ఉగ్ర శ్రీనివాసుడు
వికీపీడియా నుండి
ఉగ్ర శ్రీనివాసుడు స్వామి వారి ఆగ్రహదశను సూచిస్తుంది. మూలబేరం తరువాత ప్రాచీనకాలానికి చెందిన తొలి విగ్రహం ఇదియే అయి ఉంటుంది. ఈ విగ్రహం దాదాపు 18 అంగుళాల ఎత్తు కలిగి రమారమి 7 అంగుళాల ఎత్తు పీఠం మీద నిలువబడి ఉంటుంది. నిలుచుని ఉన్న భంగిమలో శ్రీదేవి, భూదేవుల ప్రతిమలను కూడ చూడవచ్చును.
తమిళ పర్యాయపదమైన 'వెంకట తురైవార్' అన్న పేరును బట్టి భోగ శ్రీనివాసుడు ప్రతిష్ట జరగడానికి పూర్వం ఉత్సవ విగ్రహంగా ఉండేదని తెలుస్తుంది. ఉత్థాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ద్వాదశి ఆరాధనలలో ఈ ఉగ్రశ్రీనివాసుని ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఈయనపై సూర్యకిరణాలు పడరాదని, అలా ప్రసరించినట్లయితే ప్రపంచానికి హాని సంభవిస్తుందని పురాణేతిహాసం తెలుపుతోంది.
[మార్చు] మూలాలు
- తిరుమల ఆలయము (ధారావాహికం-41), ఆంగ్లమూలం: డా.రమేశన్, తెలుగు అనువాదం: డా.కోరాడ రామకృష్ణ, సప్తగిరి మాసపత్రిక ఏప్రిల్ 2006 లో ప్రచురించిన వ్యాసం నుండి.