తాడిపత్రి
వికీపీడియా నుండి
| ?తాడిపత్రి మండలం అనంతపురం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | తాడిపత్రి |
| జిల్లా(లు) | అనంతపురం |
| గ్రామాలు | 27 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
137,811 (2001) • 70150 • 67661 • 59.88 • 73.21 • 46.09 |
తాడిపత్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల మండలము.
విషయ సూచిక |
[మార్చు] తాడిపత్రి పట్టణం
తాడిపత్రి పరిసర ప్రాంతాలను భాస్కరక్షేత్రం అని కూడా అంటారు. పట్టణం దక్షిణ ప్రాంతంలో దట్టమైన తాటి చెట్ల వనం ఉంది. విజయనగర సామ్రాజ్యం పాలకుడు ప్రౌఢ దేవరాయలు కాలంలో పెమ్మసాని రామలింగనాయుడు ఈ ప్రాంతానికి పాలెగాడుగా ఉండేవాడు. అప్పుడు ఈ ప్రదేశంపేరు "తాటిపత్రి". తాటి చెట్లు అధికంగా ఉన్నందున ఈ పేరు వచ్చిందంటారు. (శ్రీరాముడు తాటకిని వధించిన స్థలం ఇదేనని మరొక స్థలపురాణం).
తాడిపత్రిలో రెండు ప్రసిద్ధ దేవాలయాలున్నాయి. ఇవి రెండూ ఇద్దరు సోదరులచే కట్టించబడ్డాయని ఒక కధనం కూడా ఉంది. విజయనగర రాజులకాలంనాటి శిల్పకళ వీటి నిర్మాణంలో కనిపిస్తుంది.
- చింతల వెంకటరామస్వామి మందిరం: పట్టణం మధ్యలో 5 ఎకరాల స్థలంలో ఉంది. ఒక భూకంపంలో దెబ్బతిన్న ఈ ఆలయం విమానాన్ని ఇటీవల పునర్మిర్మించారు. ఆలయం గోడలపై రామాయణ, భారత, భాగవత గాధలను చెక్కారు. ఇక్కడినుండి గుత్తి దుర్గానికి ఒక సొరంగం ఉన్నదంటారు.
- బుగ్గా రామలింగేశ్వరస్వామి మందిరం: పట్టణానికి ఉత్తర దిశలో పెన్నానది తీరాన ఉన్నది.
[మార్చు] మండలం
బెలూం గుహలు తాడిపత్రికి 20 కి.మీ. దూరంలో ఉన్నాయి. 10 కి.మీ. దూరంలో ఉన్న ఆలూరులో రంగనాధస్వామి మందిరం,హాజీవలీ దర్గా,15కి.మీ.దూరంలొ శ్రీ అశ్వర్ద నారాయణ స్వామి మందిరాలు ప్రసిద్ధి చెందాయి.
తాడిపత్రి మండలంలో అల్ట్రాటెక్ సిమెంట్(L&T)., పెన్నా సిమెంట్స్, SJK స్టీల్స్ (Kalyani Gerdau steel Ltd) వంటి కర్మాగారాలున్నాయి. కడప రాతికి కూడా తాడిపత్రి ప్రసిద్ధం. పట్టణం పరిసర ప్రాంతాలలో షుమారు 600 గ్రానైట్ ప్రోసెసింగ్ పరిశ్రమలున్నయి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- శ్రీనివాసపురం (తాడిపత్రి)
- బ్రాహ్మణపల్లె
- వెంకటంపల్లె
- భోగసముద్రం
- తలారిచెరువు
- ఊరుచింతల
- వెలమకూరు
- ఆలూరు
- సజ్జలదిన్నె
- కావేరిసముద్రం
- చుక్కలూరు
- పులిప్రొద్దటూరు
- గంగదేవిపల్లె
- ఇగుడూరు
- సీతారాంపురం
- కోమలి
- పెద్దపొలమడ
- చిన్నపొలమడ
- నందలపాడు (గ్రామీణ)
- దిగువపల్లె
- తాడిపత్రి (గ్రామీణ)
- చల్లావారిపల్లె
- జంబులపాడు
- హుసేనాపురం
- వీరాపురం
- బోడాయిపల్లె
- వంగనూరు
- బొందలదిన్నె
[మార్చు] మండలంలోని పట్టణాలు
- తాడిపత్రి
[మార్చు] ఇవి కూడా చూడండి
|
|||||||