వీరనరసింహ రాయలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

వీరనరసింహరాయలు విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి. తుళువ వంశ స్థాపకుడైన తుళువ నరస నాయకుని కుమారుడు. ఈయన అసలు పేరు కూడా తండ్రిలాగా నరస నాయకుడే, అయితే సింహాసనాన్ని మాత్రం వీర నరసింహ రాయలు అనే వీరోచిత పేరుతో అధిష్టించాడు. ఇతని తండ్రి నరస నాయకుడు 1503లో దివంగతుడైన తర్వాత వీరనరసింహరాయలు పెనుగొండ లో బందీగా ఉన్న సాళువ ఇమ్మడి నరసింహ రాయలు పేరుతో 1505 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ 1506లో అతనిని హత్యగావించి తనే రాజుగా సింహాసనాన్ని అధిష్టించాడు.

సామంతుల తిరుగుబాట్లు[మార్చు]

వీరనరసింహరాయలు సాళువ వంశాన్ని అంతమొందించి తనే రాజుగా మారడాన్ని సహించని సామంతులు తిరుగుబాట్లు చేసారు, ముఖ్యంగా ఆదోని పాలకుడు కాసెప్ప ఒడయరు, ఉమ్మత్తూరు పాలకుడు దేవరాజు, శ్రీరంగపట్నం పాలకుడు గుండరాజులు తిరుగుబాటు చేసారు.

బహుమనీ సుల్తాను మహమ్మద్ షా ఆదేశానుసారం అతని సామంతుడు యాసుఫ్ ఆదిల్ఖాన్ 1502లో విజయనగర రాజ్యంపైకి దండయాత్రకు బయలుదేరినాడు. అప్పటికే తిరుగుబాటు చేస్తున్న ఆదోని కాసెప్ప ఒడయారు అతనికి వంతగా తనూ సైనికులను నడిపించాడు, కానీ అరవీటి రామరాజు కుమారుడు అరవీటి తిమ్మరాజు కందనవోలు (కర్నూలు) ప్రాంతాన్ని పరిపాలిస్తూ విజయనగరాధీశులకు సామంతునిగా ఉండెను. అతను ఈ యూసుఫ్ ఆదిల్ఖాన్, కాసెప్ప ఒడయారు సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్ధమందు ఓడించి తరిమేశాడు. ఈ విజయానికి ఆనందించి వీర నరసింహరాయలు అదవాని (అదోని) సీమను అరవీటి తిమ్మరాజునకు విజయానికి కానుకగా ఇచ్చాడు. ఈ సంఘటన వల్ల అరవీటి వంశస్తులూ, తుళువ వంశస్తులూ చక్కని స్నేహితులు అయినారు.

వీరనరసింగ రాయలు మిగిలిన తిరుగుబాటు చేస్తున్న సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన శ్రీ కృష్ణదేవరాయలును రాజ్యపాలనకు నియమించి, 1508 నాటికి ఉమ్మత్తూరు, శ్రీరంగపట్టణములను ఓడించి విజయనగరము వచ్చాడు, కానీ మరల వీరు తోక జాడించారు. దానితో ఈ సారి తన సోదరులగు అచ్యుత రాయలు, శ్రీరంగ రాయలును సైన్యసమేతంగా సామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో కొంకణ ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు.

ఉమ్మత్తూరుపై యుద్ధంలో పోర్చుగీసు వారు గుఱ్ఱాలు, ఫిరంగులు సరఫరాచేసి రాయలకు సహాయం చేశారు. ప్రతిగా వీరు భట్కళ్ రేవుపై ఆధీనాన్ని పొందారు.

దక్షిణ దండయాత్ర[మార్చు]

తరువాత వీర నరసింహరాయలు మరొక దండయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసాడు.

ఈ దండయాత్రలన్నీ ముగిసిన తరువాత వీరు ఆధ్యాత్మిక మార్గంలో పడి కంచి, కుంభకోణము, పక్షితీర్థము, శ్రీరంగము, చిదంబరము, శ్రీకాళహస్తి, గోకర్ణము, రామేశ్వరము, త్రిపురాంతకము, అహోబలము, శ్రీశైలము, తిరుపతి, సంగమేశ్వరము మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించి అనేక దాన ధర్మాలను చేసాడు.

వారసుడు[మార్చు]

దక్షిణ దేశ యాత్రలు తరువాత వీర నరసింగ రాయలు జబ్బు పడినాడు. దానితో తన వద్ద మహామంత్రిగా ఉన్న సాళువ తిమ్మరుసును పిలిపించి, తన తరువాత, తన ఎనిమి సంవత్సరాల కొడుకు తిరుమల రాయలును రాజ్యానికి వారసునిగా చేయమనీ, అలాగే శ్రీ కృష్ణదేవ రాయలు కను గుడ్లు పీకి చూపించమనీ ఆజ్ఞాపించాడు. కానీ తిమ్మరుసు ముందుగానే అనేక యుద్ధములందు శ్రీ కృష్ణదేవరాయల ప్రతాప సామర్ధ్యములు ఎరిగి ఉన్నందువల్ల ఆ పని చేయలేక విషయమంతా కృష్ణదేవ రాయలుకు చెప్పి అతనిని ప్రవాసం పంపించి, ఓ మేక కనుగుడ్లు తెచ్చి చూపించి రాజును అవసాన కాలంలో సంతృప్తి పరచాడని ఒక కథనం ఉంది. కానీ అన్నదమ్ముల మధ్య సౌభ్రాతృత్వం తప్ప వైరమున్నట్టు ఎలాంటి చారిత్రకాధారాలు లేవు. వీర నరసింహరాయలు 1509లో మరణించాడు. ఆ తరువాత కృష్ణదేవరాయల పట్టాభిషేకం ఎలాంటి గొడవలు లేకుండా సునాయాసంగా జరిగిపోయింది.

విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
తుళువ నరస నాయకుడు
విజయనగర సామ్రాజ్యము
1503 — 1509
తరువాత వచ్చినవారు:
శ్రీ కృష్ణదేవ రాయలు