గుడివాడ
| ?గుడివాడ మండలం కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | గుడివాడ |
| జిల్లా(లు) | కృష్ణా జిల్లా జిల్లా |
| గ్రామాలు | 29 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,52,285 (2001) • 75674 • 76611 • 76.04 • 80.99 • 71.19 |
గుడివాడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము. గుడివాడని పూర్వం గుళ్ళవాడ అనేవారు అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణములో చాలా గుడులు ఉన్నాయి. ఇక్కడున్న వేంకటేశ్వర స్వామీ, భీమేశ్వరాలయం ముఖ్యమైనవి.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణ లో భాగంగా అశోకుడు, కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధం లో గెలిచిన అశోక చక్రవర్తిని రాజు గా అంగీకరించారు. క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలం లో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై . కృష్ణాతీరం లో అశోకుని కాలానికి ఎన్నో బౌద్ధ కేంద్రాలు ప్రసిద్ది చెందాయి. ఆ కాలం లో కృష్ణా నది కి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే .
అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్య పేట, బోడపాడు, చందోలు తో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి . కృష్ణా నది తీరం లో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి ,మహా చైత్యాలు గా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబందించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని ,ఆ నివేదికను పుణీ లో నార్ల వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.
[మార్చు] విద్యా సౌకర్యాలు
- ఏ ఎన్ ఆర్ ఆర్ట్స్ కళాశాల (అక్కినేని నాగేశ్వరరావు గారిచే స్థాపితము)
- వి.కె.ఆర్ మరియు వి.ఎన్.బి పాలిటెక్నిక్ కళాశాల. మరియు ఇంజనీరింగ్ కళాశాల కూడా కలదు.
- డాక్టర్ గురురాజు ప్రభుత్వ హొమియోపతీ వైద్య కళాశాల (1945లో స్థాపితము ధక్షిణ భారతదేశం లో ప్రథమ హొమియోపతీ వైద్య కళాశాల).
[మార్చు] రవాణా సౌకర్యాలు
గుడివాడ పట్టణము నుండి దగ్గర, దూర అన్నిప్రాంతముల వైపులకు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యములు కలవు. ఈ పట్టణము నుండి దాదాపుగా 30-35 కి.మీ. దగ్గరలో గన్నవరం విమానాశ్రయము కలదు.
- గుడివాడ ప్రాంతము నుండి భీమవరం మరియు మచిలీపట్నం రైల్వే మరియు బస్ వసతులు కలవు.
- గుడివాడ రైల్వే జంక్షన్ .
- గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ మరియు విధుయుతీకరణ లేక పోవటం ప్రధాన సమస్య.
- గుడివాడ ప్రాంతం నుండి తిరుపతి,విశాఖపట్నం,ముంబై,షిరిడి,పురి,భిలాసాపూర్,భువనేశ్వర్,విజయవాడ మరియు హైదరాబాద్ రైళ్లు కలవు.
- రైళ్లు వివరములు : - 17049 - మచిలీపట్నం నుండి సికందరాబాద్.
17255 - నరసాపురం నుండి హైదరాబాద్. 17210 - కాకినాడ నుండి బెంగళూరు
[మార్చు] ఇతర విశేషాలు
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం గుడివాడ శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] గ్రామాలు
- అల్లిదొడ్డి
- జొన్నపాడు (గుడివాడ మండలం)
- జనార్ధనపురము (గుడివాడ మండలం)
- బేతవోలు
- బిల్లపాడు
- బొమ్ములూరు
- చిలకమూడి
- చినయెరుకపాడు
- చినవానిగూడెం
- చిరిచింతాల
- చౌటపల్లి
- దొండపాడు (గుడివాడ మండలం)
- గంగాధరపురం
- గుడివాడ
- గుంటకోడూరు
- కల్వపూడిఅగ్రహారం
- లింగవరం
- మందపాడు
- మెరకగూడెం
- మోటూరు
- పెదఎరుకపాడు
- రామచంద్రాపురం
- రామనపూడి
- సైదేపూడి
- సీపూడి
- సేరిదింటకూరు
- శేరిగొల్వేపల్లి
- సేరి వేల్పూర్
- సిద్ధాంతపురం
- తటివర్రు
- వలివర్తిపాడు
గుడివాడ లొ 1983 లొ నందమూరి తారక రామారావు అసెంబ్లీ కి ఎన్నికయ్యారు.
|
|||||||
|
|
|
|---|---|
| అల్లిదొడ్డి · బేతవోలు · బిల్లపాడు · బొమ్మూరు · చిలకమూడి · చినయెరుకపాడు · చినవానిగూడెం · చిరిచింతాల · చౌటపల్లి · దొండపాడు (గుడివాడ మండలం) · గంగాధరపురం · గుడివాడ · గుంటకోడూరు · కల్వపూడిఅగ్రహారం · కసిపూడి · లింగవరం · మందపాడు · మెరకగూడెం · మోటూరు · పెదయెరుకపాడు · రామచంద్రాపురం · రమనపూడి · సైదుపూడి · సీపూడి · సేరిదింటకూరు · సేరిగొల్వేపల్లి · సేరి వేల్పూర్ · సిద్ధాంతపురం · తాటివర్రు · వలివర్తిపాడు |