సాలూరు
| ?సాలూరు మండలం విజయనగరం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | సాలూరు |
| జిల్లా(లు) | విజయనగరం |
| గ్రామాలు | 81 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,01,386 (2001) • 49731 • 51655 • 52.09 • 61.55 • 43.02 |
సాలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము. సాలూరు వంశధార ఉపనదైన వేగావతి ఒడ్డున వుంది. ఈ ఊరు అత్యంత సుందరమైన ప్రదేశం. ఈ ఊరులో పురాతనమైన శివాలయం వున్నది. ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల వున్నాయి, ఇవి ఆహ్లాదకరమైన వాతావరణంలో వున్నాయి. ఈ ఊరులో చాల చూడచక్కని ప్రదేశాలు వున్నాయి.
సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గం.
విషయ సూచిక |
[మార్చు] పురపాలక సంఘం
సాలూరు 1950 సంవత్సరం వరకు గ్రామ పంచాయితి. 26 సెప్టంబరు 1950 సంవత్సరంలో గ్రామ పంచాయితీ స్థాయి నుండి మూడవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని కల్పించారు. 1950 సంవత్సరంలో సాలూరు పురపాలక సంఘ పరిధి 13.58 మైళ్ళు. 2001 సంవత్సరం లొ రెండవ గ్రేడ్ పురపాలక సంఘ స్థాయికి ఉన్నతిని పొందిన తరువాత సాలూరు పురపాలక సంఘ పరిధి 19.55 మైళ్ళు. సాలూరు పట్టణం లొ పువ్వుల పెంపకం, లారీల శరీరాలు తయారు చేయడం (బాడి బిల్దింగ్), లారీ, బస్సుల ట్యూబ్ లు టైర్లు రిపేరు చేయడం ప్రధాన వృత్తులు. పట్టణం లొ 24 ప్రాధమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు, 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అంతేకాక పట్టణం లొ 13 రైస్ మిల్లులు, 2 రంపం మిల్లులు (వడ్రంగి పనికి చెక్క కోసే మిల్లు), 3 ఇంజనీరింగ్ వర్క షాప్ లు, 15 వాహానాల రిపైరు చేసే షెడ్స్, 8 లారీ బాడి బిల్డింగ్ కర్మాగారాలు ఉన్నాయి. పట్టణం లొ ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, హోమియో ఆసుపత్రి, 5 ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, 30 మంది వైద్యులతో ఒక కమ్యూనిటి ఆరోగ్య కేంద్రం ఉన్నాయి.
1959 సంవత్సరం పట్టణానికి రక్షిత మంచి నీరు సరఫరా చేసే ఉద్దేశ్యంతో ఒక బావిని, ఒక పంప్ హౌస్ ని, ఒక ఓవర్ హెడ్ నీరు భద్రపరచే జలాశయాన్ని నిర్మించారు. రక్షిత మంచి నీటి పథకానికి నీటి ఆధారం వేగావతి నది. ఈ పథకానికి 1987, 1993, 2001 సంవత్సరాలలొ జరిగిన ఉన్నత మార్పుల వల్ల , 2002 సంవత్సరం నుండి పట్టణం లొ 80 శాతం మందికి రక్షిత మంచి నీరు సరఫరా అవుతోంది. రోజుకి సగటున 3.69 MLD (8.11 లక్ష గ్యాలన్ల) నీరు సరఫరా చేయబడుతోంది. నీటి ఫలకం భూమి నుండి 12 మీటర్ల లోతు లొ ఉన్నది.
[మార్చు] సాలూరు శాసనసభా నియోజకవర్గం
- ప్రధాన వ్యాసం: సాలూరు శాసనసభా నియోజకవర్గం
సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గంగా 1951 సంవత్సరం నుండి శాసనసభ్యుల్ని ఎన్నుకొంటుంది. ఇది వెనుకబడిన తెగలకు (Scheduled Tribes) రిజర్వ్ చేయబడినది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ మరియు మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి
సాలూరు నుండి ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక:
- 1951 - కూనిశెట్టి వెంకట నారాయణ దొర
- 1955 - అల్లు ఎరుకు నాయుడు
- 1955, 1967, 1983 and 1985 - బోయిన రాజయ్య
- 1962 - సూరి దొర
- 1962 and 1989 - రాజా లక్ష్మీ నరసింహ సన్యాసిరాజు
- 1972 - జన్ని ముత్యాలు
- 1978 - S.R.T.P.S. వీరప రాజు
- 1994, 1999 - రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్.
- 2004 - రాజన్న దొర
[మార్చు] పట్టణ ప్రముఖులు
- బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయులు అయిన పురిపండా అప్పలస్వామి (1904-1982) సాలూరులో జన్మించారు.
[మార్చు] అంగజాల జగన్నాథయ్య
అంగజాల జగన్నాథయ్య (1932 - 1989) సుప్రసిద్ధ వ్యాపారవేత్త. వీరి స్వస్థలం విజయనగరం జిల్లాలోని బలిజిపేట గ్రామం. వీరు వ్యాపారరీత్యా సాలూరు పట్టణానికి 1960 ప్రాంతంలో వచ్చారు. ఈయన తల్లిదండ్రులు అంగజాల పెదప్పయ్య మరియు ఇండుగు కొండమ్మ. తండ్రి గారు బలిజిపేటలో పేరుపొందిన వ్యాపార ప్రముఖులు. ఈయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బలిజిపేట గ్రామంలోనే జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. కోసం దగ్గరిలోని విద్యాకేంద్రమైన బొబ్బిలి వెళ్ళి అక్కడి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివారు. వీరు 1952లో మద్దమశెట్టి సావిత్రమ్మను వివాహం చేసుకున్నారు. భారత స్వాతంత్యం అనంతరం 1947లో అన్నయ్య అయిన కృష్ణమూర్తి గారు చనిపోవడంతో చదువు ఆపి తండ్రి గారి వ్యాపార విషయాలలో కేంద్రీకరించారు. జగన్నాథయ్య గారు, బావమదరులైన మద్దమశెట్టి శ్రీరాములప్పయ్య మరియు భరతారావు గార్లతో కలిసి శ్రీకృష్ణా ట్రేడర్స్ పేరుతో వ్యాపారసంస్థను స్థాపించి, ఉమ్మడిగా వ్యాపారం మొదలుపెట్టారు. వీరు ముగ్గురూ త్రిమూర్తుల వలె వ్యాపారాన్ని వృద్ధిచేసి ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవారు. వీరు ముఖ్యంగా చింతపండు వ్యాపారం చేసినా, కొంతకాలం నూనెదినుసులు మొదలైన ఇతర వ్యాపారాలు కుడా చేశారు. వీరు చింతపండును పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని, మన రాష్ట్రంలోను మరియు తమిళనాడు రాష్ట్రాలకు అమ్మి టోకు వ్యాపారం మరియు కమిషన్ కోసం కూడా క్రయవిక్రయాలు చేశారు. కొనుగోలు ఎక్కువగా గిరిజన అభివృద్ధి సంస్థ నుండి లేదా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి కొనేవారు. వాటిని బస్తాలలో లారీలు లేదా రైలు ద్వారా సాలురుకు తరలించి నిలువచేసేవారు. చింతపండు నుండి గింజలను వేరుచేయడానికోసం (Deseeding process) కొట్లు పెట్టి ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించారు. ఇలా పిక్క తీసిన చింతపండును తిరిగి వెదురు బుట్టలలో గోదావరి జిల్లాలకు లేదా మధురై మొదలైన ప్రాంతాలకు లారీల ద్వారా ఎగుమతి చేశేవారు.
[మార్చు] పవిత్ర స్థలాలు
- పంచ ముఖేశ్వరాలయం :
- జగన్నాథస్వామి గుడి
- కన్యకా పరమేశ్వరి గుడి
- శ్యామలాంబ గుడి
- ముత్యాలమ్మ తల్లి గుడి
- వేణు గోపాలస్వామి గుడి
- శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం
- శ్రీ రామాలయం
- అయ్యప్ప స్వామి ఆలయం
- శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం
- శ్రీ బంగారమ్మతల్లి గుడి
- శ్రీ సాయిరామ్ గుడి
[మార్చు] క్రైస్తవ దెవాలయాలు
- రోమను కేథలిక్ చర్చి
- St. పాల్ లుథర్న్ చర్చి
- ది లివింగ్ చర్చ్ ఆఫ్ ఇండియా
- ఆబ్బాఫాధర్ బైబిల్ బిలీవియర్స్
[మార్చు] మండలంలోని పట్టణాలు
- సాలూరు
[మార్చు] మండలంలోని గ్రామాలు
- సిరివర
- పోయిమల
- సూరపాడు (కంజుపాక వద్ద)
- బండపాయి
- గుంజరి
- చింతమల
- మసికచింతలవలస
- కొదమ
- చొర
- ముదంగి
- జగ్గుదొరవలస
- చినవూటగెడ్డ
- తుండ
- మైపల్లి
- పట్టుచెన్నూరు
- సొలిపిగుడ
- పగులచెన్నూరు
- దొలియంబ
- లోలింగభద్ర
- ఎగువమెండంగి
- డొంకలవెలగవలస
- పనసలవలస
- మావుడి
- కొట్టుపరువు
- దిగువమెండంగి
- తోనం
- నిమ్మలపాడు
- శిఖపరువ
- ముదకరు
- కొటియ
- గంజాయిభద్ర
- జిల్లేడువలస
- దూళిభద్ర
- ఎగువసెంబి
- దిగువసెంబి
- సరికి
- మొఖాసా దండిగం
- కుదకరు
- మరిపల్లి
- తీనుసమంతవలస
- భూతాలకర్రివలస
- మఖాసమామిడిపల్లి
- కందులపదం
- ముచ్చెర్లవలస
- పందిరిమామిడివలస
- అన్నంరాజువలస
- కుద్దడివలస
- లక్ష్మీపురం
- చెమిడిపాటిపోలం
- ఎదులదండిగం
- అంతివలస
- దత్తివలస
- గుర్రపువలస
- ములక్కాయలవలస
- కురుకుట్టి
- కరదవలస
- దగరవలస
- కరసువలస
- కొత్తవలస
- కండకరకవలస (జానావారివలస వద్ద)
- కొదుకరకవలస
- తుపాకివలస
- నార్లవలస
- గడిలవలస
- మిర్తివలస
- బాగువలస
- పురోహితునివలస
- వల్లపురం
- పెదపదం
- ముగడవలస
- జీగిరం
- నెలిపర్తి
- దుగ్దసాగరం
- కూర్మరాజుపేట
- చంద్రప్పవలస
- తెంతుబొడ్డవలస
- దేవుబుచ్చెమ్మపేట
- బొరబండ
- శివరామపురం
- పరన్నవలస
- భవానిపురం
- చినబొరబంద
|
||||||||||||||||||||||||||
విజయనగరం జిల్లా మండలాలు
కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బలిజిపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బాడంగి | తెర్లాం | మెరకముడిదాం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొండపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | డెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస
