చల్లపల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చల్లపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం చల్లపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి కట్టా పద్మావతి
జనాభా (2001)
 - మొత్తం 15,423
 - పురుషులు 7,558
 - స్త్రీలు 7,865
 - గృహాల సంఖ్య 3,935
పిన్ కోడ్ 521 126
ఎస్.టి.డి కోడ్ 08671
చల్లపల్లి
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో చల్లపల్లి మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో చల్లపల్లి మండలం యొక్క స్థానము
చల్లపల్లి is located in ఆంధ్ర ప్రదేశ్
చల్లపల్లి
ఆంధ్రప్రదేశ్ పటములో చల్లపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°07′00″N 80°56′00″E / 16.1167°N 80.9333°E / 16.1167; 80.9333
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము చల్లపల్లి
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 53,813
 - పురుషులు 26,885
 - స్త్రీలు 26,928
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.59%
 - పురుషులు 74.84%
 - స్త్రీలు 64.35%
పిన్ కోడ్ 521126

చల్లపల్లి (ఆంగ్లం: Challapalli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము. పిన్ కోడ్ నం. 521 126., ఎస్.టి.డి.కోడ్ = 08671.

చల్లపల్లి విజయవాడ నుండి 70 కి.మీలు మరియు మచిలీపట్నము నుండి 25 కి.మీ.ల దూరములో ఉన్నది. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, హైదరాబాదు, నుండి నేరుగా బస్సు సౌకర్యము కలదు.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ 1888 లో బ్రిటిష్ వారి కాలంలోనే ఏర్పడింది. నియోజకవర్గంలోనే అతి పెద్ద రెండవ పంచాయతీ. 2011 నాటికి ఓటర్లు=10,557. 2013 జులైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కట్టా పద్మావతి సర్పంచిగా ఎన్నికైనారు. [3]

1982లో తాలుకా విధానమును మార్చిన తరువాత, దివి తాలుకా నుంచి చల్లపల్లి మండలమును సృష్టించారు. చల్లపల్లి గ్రామానికి 400 సంవత్సరాల చరిత్ర కలదు.

చల్లపల్లి రాజులు/జమిందారులు[మార్చు]

చల్లపల్లిని రాజధానిగా యార్లగడ్డ వంశీకులు దేవరకోట రాజ్యమును కొద్ది కాలము పాలన చేశారు. ఇప్పటికీ ఇక్కడ చల్లపల్లి రాజా కట్టించిన చల్లపల్లి కోట అనే భవంతి కలదు. క్రీ.శ. 1576 లో యార్లగడ్డ గురువారాయడు ఈ రాజ్యమును స్థాపించారని ప్రతీతి[1]. చల్లపల్లి రాజవంశీకులు నేటికీ అక్కడ జీవిస్తున్నారు. వీరిని చల్లపల్లి జమిందారులు అని కూడ అంటారు.

స్వాతంత్ర్యము వచ్చిన పిమ్మట, రాచరిక వ్యవస్థ నిర్మూలనతో, చల్లపల్లి రాజులకు అధికారము పోయినది.

చల్లపల్లి కోట[మార్చు]

పూర్వము ప్రజలకు సమయాన్ని తెలియజేయటానికి కోటలో ప్రతి గంటకు గంటను మోగించేవారు. ఈ సాంప్రదాయము నేటికీ కొనసాగుతున్నది. ఈ కోటనుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి కనిపిస్తుందని, కోట నుండి కనకదుర్గమ్మ గుడి రహస్య సొరంగము ఉన్నదని స్థానిక ప్రజల నమ్మకము. అలానే, మచిలీపట్నము శివార్లలో వున్న శివగంగ అమ్మవారి గుడి కి అయ్యే ఖర్చు రాజావారు భరించేవారని, కోట నుంచి గుడికి సొరంగమార్గము ఉంది అని ప్రతీతి. ఈ కోట రమారమి 200 సంవత్సరాల పూర్వము కట్టించినది. కోటని చూడటానికి, అక్కడ వారిని కలువటానికి బయటి వారికి కుదురుతుంది, కానీ అనుమతి తీసుకోవాలి.

దేవాలయలు[మార్చు]

  1. శ్రీ చక్రస్థిత అన్నపూర్ణాసమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం.
  2. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
  3. శ్రీమద్విరాట్ ఆలయం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- చల్లపల్లి గ్రామములోని కోమలానగర్ లో గల ఈ ఆలయంలో, 36వ వార్షికకళ్యాణమహోత్సవాలు 2014,ఫిబ్రవరి-9 ఆదివారం, మాఘశుద్ధ దశమి నాడు, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య, ఘనంగా నిర్వహించారు. తరువాత 11వ తేదీ మంగళవారంనాడు, స్వామివారి ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఆ రోజే శ్రీ మద్విరాట్ విశ్వకర్మ జయంతిని గూడా ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయంవద్ద, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [5]
  4. శ్రీ సంపటాలమ్మ అమ్మవారి దేవాలయం;- 2003,మార్చిలో ఈ దెవాలయ పునరుద్ధరణ జరిగింది. ఈ దేవాలయ వార్షికోత్సవం, ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో, మొదటి ఆదివారం జరుగును. అమ్మవారి గ్రామోత్సవం ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో శుక్ల ఏకాదశి నుండి వారం రోజులపాటు నిర్వహించెదరు. అమ్మవారి వంశపారంపర్య అర్చకులు, అమ్మవారి పుట్టింటి వంశీకుల ఆధ్వర్యంలో, ఈ వేడుకలను ఘనంగా నిర్వహించెదరు. పుట్టింటివారయిన పత్తిపాటివారు , అమ్మవారికి శాస్త్రోక్తంగా ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించెదరు. ఈ గ్రామోత్సవంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, జలబిందెనూ, ఇంటింటికీ తీసికొని వెళ్ళి, భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కలిగించెదరు. భక్తులు అమ్మవారికి నిండు బిందెలతో వారపోసి, పసుపు, కుంకుమలను సమర్పించి, అమ్మవారి అనుగ్రహం పొందటం, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. [6] & [7]
  5. శ్రీ గరుడ ఆంజనేయస్వామివారి ఆలయం.
  6. శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం:- బస్సుస్టాండు కూడలిలో ఉన్న ఈ ఆలయంలో, 2014,మే-22 నుండి, హనుమజ్జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించుచున్నరు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 22న సాయంత్రం 6 గంటలకు శ్రీరామనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించినారు. 23న స్వామివారి జయంతి మహోత్సవాలు, శ్రీ సీతా రామ లక్ష్మణులకు అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. సాయంత్రం 7 గంటలకు స్వామివారి శాంతికళ్యాణం, పూజాది కార్యక్రమాలు నిర్వహించెదరు. [8]
  7. శ్రీ కార్యసిద్ధి గణపతి దేవాలయం:- స్థానిక నిమ్మలతోటలో నూతనంగా నిర్మిచబోయే ఈ ఆలయ నిర్మాణానికి, 2014, ఆగష్టు-10, ఆదివారం నాడు, భూమిపూజ చేసి శంకుస్థాపన నిర్వహించినారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయినది. విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2014,డిసెంబరు-13వ తేదీ శనివారం, మార్గశిర శుద్ధ చతుర్దశినాడు, స్వామివారి గ్రామోత్సవాన్ని, భక్తులు ఘనంగా నిర్వహించినారు. 15వ తేదీ సోమవారం నాడు, ఉదయం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, అఖండస్థాపన, మద్యాహ్నం మండపారాధనలు, అగ్నిప్రతిష్ఠాపన, జలాధివాసం, క్షీరాధివాసం, 16వ తేదీ, మంగళవారం నాడు స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పాధివాసం పూజలు, 17వ తేదీ బుధవారం, మార్గశిర బహుళ విదియ నాడు పీఠపూజ, నవరత్న గర్తన్యాసముల విశేషపూజలు నిర్వహించిన అనంతరం, 7-45 గంటలకు, విగ్రహావిష్కరణ నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, విఘ్నేశ్వరునికి పూజాదికాలు నిర్వహించినారు. ఈ సందర్భంగా ఐదువేలమంది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించినారు. [9] , [13] & [14]
  8. చల్లపల్లి గ్రామ జాతర:- చల్లపల్లిలో ప్రతి సంవత్సరం తమ ఇలవేల్పులకు నిర్వహించే గ్రామజాతరను, 2014, ఆగష్టు-10, ఆదివారం, శ్రావణపౌర్ణమి నాడు, ఘనంగా నిర్వహించినారు. గ్రామంలోని వీరంకివారి వీరుళ్ళకు, పోతురాజుస్వామి, సంపటాలమ్మ అమ్మవారికి, గ్రామదేవతల విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినారు. అనంతరం గ్రామంలో కలశాలతో ఊరేగింపు నిర్వహించినారు. డప్పు దరువులకు నాగేంద్రనృత్యం, వీర తాళ్ళు, వీర కత్తులతో సాహస విన్యాసాలు ప్రదర్శించినారు. ఆలయంలో పసుపు, కుంకుమలు సమర్పించినారు. [10]
  9. శ్రీ అయ్యప్పస్వామి ఆలయం:- చల్లపల్లి గ్రామంలోని శివాలయం సమీపంలోని స్థలంలో, అయ్యప్పస్వామి దేవాలయ నిర్మాణానికి, 2014, ఆగష్టు-20, బుధవారం ఉదయం శంకుస్థాపన నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివారలకు ప్రత్యేకపూజలు, భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించినారు. నూతనంగా నిర్మించతలపెట్టిన శ్రీ గణపతి, అయ్యప్పస్వామి, కుమారస్వామి, మాళికాపురోత్తమ్మ అమ్మవారి దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన నిర్వహించినారు. ఈ ఆలయనిర్మాణానికి స్థలాన్ని గురుస్వాములు శ్రీ దింటకుర్తి మోహనరావు, శ్రీ అన్నవరపు సత్యనారాయణ అందించినారు. ఈ ఆలయాలలో పంచలోహ విగ్రహాలను ప్రతిష్ఠించెదరు. [11]
  10. జమ్మిలంకమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక ఆలయంలో, 2014, ఆగష్టు-24, ఆదివారం నాడు, అమ్మవారి జాతరను భక్తులు ఘనంగా నిర్వహించినారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను, కలశస్థూపాలను వీరుళ్ళు శిరస్సుపై ధరించి, అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. జమ్మిలంకమ్మ అమ్మవారి వంశస్తుల ఆధ్వర్యంలో జాతరను శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ప్రభను తోడ్కొని కలశాలను, వీరకత్తులు, వీర తాళ్ళతో డప్పువాయిద్యాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించినారు. భక్తులు అమ్మవారికి నిండుబిందెలతో వారపోస్తూ, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించినారు. [12]

మోపిదేవి ఆలయం[మార్చు]

కోట దగ్గరలో, సుమారు 7కిమీ దూరములో, ప్రఖ్యాతి గాంచిన మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (నాగేంద్ర స్వామి) ఆలయం ఉంది. ఇక్కడ శివుని కుమారుడైన కుమారస్వామి నాగేంద్ర స్వామి రూపంలో వెలిసారు.

కర్మాగారము[మార్చు]

చల్లపల్లి నుండి 3 కిలోమీటర్ల దూరములో, లక్ష్మీపురంలో చల్లపల్లి రాజా కట్టించిన చక్కెర కర్మాగారము ఉన్నది.

విద్య[మార్చు]

రాజావారు గ్రామములో ఒక ఉన్నత పాఠశాలను కూడా కట్టించారు. పరిసర గ్రామాలకు ఇదే పెద్ద ఉన్నత పాఠశాల.

రాజకీయము[మార్చు]

ఇక్కడ ఒక కమ్యూనిస్టు స్తూపము కూడా ఉన్నది.

బ్యాంకులు[మార్చు]

  1. ఆంధ్రాబ్యాంకు.
  2. సిండికేటు బ్యాంకు:- ఈ గ్రామములో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా, సిండికేటు బ్యాంకు శాఖను 2014,ఫిబ్రవరి-6న ప్రారంభించారు. [3]
  3. ఇండియన్ బ్యాంకు.
  4. స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్.
  5. కే.డి.సి.సి.బ్యాంకు.
  6. కార్పొరేషన్ బ్యాంకు.
  7. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా.

గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషులు స్త్రీలు
1. చల్లపల్లి 3,935 15,423 7,558 7,865
2. లక్ష్మీపురం 3,659 13,483 6,909 6,574
3. మాజేరు 1,114 4,335 2,179 2,156
4. మంగళాపురం(చల్లపల్లి) 1,182 4,260 2,095 2,165
5. నడకుదురు 1,058 3,710 1,874 1,836
6. నిమ్మగడ్డ 235 857 421 436
7. పాగొలు 864 3,226 1,620 1,606
8. పురిటిగడ్డ 591 2,062 1,043 1,019
9. వక్కలగడ్డ 934 3,109 1,538 1,571
10. వెలివోలు 432 1,537 741 796
11. యార్లగడ్డ 538 1,811 907 904

వనరులు[మార్చు]

  1. [1]
  2. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

బయటి లింకులు[మార్చు]

[3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; ఆగష్టు-3; 2013; 3వ పేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-7; 1 వ పేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-10; 1వ పేజీ. & 12వ తేదీ-3వ పేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మార్చ్-2; 1వ పేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014; ఏప్రిల్-11; 1వ పేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-23; 1వ పేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-10; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-11; 1వపేజీ. [11] ఈనాడు కృష్ణా; 2014, ఆగష్టు-11; 3వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 25 ఆగష్టు-2014; 2వ పేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-14; 1వపేజీ. [14] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-18; 2వపేజీ.


మూలాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=చల్లపల్లి&oldid=1356190" నుండి వెలికితీశారు