భాద్రపదమాసము
వికీపీడియా నుండి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
భాద్రపద మాసము (సంస్కృతం: भाद्रपद bhaadrapad) తెలుగు సంవత్సరంలో ఆరవ నెల. చాంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వలన ఇది భాద్రపద మాసం అనబడినది. ఇది వర్షఋతువు కావున విరివిగా వర్షాలు పడును.
ఈ మాసంలో ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం - ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. భాద్రపద శుక్ల తదియ నాడు జరుపుకునే హరితాళికా వ్రతం స్త్రీలకు పార్వతీ పరమేశ్వర పూజ, ఉపవాసం, జాగరణ చెప్పబడ్డాయి.[1]
భాద్రపద శుద్ధ చవితి (వినాయక చవితి) నుంచి తొమ్మిది రాత్రులు గణపతి నవరాత్రాలు జరుపుకుంటారు. చివరిరోజున నిమజ్జనం వైభగంగా జరిపిస్తారు.
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక 1912 సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం భాద్రపదమాసములో ప్రారంభమైనది.
[మార్చు] పండుగలు
[మార్చు] మూలాలు
- ↑ భాద్రపద మాసం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 169-200.
|
|||||