సంధ్యావందనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంధ్యావందనం

ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనము ఒకటి. సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సంధికాలము) చేయదగినది. సంధ్యావందనము చేయకుండా యితర కర్మలను చేయరాదు. సంధ్యావందనములో సూర్యుని అర్ఘ్యం ఇవ్వడం, గాయత్రీ మంత్రం|గాయత్రీ జపం కొన్ని అంశాలు. సంధ్యా వందనము రోజునకు మూడుసార్లు చేయవలెను. రోజులో మొదటిసారి సంధ్యా వందనము [రాత్రి] యొక్క చివరిభాగము నక్షత్రములు ఉండగా చేయుట. నక్షత్రములు లేకుండా చేయుట మధ్యమము. సూర్యోదయం తరువాత చేయుట అధమము. కాని మనము సూర్యోదయమైన తరువాత చేయుట ఆచారముగా వచ్చుచున్నది. ఇక రెండవసారి మధ్యాహ్న సంధ్యా వందనము సూర్యోదయమైన 12 ఘడియలు తరువాత చేయుట ఉత్తమము. సూర్యోదయమము అయిన తరువాత 8 నుంచి 12 ఘడియలు మధ్య చేసిన మధ్యమము. సూర్యోదయమైన 19 నుంచి 24 ఘడియలు మధ్య చేయుట అధమము. సాయం సంధ్యావందనము సూర్యుడు అస్తమించుచుండగా చేయుట ఉత్తమము, నక్షత్ర దర్శనము కాకుండ చేయుట మధ్యమము, నక్షత్ర దర్శనము అయిన తరువాత చేయుట అధమము. సంధ్యా వందనము[కానుపు|పురుడు], మైల, పక్షిణి సమయములందు అర్ఘ్యప్రదానము వరకు చేయాలి. ప్రయాణాల్లో వీలుపడనిచో మానసికముగా సంధ్యా వందనము చేయవచ్చును. రోజూ తప్పక సంధ్యా వందనము చేవలెను.

ఋగ్వేద సంధ్యావందనం

గురువులకి నమస్కరిస్తూ......!

ఋగ్వేద సంధ్యావందనం 1. శ్రీ గురుభ్యో నమః 2. శ్రీ మహాగణాధిపతియే నమః 3. శ్రీ మహా సరస్వత్త్యై నమః 4. హరిః ఓం

మార్జనం ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా య: స్మరేత్‌ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచి:, పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమ: (3 సార్లు, శిరస్సు మీద నీళ్ళు జల్లుకొనవలెను)

ఆచమనం ఉద్ధరిణితో కుడిచేతిలోకి నీటిని తీసుకొని మూడుసార్లు ఈ క్రింది విధముగా అంటూ త్రాగాలి ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, (నీటిని వదిలి నమస్కరిస్తూ) ఓం గోవిందాయ నమ: ఓం విష్ణవే నమ:, ఓం మధుసూదనాయ నమ:, ఓం త్రి విక్రమాయ నమ: ఓం వామనాయ నమ:, ఓం శ్రీధరాయ నమ:, ఓం హృషీకేశాయ నమ:, ఓం పద్మనాభాయ నమ:, ఓం దామోదరాయ నమ:, ఓం సంకర్షణాయ నమ:, ఓం వాసుదేవాయ నమ:, ఓం ప్రద్యు మ్నాయ నమ:. ఓం అనిరుద్ధాయ నమ:, ఓం పురుషోత్తమాయ నమ:, ఓం అధోక్షజాయ నమ:, ఓం నారసింహాయ నమ:, ఓం అచ్యుతాయ నమ:, ఓం జనార్ధనాయ నమ: ఓం ఉపేంద్రాయ నమ:, ఓం హరయే నమ:, ఓం శ్రీ కృష్ణాయ నమ:, శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ:

ప్రాణాయామం పృథివ్యాః మేరుపృష్ట ఋషిః కూర్మోదేవతా సుతలం ఛంధః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛంధః ప్రాణాయామే వినియోగః (ముక్కు పట్టుకొని ఎడమ రంధ్రంతో గాలిని మెల్లగా పీల్చి, బంధించి, ఈ క్రింది మంత్రమును జపించి మెల్లగా కుడిరంధ్రం నుండి విడిచిపెట్టాలి) ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహాః ఓం జనః ఓం తపః ఓం సత్యమ్ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోమ్ సంకల్పం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన........సంవత్సరే....అయనే....ఋతౌ.....మాసే, శుక్ల/కృష్ణ పక్షే ....తిథౌ....వాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ శ్రీమాన్....గోత్రః .....నామధేయోహం (వివాహమైనవారు "ధర్మపత్నీ సమేతోహం" అని చెప్పుకోవాలి) మార్జనం ఓం ఆపోహిష్టేతి త్రయాణాం మంత్రాణాం సింధుద్వీప ఋషిః ఆపోదేవతా గాయత్రీ ఛందః పాదాంత మార్జనే వినియోగః (నీళ్లు నెత్తిమీద జల్లుకుంటూ క్రింది మంత్రాన్ని జపించాలి) ఓం ఆపోహిష్టామ యోభువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశ్శివతమో రసః తస్య భాజయతేహనః ఉశతీరివమాతరః తస్మా అదరంగ మామవః యస్యక్షయాయ జిన్వధా ఆపోజన యథాచనః (నీటిని తీసుకొని ఈ క్రింది విధంగా అభిమంత్రించాలి) ఓం సూర్యశ్చ ఇత్యస్య (అగ్నిశ్చ ఇత్యస్య) మంత్రస్య నారాయణ ఋషిః (యాజ్ఞవల్క్యోపనిషద్ ఋషిః) సూర్య (అగ్ని) మామన్యుపతయో రాత్రయో దేవతా (అహర్దేవతా) ప్రకృతిః ఛంధః అంతశ్శుధ్యర్ధం జలాభి మంత్రణే వినియోగః ఓం సూర్యశ్చ (అగ్నిశ్చ) మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం. యద్రాత్యా (యదాహ్నా) పాపమ కార్షమ్. మనసావాచా హస్తాభ్యాం. పద్భ్యా ముదరేణ శిశ్నాత్ రాత్రి (అహ) స్తదవలంపతు. యత్కించ దురితం మయి. ఇదమహం మామృతయోనౌ. సూర్యే (సత్యే) జ్యోతిషి జుహోమి స్వాహా (అని చెప్పి నీళ్లు త్రాగాలి) (పైన బ్రాకెట్లలో ఉన్నవి పూర్వమందున్న పదాలకు బదులుగా ఉపయోగించి సాయంత్రం చెప్పవలెను) తర్వాత మళ్ళీ ఆచమనం చేయాలి ఓం కేశవాయ స్వాహ....శ్రీ కృష్ణాయ నమః

పునర్మార్జనం ఆపోహిష్టేతి నవర్చస్య సూక్తస్య! సింధుద్వీపోంబరీషోవా! ఋషిః ఆపోగాయత్రీ పంచమీ వర్ధమానా! సప్తమీ ప్రతిష్ఠా! అంత్యేద్వే అనుష్టుభౌ! పునర్మార్జనే వినియోగః (మరల తలపై నీళ్లు జల్లుకుంటూ ఈ క్రింది మంత్రం జపించాలి) ఓం ఆపోహిష్టామ యోభువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే! యోవశ్శివతమో రసః తస్యభాజయతే హనః! ఉశతీరివ మాతరః! ఓం తస్మా అరంగ మామవో యస్యక్షయాయ జిన్వథ! ఆపోచన యథాచనః! ఓం శంనో దేవి రభీష్టయ ఆపో భవంతు పీతయే శం యో రభిస్రవంతు నః! ఈశానా వార్యాణామ్ క్షయంతీం శ్చర్షణీనాం! ఆపోయాచామి భేషజం! అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ! అగ్నించ విశ్వ శంభువం! ఆపః పృణీత భేషజమ్ వరూధం తన్వే మమఁ జ్యోక్చ సూర్యం దృశే! ఇదమాపః ప్రవహత యత్కించ దురితం మయి యద్వాహమభి దుద్రోహ యద్వాశేప ఉతానృతం! ఆపో అద్యాన్వ చారిషమ్ రసేన సమగస్మహి పయస్వానగ్న ఆగహి! తం మాసం సృజవర్చసా! ససృషీస్తదపసో దివానక్తంచ ససృషీః! వరేణ్యక్రతూ రహమాదేవీ రవ సేహువే! ఆపో మాం రక్షంతు! పాపపురుష దహనం ఓం ఋతంచ సత్యంచ ఇత్యస్య సూక్తస్య. అఘమర్షణ ఋషిః. భావవృత్తో దేవతా! అనుష్టుప్ ఛంధః! పాపపురుష జల విసర్జనే వినియోగః! (నీటిని తీసుకొని ఈ క్రింది విధంగా అభిమంత్రించాలి) ఓం ఋతం చ సత్యమ్ చ అభీద్ధాత్ తపసోధ్యజాయత! తతోరాత్ర్య జాయత! తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవా దధి సంవత్సరో అజాయత! అహోరాత్రాణి విదధ ద్విశ్వస్యమిషతో వశీ! సూర్యా చంద్రమసౌ ధాతాయథా పూర్వమకల్పయత్! దివించ పృథివీంచ అంతరిక్ష మధో స్వః! (నీటిని వీడిచి పెట్టాలి) మరల ఆచమనం చేయాలి ఓం కేశవాయ స్వాహా....ఓం కృష్ణాయ నమః అర్ఘ్య ప్రదానం ఓం తత్సవితు రిత్యస్య మంత్రస్య! గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితాదేవతా! గాయత్రీ ఛంధః! ప్రాత రర్ఘ్యప్రదానే (సాయమర్ఘ్య ప్రదానే) వినియోగః! ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ (అని పై మంత్రమును మూడుసార్లు జపించి, నీటిని మూడు సార్లూ విడిచిపెట్టాలి)

1. ప్రాతః కాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన మంత్రం యదద్యకచ్చ ఇత్యస్య మంత్రస్య - సుకక్ష ఋషిః ఇంద్రో దేవతా - గాయత్రీ ఛంధః కాలాతీత ప్రాతః సంధ్యావందన కృతదోష నిహరణార్థం ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానే వినియోగః. యదద్యకచ్చ వృత్రహన్నుదగా అభిసూర్య. సర్వంతదింద్ర తేవసే శ్లో.. సోహమర్కోస్మ్యహం జ్యోతి రాత్మాజ్యోతి రహం శివః. ఆత్మజ్యోతిరహం శుక్ల స్సర్వజ్యోతిరసోస్మ్యహం. ఆగచ్ఛవరదే దేవి గాయత్రీ బ్రహ్మరూపిణీ. జపానుష్టాన సిద్ధ్యర్థం ప్రవిశ్య హృదయం మమ. ఉత్తిష్టదేవిగంతవ్యం పునరాగమనాయచ. అర్ఘ్యేషు దేవిగంతవ్యం ప్రవిశ్య హృదయం మమ| ఉదకమును ప్రదక్షిణముగా శిరస్సు చుట్టూ త్రిప్పుతూ వదిలి పెట్టవలెను. అసావాదిత్యో బ్రహ్మా| ఓం కేశవాయ స్వాహా..ఓం శ్రీ కృష్ణాయ నమ:| 2. సాయం కాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదాన మంత్రం||

ఉద్ఘేదభీతి అంగీరస శ్శ్రుతకక్షస్సుకక్షోవా! ఋషి: ఇంద్రో గాయత్రీ! సాయంకాలాతీత ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రదానే వినియోగ: ఉద్ఘేదభిశ్రుతామఘం వృషభం నర్యాపసం! అస్తారమేషి సూర్య! సోమర్కోస్మ్యహం............అసావాదిత్యో బ్రహ్మా| ఓం కేశవాయస్వాహా.....ఓం కృష్ణాయనమ:

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ! అగ్నిర్దేవతా! బ్రహ్మ ఇత్యార్షం! గాయత్రం ఛందం! పరమాత్మం సరూపం! సాయుజ్యం వినియోగం! ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితం! గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వమే! యదాహ్నాత్కురుతే పాపాం తదాహ్నాత్ప్రతి ముచ్యతే! యద్రాత్ర్యాత్కురుతే పాపం తద్రాత్ర్యాత్ప్రతి ముచ్యతే! సర్వవర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతీ! (అరచేతులు రెండూ జోడించి) ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి! విశ్వమసి విశ్వాయు: సర్వమసి సర్వాయు:! అభిభూరోం (తరువాతి మాటలను చెప్తూ చేతుల్ని తనవైపు త్రిప్పుకోవాలి) గాయత్రీ మావాహయామి! సావిత్రీమావాహయామి! సరస్వతీమావాహయామి! ఛందర్షీనావాహయామి! శ్రియమావాహయామి! బలమావాహయామి! గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి:! సవితా దేవతా అగ్నిర్ముఖం (కుడి చేతితో ముఖాన్ని), బ్రహ్మశిర: (శిరస్సును), విష్ణు:హృదయం (హృదయాన్ని), రుద్రశిఖా.! (శిఖను ముట్టుకోవాలి) పృథివీ యోని: ప్రాణాపానవ్యానోదాన సమాన సప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయనస సగోత్రా గాయత్రీ! చతుర్వింశ్యత్యక్షర త్రిపద షట్కుక్షి: (అని కుడిచేతితో ఎడమచేతిని కొట్టాలి) పంచశీర్షోపనయనే వినియోగ:! ఓం భూ:! ఓం భువ: ఓం స్వ: ఓం మహా:! ఓం జన: ఓం తప: ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్‌, ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్స్వరోం! (అని ముందు విధంగా గాలిని పీల్చి బంధించి వదలాలి) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ (సాయం సంధ్యాంగ) యధాశక్తి గాయత్రీమంత్రజపం కరిష్యే! (అని అనామిక వేలుతో నీటిని ముట్టుకోవాలి) కరన్యాసం (రెండు చేతులతో చేయాలి) ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమ: (చూపుడువేలితో బొటనవేలును క్రింది నుండి పైకి) వరేణ్యం విష్ణాత్మనే తర్జనీభ్యాం నమ:! (బొటన వేలితో చూపుడు వేలును క్రింద నుండి పైకి) భర్గోదేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమ: (బొటనవేలితో మధ్యవేలును క్రింద నుండి పైకి) ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమ: (బొటనవేలితో అనామిక వేలును క్రింది నుండి పైకి) ధియోయోన: జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమ: (బొటనవేలితో చిటికెన వేలును క్రింద నుండి పైకి స్పృశించాలి) ప్రచోదయాత్‌ సర్వాత్మనే కరతలకర పృష్టాభ్యాం నమ: (అరచేతుల రెండింటిని ఒకదానితో ఒకటి స్పృశించాలి) అంగన్యాసం ఓం తత్సవితు: బ్రహ్మాత్మనే హృదయాయనమ: (కుడి అరచేతితో హృదయాన్ని) వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా! (కుడి అరచేతితో శిరస్సును) భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్‌! (కుడి అరచేతితో శిఖను స్పృశించాలి) ధీమహి సత్యాత్మనే కవచాయహుం! (కుడి అరచేతితో ఎడమ చెవులు ఎడమ అరచేతితో కుడి చెవులు స్పృశించాలి) ధియోయోన: జ్ఞానాత్మనే నేత్ర త్రయాయ వౌషట్‌! (కుడి ఎడమ నేత్రాలను వాటిపై మధ్యభాగాన్ని స్పృశించి ఎడమ చేతిపై కొట్టాలి) ప్రచోదయాత్‌ సర్వాత్మనే అస్త్రాయ ఫట్‌! (తల కుడి నుండి ఎడమకు కుడుచేతిని చుట్టూ త్రిప్పి ఎడమ అరచేతిపై కొట్టాలి) భూర్భువస్వరోమితి దిగ్భంధ:! (కుడి చేతి చూపుడు వ్రేలును ఎడమ చేతి చూపుడు వ్రేలుతో ముడివేయాలి) ధ్యానం ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయై: ముఖై: త్రీక్షణై:! యుక్తాబిందు నిబద్ధమకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం! గాయత్రీం వరదాభయాం కుశకశా: శుభ్రం కపాలం గదాం! శంఖం చక్రమథారవింద యుగళాం హస్తైర్వహంతీంభజే! యోదేవస్సవితాస్మాకం ధియోధర్మాది గోచరా:! ప్రేరయేత్తస్య యద్భర్గ: తద్వరేణ్యముపాస్మహే!! ఓం ప్రాత (సాయం) సంధ్యాంగ యధాశక్తి గాయత్రీ మంత్రజపం కరిష్యే!! గాయత్రీ మంత్రం ఓం భూర్భువస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి! ధియోయోన: ప్రచోయాత్‌| (108 జపించుట ఉత్తమము లేనిచో కనీసం 10సార్లు అయినా జపించవలెను) తత్సద్బ్రహ్మార్పణమస్తు (అని నీళ్లు వదిలి పెట్టాలి) (తరువాత లేచి నిలబడాలి, ఉదయం తూర్పువైపుకి, సాయంత్రం పశ్చిమం వైపుకి తిరిగి నమస్కరిస్తూ క్రింది విధంగా చెప్పాలి) ఓం జాతవేదసే ఇత్యస్య సూక్తస్య! మరీచి పుత్ర: కశ్యప ఋషి:! జాతవేదాగ్నిర్దేవతా! త్రిష్టుప్‌ ఛంద: సూర్యోపస్థానే వినియోగ:! (సాయంత్రం అయితే సంధ్యోపస్థానే వినియోగ:) ఓం జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతివేద:| సన: పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుమ్‌ దురితాత్యగ్ని:|| తచ్ఛంయోరిత్యస్య మంత్రస్య! శంయు ఋషి:! విశ్వేదేవాదేవతా! శక్వరీ ఛంద:! శాంత్యర్థే జపే వినియోగ:! ఓం తచ్ఛం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞాయా గాతుం యజ్ఞపతయే! దైవీ స్వస్థిరస్తున:!స్వస్తిర్మానుషేభ్య:! ఊర్ధ్వం జిగాతు భేషజం! శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే!

ఓం నమ: ప్రాచ్యై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరించాలి) ఓం దక్షిణాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమోనమ: (దక్షిణం) ఓం నమ: ప్రతీచ్యై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (పడమర) ఓం నమ: ఉదీచ్యై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (ఉత్తరం) ఓం నమ: ఊర్ధ్వాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (పైకి) ఓం నమ: అధరాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (కిందకి) ఓం నమ: అవాంతరాయై దిశై: యాశ్చ దేవతా: ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చనమోనమ: (మూలలు) ఓం నమో గంగా యమునయో: మధ్యయే వస న్తి తేమే ప్రసన్నాత్మాన: చిరంజీవితుం వర్ధయంతి ఓం నమో గంగా యమునయో: మునిభ్యశ్చ నమ:! సంధ్యాయై నమ:! గాయత్ర్యై నమ:! సావిత్ర్యై నమ:! సరస్వత్యై నమ:! సర్వాభ్యో దేవతాభ్యో నమ: దేవేభ్యో నమ:! ఋషిభ్యో నమ:! మునిభ్యో నమ:! గురుభ్యో నమ:! మాతృభ్యో: నమ:! పితృభ్యో: నమ:! కామోకార్షీ న్మ న్యుర కార్షీన్‌ నమో నమ:! పృధివ్యాపస్తేజో వాయురాకాశాత్‌! ఓం నమో భగవతే వాసుదేవాయ యాంసదా సర్వభూతాని చరాణీ స్థావరాణిచ! సాయం ప్రాతర్నమస్యంతి సామాసంధ్యాభిరక్షతు!! శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయం శివ:|| యథాశివమయో విష్ణు:! ఏవం విష్ణుమయశ్శివ:! యథాంతరం నమస్యామి తథామే స్వస్థిరాయుషి! బ్రాహ్మణ్యో దేవకీపుత్రో బ్రాహ్మణ్యో మధుసూదన:! బ్రాహ్మణ్య: పుండరీకాక్షో బ్రాహ్మణ్యో గరుడధ్వజ:!! నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ! జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ:! ఉత్తమే శిఖరేజాతే భూ మ్యాం పర్వతమూర్ధని! బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాతా గచ్ఛదేవి యధాసుఖం! స్తుతోమయా వరదావేదమాతా ప్రచోదయ న్తీ పవనేద్విజాతా ! ఆయు: పృధివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మలోకం! సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం! తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనం! ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం! సర్వదేవనమస్కార: కేశవం ప్రతిగచ్ఛతి| శ్రీకేశవం ప్రతిగచ్ఛతి ఇత్యో నమ ఇతి|| క్షీరేణ స్నాపితే దేవీ చందనేన విలేపితే! బిల్వపత్రార్చితే దేవి అహం దుర్గే శరణాగత:! వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం! సర్వభూతనివాసోసి వాసుదేవ నమోస్తుతే! నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే! సహస్రనా మ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమ:! భద్రం న ఇత్యస్య మంత్రస్య ఇంద్రపుత్రో విమద ఋషి: అగ్నిర్దేవతా ఏకపదా విరాట్చంద: శాంత్యర్ధే జపే వినియోగ: ఓం భద్రంనో అపివాతమ మన:! ఓం శాంతిశ్శాంతి శ్శాంతి:! మమ సర్వారిష్ట శాంతిరస్తు! ప్రవర ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య: శుభం భవతు!.........ప్రవరా న్విత............గోత్ర: అశ్వలాయనసూత్ర: ఋక్‌ శాఖాధ్యాయీ..................శర్మా అహం భో అభివాదయే!

ఆచమనం ఓం కేశవాయ స్వాహా..................శ్రీ కృష్ణాయ నమ:! ఆ బ్రహ్మలోకాదాశేషాత్‌ ఆలోకాలోకపర్వతాత్‌! యేస న్తి బ్రాహ్మణా దేవా: తేభ్యోనిత్యం నమో నమ:!! (అని నమస్కరించాలి) ప్రాత: (సాయం) సంధ్యావందనం సమాప్తం. శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్‌|

కరోమి యద్యత్‌ సకలం నారాయణేతి సమర్పయామి||

శ్లో|| గురు: బ్రహ్మా గురు: విష్ణు గురుద్దేవో మహేశ్వర:|

గురు సాక్షాత్‌ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ:||

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]