మొదటి హరిహర రాయలు
| విజయ నగర రాజులు |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
హరిహర రాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకుడు. ఇతనికి "హక్కరాయలు" మరియు "వీర హరిహరుడు" అనే పేర్లున్నాయి. హరిహర మరియు ఈతని తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా ఉన్నారు. 1323వ సంవత్సరములో ఓరుగల్లు పతనము తరువాత ఈ గొల్ల సోదరులిద్దరూ కంపిలికి పోయి ఆనెగొంది సంస్థానములో చేరారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1326లో కంపిలిని జయించినపుడు వీరిద్దరూ బందీలుగా ఢిల్లీ తరలించబడ్డారు. దారిలో భయంకరమగు గాలి దుమారము వచ్చి సైనికులు, బందీలు చెల్లాచెదరయ్యారు. సోదరులిద్దరు మాత్రము పారిపోక ఒక చెట్టు కింద కూర్చొనివుండగా సుల్తాను గమనించి వారిని ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి సంతసించి వారికి ఢిల్లీ దర్బారులో స్థానమిచ్చాడు. సోదరులిద్దరూ ఇస్లాం మతానికి మార్చబడ్డారు.
కంపిలిలో మాలిక్ నయీబు పట్ల వ్యతిరేకత పెల్లుబికి రాజ్యము చేజారిపోగా విప్లవాన్ని అణచివేయుటకు తుగ్లక్ హరిహర, బుక్క లను పంపాడు. అన్నదమ్ములు కంపిలి స్వాధీనము చేసుకొన్నారు. శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావముతో తిరిగి హిందూ మతము స్వీకరించి సుల్తాను నెదిరించి విజయనగర సామ్రాజ్యము స్థాపించారు. [1][2] [3].
మొదటగా హరిహరరాయలు, బుక్కరాయలు తుంగభద్రానది లోయ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. క్రమంగా కొంకణ తీరం, మలబారు తీరం వారి అధీనంలోకి వచ్చాయి. ఈ సమయంలో హొయసల రాజ్యం పతనమైంది. మధుర సుల్తానుతో యుద్ధంలో చివరి హొయసల రాజు వీరభల్లాలుడు మరణించాడు. ఇలా ఏర్పడిన పాలనాశూన్యత హరిహరరాయలుకు రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి బాగా పనికివచ్చింది. హొయసల రాజ్యం మొత్తం వారికి వశమయ్యింది. 1346 కాలానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు రెండు సముద్రాల మధ్యభాగానికి రాజు అని, అతని రాజధాని విద్యానగరమని చెప్పబడింది.
హరిహరుడు సుస్థిరమైన పాలనా వ్యవస్థను ఏర్పరచాడు. ఇందువల్ల రాజ్యం సుస్థిరమయ్యింది. ఇతని తరువాత ఇతని తమ్ముడు మొదటి బుక్క రాయలు రాజ్యానికి పాలకుడయ్యాడు. సంగమవంశంలో బుక్కరాయలు అందరికంటే ముఖ్యునిగా పరిగణించబడ్డాడు.
ఈయన గురించి అటకల గుండు శాసనం తెలియజేస్తుంది.
మూలాలు [మార్చు]
- ↑ "దుర్గాప్రసాద్, ఆంధ్రుల చరిత్ర".
- ↑ "రాబర్ట్ సెవెల్, మరుగున పడ్డ సామ్రాజ్యం విజయనగరం: A contribution to the history of India, రెండవ అధ్యాయం".
- ↑ N. Venkataramanayya, Vijayanagara: Origin of the City and the Empire, Bulletin of the Department of Ancient History and Archaeology, Madras University, Madras, 1931
| ఇంతకు ముందు ఉన్నవారు: మూడవ వీర బల్లాల |
విజయనగర సామ్రాజ్యము 1336 — 1356 |
తరువాత వచ్చినవారు: మొదటి బుక్క రాయలు |