శ్రీ విద్యారణ్య స్వామి

వికీపీడియా నుండి

జగద్గురు శ్రీ విద్యారణ్య స్వామి శృంగేరి శారదా పీఠము యొక్క 12వ పీఠాధిపతులు. వీరే సువిశాలమైన విజయనగర సామ్రాజ్యం స్థాపనకు నాంది పలికింది. వీరిరువురు అన్నదమ్ములు ఏకశిలా నగరం (ప్రస్తుత వరంగల్లు) లో పండిత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. విద్యారణ్య స్వామి వారి పూర్వాశ్రమ నామం మాధవ. ఇద్దరిలోను మాధవ పెద్దవాడు. చిన్నవాడు దక్షిణాదిగా ప్రయాణించి శృంగేరి చేరి జ్ఞానార్జన కోసం అప్పటి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర తీర్థను ఆశ్రయించారు. అతనిలోని ఉన్నత భావాలను గుర్తించి క్రీ.శ. 1328 సంవత్సరంలో సన్యాస దీక్షను ప్రసాదించి బారతీకృష్ణ తీర్థ అని నామకరణం చేశారు. తమ్మున్ని వెతుక్కుంటూ మాధవ చివరికి శృంగేరి చేరి సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన భారతీకృష్ణ తీర్థను గుర్తించాడు. తమ్ముని ప్రార్థన మీద విద్యాశంకర తీర్థ స్వామివారు మాధవకు కూడా క్రీ.శ. 1331 సంవత్సరంలో సన్యాసాశ్రమం ప్రసాదించి విద్యారణ్య అని నామకరణం చేశారు.

విద్యారణ్యులు కాశీ మరియు బదరీ యాత్రలు శ్రీ విద్యాపాసనతో తరించారు. దక్షిణాదికి తిరిగివచ్చి మాతంగి కొండలలో ఘోరమైన యోగసాధన చేశారు. అప్పుడు మాధవ మరియు శాయన అను అన్నదమ్ములు గురువుగారి అశీర్వాదం కోరగా వారికి అసంపూర్ణంగా ఉన్న వేద భాష్యాలను ఇచ్చి పూర్తిచేయమని ఆదేశించారు. ఇవే మాధవీయం మరియు శాయనీయం గా ప్రసిద్ధిచెందాయి. వీరిరువురూ విజయనగర సామ్రాజ్యంలో మంత్రులుగా పదవులు నిర్వహించారు. విద్యారణ్య తిరిగి కాశీ యాత్ర వెళ్ళారు.

ఇంతలో భారతీకృష్ణ తీర్థ శృంగేరి మఠాన్ని అధిరోహించి క్రీ.శ. 1333 నుండి 1380 వరకు పరిపాలించారు. భారతీకృష్ణ తీర్థ స్వామి గురువుగారు సమాధిచెందిన ప్రదేశంలో శ్రీ విద్యాశంకర దేవాలయం నిర్మించడం మొదలుపెట్టారు.

హరిహర బుక్కరాయలు విజయ పరంపరలో 1345 సంవత్సరం శృంగేరి చేరి భారతీకృష్ణుల ఆశీర్వచనాలు పొందారు. ఆ సందర్భంలో శారదా పీఠానికి భూవిరాళాల్ని ఇచ్చారు. విద్యారణ్య స్వామి కాశీ నుండి తిరుగు ప్రయాణంలో హంపి చేరి అక్కడ విరూపాక్ష దేవాలయం సమీపంలో తనకోసం మఠాన్ని నిర్మించారు. భారతీకృష్ణ తీర్థుల అనంతరం శారదా పీఠాధిపత్యాన్ని స్వీకరించి విద్యారణ్య స్వామి జగద్గురువులుగా 1380 నుండి 1386 వరకు పరిపాలించారు.


బయటి లింకులు [మార్చు]