నమస్కారం
వికీపీడియా నుండి
నమస్తే నమస్కార్ లేదా నమస్కారం (ఆంగ్లం : Namaste, లేదా Namaskar లేదా Namaskaram) (సంస్కృతం: नमस्ते) ఈ పదము నమస్సు నుండి ఉద్భవించింది. నమస్సు లేదా " నమః " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము దక్షిణాసియాలో ఎక్కువగా కానవస్తుంది. ప్రత్యేకంగా హిందూ, జైన మరియు బౌద్ధ మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది.
గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ.
[మార్చు] సూర్య నమస్కారాలు
- ప్రధాన వ్యాసం: సూర్య నమస్కారాలు
సూర్య నమస్కారాలు యోగాసనాల సమాహారం. దీనిని సూర్యోదయ సమయంలో తూర్పు దిక్కుగా తిరిగి అభ్యాసం చేస్తే ఆరోగ్యకరమని నమ్మకం. సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.