నాయుడుపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నాయుడుపేట
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో నాయుడుపేట మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో నాయుడుపేట మండలం యొక్క స్థానము
నాయుడుపేట is located in ఆంధ్ర ప్రదేశ్
నాయుడుపేట
ఆంధ్రప్రదేశ్ పటములో నాయుడుపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°54′00″N 79°54′00″E / 13.9000°N 79.9000°E / 13.9000; 79.9000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము నాయుడుపేట
గ్రామాలు 33
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 68,631
 - పురుషులు 34,802
 - స్త్రీలు 33,829
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.98%
 - పురుషులు 77.93%
 - స్త్రీలు 61.82%
పిన్ కోడ్ {{{pincode}}}

నాయుడుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము,మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక ముఖ్యపట్టణం.ఈ పట్టణ జనాబా సుమారు 50 వేలు.ఇది నెల్లూరు నగరమునకు సుమారు 57 కిలోమీటర్ల దూరంలొ ఉంది మరియు చెన్నై నుండి 108 కిలోమీటర్లు, తిరుపతి నుండి 61 కిలోమీటర్ల దూరంలొ ఉంది.నాయుడుపేట పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముఖ్యమైన కూడలి.ఈ పట్టణం గుండా చెన్నై ,తిరుపతి,నెల్లూరు వంటి నగరములకు రోజూ అధిక సంఖ్యలో ప్రయాణీకులు వెల్తుంటారు.

వ్యవసాయం[మార్చు]

ఈ మండలంలో ప్రధాన వానిజ్య పంట చెరకు.దీనితోపాటుగా వరిని కుడా సాగు చేస్తారు.

వ్యవసాయాని కి కావలిసిన మొటర్శ్ నూ ఎ.కే.బీ బేరీపేట వారు తక్కువ దరకు అద్ద్సారు

విద్యా సౌకర్యాలు[మార్చు]

కళాశాల వార్షికోత్సవ ద్రుశ్యము

నాయుడుపేటలో మొత్తం 15 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎ.ఎల్.సి.ఎమ్ ఉన్నత పాఠశాల చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఈ పాఠశాలలో కొంతకాలం విద్యాబ్యాసం చేసారు. అలాగే ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 1983లో స్థాపించిన ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు 6 ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ రెండు గ్రంధాలయాలు ఉన్నాయి. విద్యకు సంబంధించి నాయుడుపేట పట్టణమునకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

నాయుడుపేట చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-నెల్లూరు ల మధ్య ఉన్నది. తిరుపతి,నెల్లూరు, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విశాఖపట్టణం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు. ఇక్కడ నుంచి చెన్నై కి ప్రతి 20 నిమిషాలకు బస్సు సౌవుకర్యం కలదు,మరియు బెంగళూరు కి కూడా ఆదిక సంఖ్యలో బస్సు సౌకర్యం కలదు.ఇంకా ప్రముఖ నగరమైన తిరుపతి కి ప్రతి 5 నిమిషములకు బస్సులు విరివిగా కలవు.పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కు విరివిగా బస్సులు కలవు.

నాయుడుపేట చెన్నై-విజయవాడ రైలు మార్గములో ఒక స్టేషను. ఇక్కడ నుండి విజయవాడ, చెన్నై, హైదరాబాదు, .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు. నాయుడుపేట స్టేషన్ లో ఆగు రైళ్ళు:

  • హైదరాబాద్ ఎక్స్ ప్రెస్.
  • చార్మినార్ ఎక్స్ ప్రెస్.
  • లక్నొ ఎక్స్ ప్రెస్.
  • సర్కార్ ఎక్స్ ప్రెస్.
  • జమ్ము-తావి ఎక్స్ ప్రెస్.
  • డెహ్రడూన్ ఎక్స్ ప్రెస్.

నదులు[మార్చు]

ఈ ఊరు స్వర్ణముఖినది ఒడ్డున ఉన్నది. ఈ నది శ్రీకాళహస్తి మీదుగా నాయుడుపేట చేరి అటుపైన వాకాడు మీదుగా బంగాళాఖాతములో కలుస్తుంది.స్వర్ణముఖి నది ఒడ్డున పరమశివుని ఆలయం ఉన్నది.ఈ స్వర్ణముఖి నదిలో ప్రతి సంవత్సరం యేటి పండుగలు నిర్వహిస్తారు.

పరిశ్రమలు[మార్చు]

నాయుడు పేటలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక బీడీ ఫ్యాక్టరీ, ఒక చక్కెర కర్మాగారము ఉన్నాయి. ఈ బీడీ ఫ్యాక్టరి వలన సుమారు 20000 మందికి పైగా ఉపాది పొందుతున్నారు.ఈ చక్కెర కర్మాగారము నుండి ఇతర దేశాలకు చక్కెర ఎగుమతి అవుతుంది. నాయుడుపేటకు సుమారు 7కి.మి దూరంలో బి.జె.టెక్సెటైల్స్ ఫ్యాక్టరి ఉంది.

బ్యాంకులు[మార్చు]

  • ఆంధ్రాబ్యాంక్
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ఆంధ్ర ప్రగతి బ్యాంక్
  • సిండికేట్ బ్యాంక్
  • యు.టి.ఇ బ్యాంక్
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
  • ఇ.సి.ఇ.సి.ఇ బ్యాంక్
  • కేంద్ర సహకార బ్యాంక్

సంస్కృతి[మార్చు]

సినిమాథియేటర్లు[మార్చు]

  • సి.ఎస్.తేజ
  • శ్రీనివాస
  • మురారి

దేవాలయాలు[మార్చు]

నాయుడు పేటలో మూడు శివాలయాలు, మూడు రామాలయాలు, మూడు ఆంజనేయస్వామి ఆలయాలు, మూడు వినాయకుడి గుడులు, రెండు సాయి మందిరాలు, ఒక కృష్ణ మందిరము, కన్యకా పరమేశ్వరి ఆలయము ఒకటి ఉన్నాయి. ఇంకా ఇక్కడ మూడు మసీదులు, రెండు దర్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి హజరత్ షా వలి దర్గా, ఇది పెద్దది. ఈ దర్గా కి ప్రతి సంవత్సరం చాలా వైభవంగా గంథమహొత్సవం (ఉర్సు) జరుగుతుంది.అలాగె ఒక కరిమాణిక్యస్వామి ఆలయం కూడా ఉంది.స్వర్ణముఖి నది ఒడ్డున పరమశివుని ఆలయం కలదు.

గ్రామదేవతలు[మార్చు]

నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ. ఊరిలో పోలేరమ్మ జాతర ఘనంగా చేస్తారు. ఇంకా ఇక్కడ అంకమ్మ గుడి, మూకాంబిక గుడి, మహలక్ష్మి గుడి, పెద్దపాలెమ్మ గుడి, కావమ్మ గుడి ఉన్నాయి.

ఇతర గ్రామ విశేషాలు[మార్చు]

నాయుడుపేట నుంచి తుమ్మురు 4కి.మి దూరంలో ఉంది.ఈ ఊరి జనాభా సుమారు 2500 మంది ఉన్నారు.

ఈ ఊరి విశేషాలు :

  • ఈ ఊరిలో చోళుల కాలంలో నిర్మితమైన కరిమాణిక్యస్వామి గుడి ఉంది.
  • మే నెలలో ఈ గుడిలో 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.

కోడ్స్[మార్చు]

  • పిన్ కోడ్: 524126
  • ఎస్.టీ.డీ.కోడ్:
  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

గ్రామాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=నాయుడుపేట&oldid=1189772" నుండి వెలికితీశారు