తిరుపతి లోకసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది.
విషయ సూచిక |
[మార్చు] దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
- గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- సూళ్ళూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం
- తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం
- శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం
- సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
[మార్చు] ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
| లోక్‌సభ | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
|---|---|---|---|
| మొదటి | 1952-57 | మాడభూషి అనంతశయనం అయ్యంగారు | భారత జాతీయ కాంగ్రెసు |
| రెండవ | 1957-62 | - | - |
| మూడవ | 1962-67 | సి.దాస్ | భారత జాతీయ కాంగ్రెసు |
| నాలుగవ | 1967-71 | సి.దాస్ | భారత జాతీయ కాంగ్రెసు |
| ఐదవ | 1971-77 | టి.బాలకృష్ణయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
| ఆరవ | 1977-80 | టి.బాలకృష్ణయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
| ఏడవ | 1980-84 | పసల పెంచలయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
| ఎనిమిదవ | 1984-89 | చింతా మోహన్ | తెలుగుదేశం పార్టీ |
| తొమ్మిదవ | 1989-91 | చింతా మోహన్ | భారత జాతీయ కాంగ్రెసు |
| పదవ | 1991-96 | చింతా మోహన్ | భారత జాతీయ కాంగ్రెసు |
| పదకొండవ | 1996-98 | నెలవల సుబ్రహ్మణ్యం | భారత జాతీయ కాంగ్రెసు |
| పన్నెండవ | 1998-99 | చింతా మోహన్ | తెలుగుదేశం పార్టీ |
| పదమూడవ | 1999-04 | నందిపాకు వెంకటస్వామి | భారతీయ జనతా పార్టీ |
| పద్నాలుగవ | 2004-ప్రస్తుతం | చింతా మోహన్ | భారత జాతీయ కాంగ్రెసు |
[మార్చు] 2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటస్వామి పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ చింతా మోహన్ పోటీలో ఉన్నాడు. [2] ప్రజారాజ్యం పార్టీ నుండి వెలగపల్లి వరప్రసాదరావు పోటీపడుతున్నాడు. [3]
[మార్చు] మూలాలు
|
|||||