తిరుమల శ్రీవారి మెట్టు
తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి. అలిపిరి నుండి వేళ్ళే దారి అందరికీ పరిచయమైనది. ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది. తిరుమల చేరుకోవడానికి రెండవ కాలిబాట '''శ్రీవారి మెట్టు''' నుండి ఉంది. ఈ మార్గంలో ప్రయాణం ఒక గంట మాత్రమే పడుతుంది. పాలు, పెరుగు, పూలు వంటి పదార్ధాలు కొండపైకి తీసుకొని వెళ్ళి అమ్ముకొనేవారు ఈ మార్గంలోనే వెళతారు. ఈ మార్గం రద్దీ లేకుండా, ప్రకృతి రమణీయతతో సుందరంగా ఉంటుంది. ఈ దారిని నూరుమెట్ల దారి అని అంటారు. అనగా ఇవి నూరు మెట్లె కాదు. ఇవి సుమారు రెండు వేలా ఐదువందల మెట్లున్నాయి. తిరుమలకు వెళ్లడానికి ఇది చాల దగ్గరి దారి. గతంలో శ్రీనివాస మంగాపురం వద్ద మంగాపురం అనే రైల్వే స్టేషన్ వుండేది. ఆ రైలు మార్గంలో వెళ్లే అనేక రైళ్లు అక్కడ ఆగేవి. అక్కడి నుండి భక్తులు నూరు మెట్ల దారి గుండా కొండపైకి వెళ్లే వారు. ప్రస్తుతం ఈ మెట్లదారి అంత ప్రాచుర్యంలో లేదు. స్థానికులకు తప్ప ఇక్కడ మరొక మెట్ల దారి వున్నదనే సంగతి సుదూర ప్రాంతాల వారికి తెలియదు. తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నుండి నీటి సరఫరాకి ఈ మార్గం మీదుగా పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు లోపే ఉంటుంది. అయితే ఈ కాలిబాటతో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఎక్కువగా లేవు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ఇక్కడికి తిరుపతి నుండి, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురం ల మీదుగా ఒక బస్సు నడుపుతున్నారు. శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు కాలం అగస్త్యాశ్రమం లో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. నడిరేయి ఏ జామునో అలమేలు మంగను చేరడానికి దిగి వచ్చే స్వామి ఒక అడుగు ఈ "శ్రీవారి మెట్టు"పై వేసి రెండవ డుగు అలమేలు మంగాపురంలో వేస్తాడని ప్రతీతి. చంద్రగిరిని వేసవి విడిదిగా చేసుకొన్న విజయనగర చక్రవర్తులు శ్రీవారి మెట్టునుండ ఉన్న మెట్లదారిలో తిరుమలేశుని దర్శనం చేసుకొనేవారు. తన దేవేరులతో కలిసి కృష్ణ దేవరాయలు ఈ మార్గంలో అనేక పర్యాయాలు నడచి స్వామిని దర్శించుకొన్నాడు.
అలిపిరి మార్గం ప్రస్తుతం అధికంగా వాడకంలో ఉన్నందున శ్రీవారి మెట్టునుండి వెళ్ళే దారి గురించి చాలా మందికి తెలియదు. ఇది కేవలం 2.1 కీ.మీ. మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఈ మార్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా దారి ఆరంభంలో "పాదాల మండపం", మరియు భక్తుల సౌకర్య సదుపాయాలను నిర్మిస్తారు. ఇందుకు 6 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేశారు. వసతి గృహంగా "కృష్ణదేవరాయ సదనం" కూడా 4.3 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. [1]
అలిపిరి ను౦చి ఉన్న మెట్ల దారిలో మెట్లోత్సవ౦ జరపడ౦ ఆనవాయితీగా వస్తో౦ది. అయితే 2007, 2008 సంవత్సరాలలో కొన్ని మెట్లోత్సవాలు శ్రీవారి మెట్టునుండి ఉన్న బాటలో జరుపుతున్నారు. టీటీడీ, దాస సాహిత్య ప్రాజెక్ట్ స౦యుక్త౦గా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు పెద్దస౦ఖ్యలో పాల్గోవడ౦తో తక్కువదూర౦ ఉ౦డే శ్రీవారి మెట్ల మీదుగా ఈ యాత్ర జరపడం అనుకూలంగా ఉంటున్నది.
[మార్చు] మూలాలు, వనరులు
- ↑ హిందూ పత్రిక వార్త - ఏప్రిల్ 24, 2008
- తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002)