యోని
వికీపీడియా నుండి
| యోని | |
|---|---|
| Human female internal reproductive anatomy. | |
| లాటిన్ | "sheath" or "scabbard" |
| గ్రే'స్ | subject #269 1264 |
| ధమని | Iliolumbar artery, vaginal artery, middle rectal artery |
| లింఫు | upper part to internal iliac lymph nodes, lower part to superficial inguinal lymph nodes |
| Precursor | urogenital sinus and paramesonephric ducts |
| MeSH | Vagina |
| Dorlands/Elsevier | v_01/12842531 |
యోని (ఆంగ్లం: vagina (లాటిన్ భాషలో "తొడుగు") స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని భాగము. ఇది కండరాలతో చేయబడిన స్థూపాకారపు నిర్మాణము. ఇది క్షీరదాలలో గర్భాశయం నుండి బాహ్య జననేంద్రియంగా శరీరపు బయటకు వస్తుంది. ఇది పక్షులలోను, సరీసృపాలలోను మరియు కీటకాలలో కూడా ఉంటుంది.
విషయ సూచిక |
[మార్చు] మానవులలో యోని నిర్మాణం
మానవులలో యోని స్తితిస్థాపక కండరయుతమైన గొట్టము. ఇది సెర్విక్స్ నుండి వుల్వా వరకు ఉంటుంది.[1] విశ్రాంతిగా ఉన్నప్పుడు యోని పొడవు ముందుగా సుమారు 6 నుండి 7.5 సెం.మీ. (2.5 to 3 అంగుళాలు) మరియు వెనుకగా 9 సెం.మీ. (3.5 అంగుళాలు) ఉంటుంది.[2] రతి సమయంలో యోని పొడవు మరియు వెడల్పు పెరుగుతుంది.[3] దీని యొక్క స్థితిస్థాపక లక్షణం మూలంగా రతి క్రీడ మరియు శిశువు జననంలో అవసరమైనంత వరకు సాగుతుంది.[4]
నిటారుగా నిలబడిన స్త్రీలలో యోని మార్గం గర్భాశయానికి 45 డిగ్రీలకంటే కొంచెం ఎక్కువ కోణంలో ముందుకు మరియు పైకి ఉంటుంది. యోని ద్వారం బాహ్య జననేంద్రియంలో మూత్ర ద్వారానికి వెనుకగా ఉంటుంది. యోని పైభాగం పురీషనాళం నుండి పెరిటోనియల్ సంచి తో వేరుచేయబడి ఉంటుంది. యోని మార్గం మరియు యోని ద్వారం మ్యూకస్ పొరలు ఎరుపు గులాబీ రంగులో ఉంటాయి.
యోని ద్రవాలు ముఖ్యంగా బార్తొలిన్ గ్రంధి నుండి విడుదలౌతాయి. ఇవి యోని మార్గాన్ని తేమగా ఉంచుతాయి. అండం విడుదల సమయంలో ఈ స్రావాలు పలుచగా మారి క్షార గుణం కలిగి ఉండి శుక్ర కణాలు ఎక్కువ కాలం జీవించడానికి తోడ్పడతాయి.
యోని ద్వారాన్ని కన్నెపొర (హైమెన్) అనే సన్నవి మ్యూకస్ పొర కప్పివుంచుతుంది. ఇది వివిధ కారణాల మూలంగా చిరిగిపోయి చివరికి నిర్జీవంగా అయిపోతుంది. శిశు జననం, రతి క్రీడ వంటి చర్యలు, కొన్ని రకాల వ్యాయామాలు, ప్రమాదాలు మొదలైనవి దీనికి కారణం కావచ్చును.[5] కన్నెపొర లేకపోవడం నిశ్చయంగా రతి మూలంగా మాత్రమే కాదు.
[మార్చు] యోని ధర్మాలు
[మార్చు] గర్భాశయ స్రావాలు
యోని నెలనెలా వచ్చే ఋతుచక్రం లోని రక్తం, స్రావాలు మరియు ఇతరమైన స్రావాలు శరీరం నుండి బయటికి పోవడానికి మార్గంగా పనిచేస్తుంది. కొందరు స్త్రీలు ఈ స్తావాల్ని బయటకు పోనీయకుండా మెత్తని ద్రవపదార్ధాల్ని పీల్చుకొనే సానిటరీ నాప్కిన్స్ ఉపయోగిస్తారు.
[మార్చు] శిశు జననం
శిశువు జననం సమయంలో యోని మార్గం తల్లి గర్భాశయం నుండి బాహ్య ప్రపంచంలోనికి త్రోవ చూపిస్తుంది. ఈ సమయంలో యోని యొక్క స్థితిస్తాపకత మూలంగా సాధారణ సమయంలో కంటే ఎన్నో రెట్లు అధికంగా సాగి యోని ద్వారా శిశువు జననానికి తోడ్పడుతుంది.
[మార్చు] రతి క్రీడ
స్త్రీల యోనిలోని అధికంగా ఉండే నరాల మూలంగా రతి క్రీడ సమయంలో అధికంగా సుఖాన్ని అందిస్తుంది. రతి సమయంలో యోనిలో ముఖ్యంగా యోనిశీర్షం ప్రేరణ మూలంగా యోని మార్గంలో స్రావాలు ఎక్కువగా తయారౌతాయి. ఇవి రతి క్రీడ సమయంలో యోనిలో రాపిడిని తగ్గిస్తాయి.
స్త్రీలలో రతి ప్రేరణ మూలంగా యోని పొడవు పెరుగుతుంది.[6] పూర్తిగా ప్రేరేపించబడిన సమయంలో యోని వెడల్పు కూడా పెరిగి ఒక గుడారం మాదిరిగా తయారౌతుంది.[7] శిశ్నం పరిమాణాన్ని బట్టి యోని గోడలు సాగి కటి కండరాల సాయంతో సంకోచ వ్యాకోచాలతో పురుషుని కదలికలకనుగుణంగా నడుచుకుంటుంది. దీని మూలంగా ఎంత చిన్నదిగా ఉన్న యోని అయినా చూడడానికి పెద్దదిగా ఉన్న శిశ్నాన్ని తీసుకోగలుగుతుంది.[8][9]
[మార్చు] జి. స్పాట్
G స్పాట్ అనేది ఒక కామ కేంద్రము. ఇది యోని ముందు గోడలో యోని ద్వారానికి ఐదు సెంటీమీటర్ల పైన ఉంటుంది. రతి క్రీడ సమయంలో ఈ కేందాన్ని ప్రేరేపించిన కొంతమంది స్త్రీలు అత్యంత సుఖానుభూతిని పొందుతారు. దీని మూలంగా కొందరు స్త్రీలలో భావప్రాప్తి (Orgasm) కూడా కలుగుతుంది.[10][11][12] అయితే కొంతమంది పరిశోధకులు అసలు జి.స్పాట్ ఉనికినే సంశయిస్తున్నారు.[13]
[మార్చు] ఆరోగ్యం మరియు పరిశుభ్రత
యోని సాధారణంగా ఏ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోయినా పరిశుభ్రంగా ఉంచబడుతుంది. వైద్యులు ఏ విధమైన క్రీములు లేదా ద్రవాలు ఉంచడాన్ని ప్రోత్సహించరు. ఆరోగ్యమైన యోనిలో కొన్ని రకాల బాక్టీరియా సహజీవనం చేస్తాయి. ఇవి లాక్టిక్ ఆమ్లం తయారుచేసి వ్యాధి కారక క్రిముల నుండి రక్షిస్తాయి. అయితే ఏ కారణం చేతనయినా ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు వ్యాధులు కలుగుతాయి.
స్త్రీల వ్యాధి నిపుణులు యోని లోపలి భాగాల్ని పరీక్ష చేయడానికి స్పెక్యులమ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. పాప్ స్మియర్ పరీక్ష కోసం యోని ద్రవాల్ని గాజు పలకల మీద పలుచని పొరగా తయారుచేస్తారు.
[మార్చు] వ్యాధి లక్షణాలు
యోని వ్యాధులలో ముఖ్యంగా వ్రణాలు, స్రావాలు మరియు పుండ్లు ఏర్పడతాయి.
- వ్రణాలు[14]
యోని లోపల ఏ విధమైన వాపు కూడా అసాధారణంగా గుర్తించాలి. అన్నింటికన్నా సామాన్యమైనవి బార్తోలిన్ తిత్తులు. ఇవి బార్తోలిన్ గ్రంధుల నుండి ద్రవాల్ని తీసుకొని పోయే నాళాలు ముసుకొని పోయినప్పుడు వాపు కలుగుతుంది. హెర్పిస్ వంటి వైరస్ వలన చిన్న చిన్న నొప్పి కలిగించే పొక్కులు ఏర్పడతాయి. యోనికి కాన్సర్ రావడం అరుదు మరియు సామాన్యంగా 70 సంవత్సరాల పైబడిన వారిలో వస్తుంది.[15]
- స్రావాలు[16]
ఎక్కువ మందిలో యోని స్రావాలు సామాన్యమైనవిగా ఉంటాయి. ఇవి క్లియర్ గా ఏ విధమైన వాసన లేకుండా ఉంటాయి. వ్యాధి కారక బాక్టీరియా, ఈస్ట్, గనేరియా, ట్రైకోమోనాస్ మరియు క్లమీడియా మొదలైన వాని వలన ఈ స్రావాలు ఎక్కువగా తయారౌతాయి. ఈ స్రావాలు చెడు వాసనతో తెలుపుగా చీము వలె గాని లేదా ఎర్రగా రక్తం రంగులో ఉంటాయి.
- పుండ్లు[17]
యోని మ్యూకస్ పొర దెబ్బతిన్నప్పుడు పుండ్లు ఏర్పడతాయి. ఇవి సామాన్యంగా రాపిడి కారణం. లోపలి దుస్తులు ఎక్కువగా గీసుకోవడం, రతి క్రీడలో గాని ముఖ్యంగా బలవంతంగా చేసేటప్పుడు పుండ్లుగా మారే అవకాశం ఉంటుంది. వ్యాధులలో సిఫిలిస్ పుండ్లు నొప్పి లేకుండా ఉంటాయి. గనేరియా వంటి వ్యాధులలో ముత్రంలో మంట కలుగుతుంది. యోని ద్వారా సంప్రాప్తించే ఎయిడ్స్ లో ఏ విధమైన బాధ ఉండదు.[18]
ఈ వ్యాధులన్నీ చాలా సులువుగా నయం చేయవచ్చును. అయితే వీటి కోసం ఎక్కువ మంది స్త్రీలు సిగ్గుతో వైద్యుల్ని సంప్రదించక పోవడం మూలంగా ఇవి ముదిరి ఇతరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు.[19]
[మార్చు] మూలాలు
- ↑ http://www.womenshealth.gov/glossary/#vagina Womenshealth.gov
- ↑ Gray's Anatomy
- ↑ The sexual response cycle. EngenderHealth. తీసుకొన్న తేదీ: 2007-10-13.
- ↑ http://www.metrokc.gov/HEALTH/famplan/flash/grades11-12/G1112-L17.pdf Metrokc.gov
- ↑ Rogers DJ, Stark M (Aug 1998). "The hymen is not necessarily torn after sexual intercourse". BMJ 317: 414. PMID 9694770.
- ↑ Does size matter. TheSite.org. తీసుకొన్న తేదీ: 2006-08-12.
- ↑ do big penises hurt?. AskMen.com. తీసుకొన్న తేదీ: 2006-08-14.
- ↑ The female reproductive system. birth.com.au. తీసుకొన్న తేదీ: 2007-05-07.
- ↑ Facts about penis size. netdoctor.co.uk. తీసుకొన్న తేదీ: 2007-05-14.
- ↑ Crooks, R; Baur, K [1999]. Our Sexuality. California: Brooks/Cole.
- ↑ Jannini E, Simonelli C, Lenzi A (2002). "Sexological approach to ejaculatory dysfunction.". Int J Androl 25 (6): 317–23. DOI:10.1046/j.1365-2605.2002.00371.x. PMID 12406363.
- ↑ Jannini E, Simonelli C, Lenzi A (2002). "Disorders of ejaculation.". J Endocrinol Invest 25 (11): 1006–19. PMID 12553564.
- ↑ Hines T (Aug 2001). "The G-Spot: A modern gynecologic myth". Am J Obstet Gynecol 185 (2): 359–62. DOI:10.1067/mob.2001.115995. PMID 11518892.
- ↑ Mayo Clinic Staff Bartholin’s Cyst. January 19 2008 accessed http://www.mayoclinic.com/health/bartholin-cyst/DS00667/DSECTION=1 23 March 2008
- ↑ Manetta A, Pinto JL, Larson JE, Stevens CW, Pinto JS, Podczaski ES (Jul 1988). "Primary invasive carcinoma of the vagina". Obstet Gynecol 72 (1): 77–81. PMID 3380510.
- ↑ Spence D, Melville C (Dec 2007). "Vaginal discharge". BMJ 335 (7630): 1147–51. DOI:10.1136/bmj.39378.633287.80. PMID 18048541.
- ↑ మూస:EMedicine
- ↑ Mayo Clinic Staff HIV/AIDS. January 20 2008 accessed at https://www.mayoclinic.com/health/hiv-aids/DS00005 on 23rd March
- ↑ Butcher J (Jan 1999). "ABC of sexual health: female sexual problems II: sexual pain and sexual fears". BMJ 318 (7176): 110–2. PMID 9880287.
|
|||||||||||||||||||||||