ముద్ర

వికీపీడియా నుండి

తన ముద్రలతో లక్ష్మీదేవిని అభినయిస్తున్న భరతనాట్య కళాకారిణి

ముద్ర అనగా హిందూ మతం లో, బౌద్ధ మతం లో చేతులతో, వేళ్ళతో చేసే సంజ్ఞలు లేదా గుర్తులు. వీటిని కార్యాల్లోనూ, నృత్య రూపకాల్లోనూ, శిల్పకళ, మరియు చిత్రకళల్లోనూ గమనించవచ్చు. [1]. ముఖ్యంగా నాట్యాల్లో ప్రదర్శించే ముద్రలు, అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇవి చాలా సంక్లిష్టంగా, గూఢార్థాలను కలిగి ఉంటాయి. భారతీయ శాస్త్రీయ నాట్యంలో ప్రదర్శించే హస్త ముద్రల్లో సుమారు 500 రకాలైన అర్థాలను వ్యక్తపరచవచ్చని ఒక అంచనా. వీటిని ప్రదర్శించడానికి కేవలం హస్తాలనే కాక, ముంజేతులు, భుజాలను కూడా వాడతారు. శిల్పాల్లో కనిపించే ముద్రలు వీటితో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉంటాయి.

[మార్చు] కొన్ని ముద్రలు

  • అంజలి ముద్ర
  • అభయ
  • స్వస్తిక
  • శివలింగ
  • శంఖ
  • శోళపద్మం
  • సింహ ముఖం
  • సర్పశీర్షం
  • మయూరం
  • కపోతం
  • కటక వర్థనం
  • మృగశీర్షం

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు