పులివెందుల
| ?పులివెందుల మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | పులివెందుల |
| జిల్లా(లు) | వైఎస్ఆర్ |
| గ్రామాలు | 19 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
62,708 (2001) • 31584 • 31124 • 70.0 • 81.77 • 58.10 |
పులివెందుల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.
విషయ సూచిక |
భౌగోళికాంశాలు [మార్చు]
పులివెందుల
వద్ద ఉంది.[1] సముద్ర మట్టానికి 272 మీటర్ల ఎత్తులో గలదు (895 అడుగులు).
చరిత్ర [మార్చు]
పూర్వం ఇక్కడ రామానుజాచార్యుల వారు ఆరు మాసాల పాటు తపమాచరించారని, ఇక్కడ పులులు మందలుగా తిరుగుతూ ఉండటం చేత ఈ ఊరుకు పులిమందల అన్న పేరు పడి, అది కాలక్రమేణా పులివెందుల అయిందని ప్రతీతి. ఇక్కడ లొయోలా కళాశాల స్థాపించబడిఉన్న కొండ పై ఒకప్పుడు కోట ఉండేది, కళాశాల భవనం కోసం తవ్వకాలు జరిపినప్పుడు రుద్రమదేవి విగ్రహం ఒకటి బయట పడింది. రాజకీయంగా ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉన్నది.
వ్యవసాయం [మార్చు]
ఇక్కడ ముఖ్యంగా ప్రొద్దుతిరుగుడు, బత్తాయి, అరటి, వేరు శెనగ సాగు చేస్తారు. చిత్రావతి నది పై పార్నపల్లె వద్ద గల ఆనకట్ట ద్వారా తాగు నీరు ఇంకా సాగు నీరు అందుతాయి.
విద్య [మార్చు]
చుట్టు పక్కల గ్రామాలకు, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇది ఒక విద్యా కేంద్రంగా వ్యవహరిస్తుంది. ప్రఖ్యాత జవాహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల 2006 లో ఇక్కడ స్థాపించబడింది.
గ్రామాలు [మార్చు]
- అహోబిళపురం
- అచ్చవెళ్ళి
- భాకరాపురం
- బొగ్గుడుపల్లె
- బ్రాహ్మణపల్లె
- చిన్నరంగాపురం
- ఎర్రబల్లి (పులివెందల)
- కే.వెలమవారిపల్లె
- కాచివారిపల్లె
- కనంపల్లె
- కొర్రపాడు
- పెద్దరంగాపురం(జె ఎన్ టి యు)
- పోలేపల్లె
- పులివెందల
- రాచుమర్రిపల్లె
- రాగిమానిపల్లె
- రాయలాపురం
- ఉలిమెళ్ల
- వెంకటంపల్లె (నిర్జన గ్రామము)
- యెర్రగుడిపల్లె
|
|||||||