహుల్తి
- దేవనబన్ద్
- దూదెకొండ
- హోసూరు
- జూటూరు
- నలకదొడ్డి
- పందికోన
- పత్తికొండ
- పెద్దహుల్తి
- పుచ్చకాయలమడ
[మార్చు] మూలాలు
|
|||||||