మోపిదేవి
| ?మోపిదేవి మండలం కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | మోపిదేవి |
| జిల్లా(లు) | కృష్ణా జిల్లా జిల్లా |
| గ్రామాలు | 17 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
36,012 (2001) • 18071 • 17941 • 61.35 • 66.89 • 55.81 |
మోపిదేవి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. మోపిదేవి మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది.
స్థలపురాణం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని మూలమూర్తి స్వయంభూలింగం. వీరారపు పర్వతాలు అనే కుమ్మరి శివభక్తుని భక్తికి మెచ్చి శివుడు కలలో కనిపించి మోపిదేవి గ్రామంలోని చీమలపుట్టను త్రవ్వి తన లింగాన్ని బయల్పరచమని ఆదేశించాడు. పర్వతాలు తన కల గురించి గ్రామస్థులకు తెలియజేసి కలలో కనిపించిన ప్రదేశంలో చీమలపుట్టను త్రవ్వాడు. ఆశ్చర్యకరంగా బయల్పడిన లింగాన్ని ఆ చీమలపుట్టపైనే ప్రతిష్టించి గ్రామస్థులు పూజించడం ప్రారంభించారు. పర్వతాలు గుఱ్ఱము, నంది, కోడి మరియు గరుత్మంతుని విగ్రహాలను బంకమన్నుతో తయారుచేశాడు. మహాఋషుల విగ్రహాలను కూడా బంకమన్నుతో తయారుచేసి బట్టిలో కాల్చి కలకాలం చెక్కుచెదరకుండా తీర్చిదిద్దాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లపల్లి జమిందారీ కుటుంబం యొక్క ఇలవేల్పు. ఇప్పటికీ వీరి ఆధ్యర్యంలోనే ఆలయ నిర్వహణ కొనసాగుతున్నది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే మరో ప్రసిద్ధ ఆలయం - శ్రీ సకలేశ్వరస్వామి ఆలయం ఉన్నది. ఇది కూడా స్వయంభూలింగమే సగర మహారాజు పూజించిన లింగం కావడంతో ఆ పేరు వచ్చింది. 1783లో మోపిదేవి వరదలలో కొట్టుకుపోయినప్పుడు ఈ లింగం బయల్పడింది. అప్పటి జమీందారైన అడుసుమిల్లి గంగుభొట్లు ఆలయం నిర్మింపజేశాడు. అయితే ఆ లింగం భూమిలో ఇంకా ఎంత లోతువరకు విస్తరించి ఉన్నదో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ అడుసుమిల్లి కుటుంబం చేతిలో ఉన్నది.
ఈ రెండు ఆలయాలను సందర్శించడానికి భక్తులు ఆంధ్రదేశమంతటి నుండి విచ్చేస్తారు.
[మార్చు] గ్రామాలు
- అన్నవరం
- అయోధ్య
- బొబ్బర్లంక
- చిరువోలు
- చిరువోలులంక ఉత్తరం
- కప్తానుపాలెం
- కొక్కిలిగడ్డ
- మెల్లమర్రు
- మెల్లమర్తిలంక
- మెరకనపల్లి
- మోపిదేవి
- మోపిదేవిలంక
- నాగాయతిప్ప
- పెదకళ్ళేపల్లి
- పెదప్రోలు
- రావి వారి పాలెం
- టేకుపల్లి
- వెంకటాపురం
- సొర్లసొన్ది
|
|||||||