పెనుగంచిప్రోలు
| ?పెనుగంచిప్రోలు మండలం కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | పెనుగంచిప్రోలు |
| జిల్లా(లు) | కృష్ణా జిల్లా జిల్లా |
| గ్రామాలు | 13 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
50,695 (2001) • 25551 • 25144 • 57.08 • 66.59 • 47.48 |
పెనుగంచిప్రోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము.
పెనుగంచిప్రోలు గ్రామం పూర్వ పేరు "పెదకంచి". తిరుపతమ్మ తల్లి గ్రామ దేవత తిరునాళ్లు బాగా జరుగును.గ్రామం లో 101 దేవాలయలు కలవు. తిరుపతమ్మ దేవాలయము రాష్త్రములో 11 వ స్థానం.9 వ నంబరు జాతీయ రహదారి నుండి 8 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో 5 మండల పరిషత్ పాటశాలలు, 2 జిల్లా పరిషత్ పాఠశాలలు, డిగ్రీ కళాశాల మరియు ఒక గ్రంథాలయము ఉన్నాయి. ఒక ప్రాధమిక వైద్యశాల కూడ వున్నది. గ్రామం పాడి పంటలకు, వ్యవసాయమన కు పేరు గాంచినది. వరి, మిరప, కందులు, పెసలు, జొన్న పంటలు పండిస్తారు. ఈ గ్రామము మామిడి తోటలకు ప్రసిద్ధి. అందమైన మునేరు నది, చెరువు, నాగార్జున సాగర్ కాలువలు ఈ వూరి వ్యవసాయమ నకు జీవానాధారాలు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ ధర్మపురి యోగానంద నృసింహస్వామి దేవాలయం, రుక్మిణి,గోదా సమేత గోపాలస్వామి దేవాలయం (ఆతి పురాతనం), పడమటి బజారున పురాతన ఆదినారాయణ స్వామివారి దేవాలయం కూడ ఉన్నాయి. పెనుగంచిప్రోలు అను పేరు పెద్ద కంచీపురం నుండి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులోనున్న కంచి చిన్న కంచి అయితే, ఇది పెద్ద కంచి. ఈ ఊరిలో 108 దేవాలయములు ఉండేవని అంటారు. అయితే కాల క్రమలో ఈ ఊరి ప్రక్కనే ప్రవహించుచున్న మునియేరు వరదల వల్ల ఆ ఊరు మరియు ఆ దేవాలయములు భూగర్ఫంలో కలిసిపోయినవి. అందుకే ఇప్పటికనీ ఆ ఏటికి వరద వచ్చినపుడు ఇసుక తిన్నెల మధ్యన పురాతన దేవాలయాల స్ధంభాలు నీటిలో కనిపిస్తాయి. కొన్ని బయటకు కూడా కనిపిస్తాయి. కాని వాటి గురించి ఎవరూ పట్టించుకోరు.ఈ ఊరిలోనున్న ఆదినారాయణస్వామి మరియు గోపాలస్వామి విగ్రహాలు భూమిలో దొరికినవే.
[మార్చు] ప్రముఖులు
[మార్చు] చిత్ర మాల
[మార్చు] గ్రామాలు
- అనిగండ్లపాడు
- గుమ్మడిదుర్రు
- కొల్లికుల్ల
- కొనకంచి
- లింగగూడెం
- ముచ్చింతాల
- ముండ్లపాడు
- నవాబ్ పేట
- పెనుగంచిప్రోలు
- శనగపాడు
- సుబ్బాయిగూడెం
- తోటచెర్ల
- వెంకటాపురం
|
|||||||