చోళ సామ్రాజ్యము
|
|||||||||||||||||||||||||||||||
చోళ సామ్రాజ్యం (తమిళ భాష:சோழர் குலம்), 13 వ శతాబ్ధం వరకు ప్రధానంగా దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కావేరి నది పరివాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారత దేశం అంతా విస్తరించింది. కరికాళ చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుత్తోంగ చోళుడు చోళ రాజులలో ప్రముఖులు. చోళ సామ్రాజ్యం 10,11,12 శతాబ్ధంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది. మొదటి రాజరాజ చోళుడు మరియు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాజ్యం ఆసియా ఖండంలోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన మాల్దీవులు నుండి ఉత్తరాన ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్|లోని గోదావరి పరివాహక ప్రాంతం వరకు విస్తరించింది. రాజరాజ చోళ భారత దేశంలొని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని , శ్రీలంకలోని కొన్ని భాగాలు, మాల్దీవులుకి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. రాజేంద్ర చోళ ఉత్తర భారత దేశం మీద విజయ యాత్ర చేసి పాటలీపుత్రంని పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీపసమూహం" (మలయ్ ఆర్కిపెలగో) వరకు కూడా చోళ రాజులు జైత్ర యాత్రలు జరిపారు. 12 వ శతాబ్ధంకి పాండ్య రాజులు, 13వ శతాబ్ధానికి హోయసల రాజులు వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది.
విషయ సూచిక |
రాజరాజ చోళుడు[మార్చు]
రాజరాజ చోళుడు ప్రముఖ చోళరాజులలో ఒకడు. స్థానిక స్వపరిపాలనకు సంబంధించి అనేక సంస్కరణలు చేశాడు. తంజావూరులో గొప్ప శివాలయాన్ని నిర్మించినది ఇతడే.
ఇవీ చూడండి[మార్చు]
పాద పీఠికలు[మార్చు]
మూలాలు[మార్చు]
- Chopra, P.N; Ravindran, T.K; Subrahmanian, N [2003] (2003). History of South India ; Ancient, Medieval and Modern. New Delhi: S. Chand & Company Ltd. ISBN 81-219-0153-7.
- Das, Sisir Kumar [1995] (1995). History of Indian Literature (1911–1956) : Struggle for Freedom - Triumph and Tragedy. New Delhi: Sahitya Akademi. ISBN 81-7201-798-7.
- Gupta, A.N; Gupta, Satish [1976]. Sarojini Naidu's Select Poems, with an Introduction, Notes, and Bibliography. Prakash Book Depot.
- Harle, J.C (1994). The art and architecture of the Indian Subcontinent. New Haven, Conn: Yale University Press. ISBN 0-300-06217-6.
బయటి లింకులు[మార్చు]
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
మూలాలు[మార్చు]