ఎయిడ్స్
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను వైరస్ వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది.
[మార్చు] ఎయిడ్స్ భాదితులు
2004లోనే 30,00,000మంది ఎయిడ్స్ బారిన పడి చనిపోయారు, వీరిలో 5,00,000 మంది చిన్నారులే. ఇంకో 40,00,000 మందికి 2004లోనే ఎయిడ్స్ సోకి ఉంటుందని ఒక అంచనా. ఎయిడ్స్ భాదితులలో అత్యధికులు ఆఫ్రికా ఖండంవారే. వారి తరువాత స్థానంలో భారతదేశం ఉంది. అంతే కాదు భారత దేశంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఆంధ్ర ప్రదేశ్లో చాలా తొందరగా పెరుగుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(NACO) చెబుతుంది. జనవరి 2011 వరకు NACO నుండి ART మందులను అందుకునే వారి సంఖ్య 43,000,00. మందులు అందుకోకుండా కేవలం నమోదు చేసుకున్న వారి సంఖ్య ఇందులో కలపలేదు. అలాగే ప్రైవేటుగా చికిత్సను అందుకునే వారి సంఖ్య కూడ ఇందులో కలపలేదు. దేశంలో 10% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆంద్రప్రదేశ్‌లోనే ఉన్నారు.
[మార్చు] ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది?
శాస్త్రఙుల అంచనా ప్రకారం హెచ్ఐవి వైరసు సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915, 1941ల మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడ గ్రీన్ చింపాంజీలకు ఎస్ఐవి(SIV)సోకుతూ ఉండేది, ఇది హెచ్ఐవిగా రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది అని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది. దీనిని మొదట స్వలింగ సంపర్కంలో పాల్గొనే పురుషులకు సోకే వ్యాధి అని అపోహ పడ్డారు. కాని వచ్చిన కేసులలో సగంపైగా స్వలింగ సంపర్కంలో పాల్గొనని వారు కావటం వలన అందరికీ వచ్చే జబ్బుగా నిర్ధారించారు.
[మార్చు] మనుషుల శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది?
హెచ్ఐవి వైరసు మనుషులలో చేరిన వెంటనే, రోగనిరోధకతా శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధి గ్రస్తులు జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. అంతేకాక వ్యాది నిరొదకత తగ్గినకొద్ది ఎయిడ్స్ అహ్వానిత వ్యాదులు (Opportunistic Infections ) రావటం మొదలు పెడతాయి.ఒక్కసారి గనక ART మందులు వాడటం మొదలుపెడితె ఈ వ్యాదులు రావటం అరుదు.[1]
[మార్చు] హెచ్ఐవి మరియూ ఎయిడ్స్
హెచ్ఐవి వైరసు ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్ఐవి పాజిటివ్ అని సంభోదిస్తారు.
హెచ్ఐవి ఉన్న వారికి ఎయిడ్స్ వచ్చినట్లు ఎప్పుడు నిర్ధారిస్తారంటే:
- రక్త పరీక్ష చేసినప్పుడు రోగనిరోదకత బాగా క్షీణించిందని తేలినప్పుడు.CD4 కణాల సంఖ్య ౨౦౦ కంటె తక్కువ ఉన్నప్పుడు
- ఎయిడ్స్ కలిగించిన రుగ్మత
[మార్చు] ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు
మనుషులలో సహజంగా రోగనిరోధక శక్తి ఎన్నో రోగాలను అడ్డుకుంటుందిటాయి. ఆ నిరోధక శక్తి నశించినప్పుడు రుగ్మతులు శరీరంలోకి చేరుకుంటాయి.ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు సాధారణంగా, ఆరోగ్యవంతులెవరికీ రావు. అందుకనే వీటికి ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు అని పిలుస్తారు. ఎయిడ్స్ కలిగించే కొన్ని రుగ్మతలు:
- కపోసీస్ సర్కోమా (Kaposi's Sarkoma) - సాధారణంగా చర్మానికి వచ్చే క్యాన్సరు.
- సిఎంవి రెటీనైటిస్ (CMV Retinitis) - కంటి వెనుక భాగంలో సోకే ఒక వైరసు.
- పిసిపి (PCP) - ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో చాలా మందికి సోకే రోగము, ఇది ఊపిరితిత్తులకు సోకుతుంది.
- టాక్సోప్లాస్మోసిస్ (Taxoplasmosis) - ఈ రోగము మెదడుకు సోకుతుంది.
- ఇన్వేసీవ్ సర్వికల్ క్యాన్సర్ (Invasive Cervical Cancer) - ఇది ఆడవారి గర్భకోశం కింద వ్యాపించే క్యాన్సరు.
[మార్చు] హె.ఐ.వి. పరీక్షలు
- ప్రధాన వ్యాసం: HIV పరీక్ష
బాగా వ్యాధి ముదిరేవరకు తమలో జబ్బు ఉందని ఎవరూ అనుకోరు,ఊహించరు. కలిగిన అనారోగ్యానికి కారణం తెలుసుకోవడానికి జరిపే వైద్యపరీక్షలలో ఇటువంటి ప్రాణాంతక జబ్బులు బయటపడతాయి. హెచ్.ఐ.వి.కి చేసే పరీక్షలలో ముఖ్యమైనవి 1. ట్రైడాట్ ,2.వెస్ట్రన్ బ్లాట్ , 3.సి.డి సెల్ కౌంట్.
[మార్చు] ట్రైడాట్
ఎలీసా టెస్ట్స్ లో ఇది మొదటిది. మనిషి శరీరములో ప్రవేశించిన 'హెఐవి' క్రిములకు ప్రతిస్పందన కణాలు(Antibodies)తయారవడానికి 3-6 నెలలు పడుతుంది. అప్పుడే ఈ పరీక్ష ద్వారా ఎయిడ్స్‌ను గుర్తించవచ్చు. 'హెఐవి' ఉందా? లేదా? అని మాత్రమే తెలుస్తుంది . ఈ టెస్ట్ చేయడము తేలిక, తొందరగా అయిపోతుంది. మాస్ స్క్రీనింగ్ విధానములో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా నిర్ధారణ అయిన పరీక్ష కాదు.
[మార్చు] వెస్ట్రన్ బ్లాట్
హెచ్.ఐ.వి నిర్ధారణ కోసం ఉపయోగించే పరిక్ష ఇది. ఖర్చు ఎక్కువ. వారం రోజులు పడుతుంది. పూర్తి టెస్ట్ వివరాలకోసం వేరే చోట చూడండి.
[మార్చు] సిడి4 కణాల సంఖ్య
మనుషుల రోగనిరోధకతకు రక్తంలో సిడి4 అనే రకం తెల్ల రక్తకణాలు ఎంతో దోహద పడతాయి. ఇవి రోగకారక జీవాలతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే హెచ్ఐవీ ఈ సిడి4 కణాలను చంపేస్తుంది. హెచ్ఐవి పెరుతున్నకొద్దీ ఈ సిడి4 కణాలు నశించటం ప్రారంభిస్తాయి. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ద్రువపరుస్తారు.
[మార్చు] ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది
- లైంగిక సంపర్కం వలన. ప్రపంచంలోని అత్యధికులు ఈ మార్గం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు.
- రక్తం ద్వారా. పచ్చబొట్లు పొడిపించుకోవటం వలన, వ్యాధి గ్రస్తుని రక్తదానం వలన కూడా ఎయిడ్స్ వ్యాపించ వచ్చు. పచ్చబొట్టు వళ్ళ ఎందుకంటే, వారు ఒకరికి ఉపయోగించిన సూదినే మళ్ళీ ఇంకొకరికి ఉపయోగిస్తారు, అయితే ఇలాంటి కోవాకే చెందిన క్షవరం, సుంతీ, ఇంజెక్షను మొదలగునవి చేయించుకునేటప్పుడు అప్రమత్తతో మెలగ వలెను.
- తల్లి నుండి బిడ్డకు. తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి వారాలలో ఈ వ్యాది కోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ చనుబాల వలన కూడా సంక్రమిస్తుంది. సరయిన చికిత్స తీసుకోనప్పుడు ఈ రకమయిన వ్యాప్తికి ఆస్కారం 20% అయితే, సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసి సరయిన చికిత్స ఇవ్వగలిగితే అప్పుడు ఎయిడ్స్ వ్యాప్తిని ఒక్క శాతానికి తగ్గించవచ్చు.
[మార్చు] హెచ్ ఐ వి లక్షణాలు
సాధారణంగా వైరస్ శరీరం లో కి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల )వరకు రక్త పరీక్ష ల ద్వార వైరస్ జాడ కనుగోనలేము[2]. దీనినె Window Period అంటారు. ఈ క్రింది లక్షణాలు హెచ్ ఐ వి రోగుల లో కనిపిస్తాయి. జ్వరం, నోటి పూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, పది శాతం బరువు ని కోల్పోవడం, గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా )Swollen lymph nodes, మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.
ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లొ తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికొ దాదాపు 10 సంవత్సరాలు [3] [4]పడుతుంది, కొందరిలొ అంతకంటె ఎక్కువ కూడ. కొందరిలో ఈ పది సంవత్సరాల కాలంలొ ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. దీన్నే Asymptomatic Period. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చెసుకొని నిర్ధారించుకోవాలి. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితె జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు.[5] [6] [7] . ప్రతి సంవత్సరం కొత్త కొత్త మందులు అందుబాటులొకి రావటం ద్వార ఎయిడ్స్ రొగుల జివితకాలం పెరుగుతు ఉంటుంది.
[మార్చు] శిశువులలో హెచ్.ఐ.వి
సాదారణముగా హెఐవి సోకిన తల్లులకు పుట్టిన బిడ్డలకు హెచ్ఐవి సోకిందో లేదో తెలుసుకోడానికి కనీషము 18 నెలలు వ్యవధి కావాలి. హెచ్ఐవి తల్లుల సాదారణ పురుడు లో 30% వరకూ ,హెఐవి సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకు 10%-15% వరకూ,సిజేరియన్ ఆపరేషన్ ద్వార పుట్టినపిల్లలకు 1% జబ్బు అంటుకునే అవకాశాలున్నాయి. హెచ్ఐవి తల్లులకు గర్భినిగా ఉన్నపుడు 'ఎ.అర్.టి.' మందులు వాడమువలన బిడ్డలకు 'హెచ్ ఐ వి' సోకే అవకాశము 1-2% వరకు తగ్గుతుంది. 18 నెలలు వ్యవధి లో బిడ్డకు హెచ్ ఐవి జబ్బు ముదిరిపోయే అవకాశము ఎక్కువే కావున మామూలు పరీక్షల తో నిర్ధారణ చేయడము కంటే వేగవంతమైన పరీక్ష ఉంటే బాగుండుననే ఉద్దేశము తో ఈ మధ్యన డిఎన్ఎ-పిసీర్ పరీక్ష ద్వారా 0-7 రోజుల వయసు లో హెచ్‌ఐవి పరీక్షలు ఇర్వహించి తొందరగా హె ఐవి ట్రీట్మెంట్ ప్రారంభించి పూర్తిగా హెచ్ఐవి లేకుండా నివారించే అవకాశాముంది. ఈ పద్దతి ద్వారా శిశువు కాలు వద్ద ప్రికింగ్ చేసి(రక్తసేకరణ) డిఎన్ఎ-పిసీర్ పరీక్షచేసి హెచైవి నిర్ధారణ చేస్తారు.
చికిత్స నెవిరపిన్ ఓరల్ డ్రాప్స్ డాక్టర్ చెప్పిన మోతాదులో (ఈ పట్టిక చూడండి)వాడండి.[8]
[మార్చు] హెచ్ఐవి మరియు ఎయిడ్స్‌ల చికిత్స
ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగె ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సారలు వాడుతుపోతుఉంటే హెచ్ఐవీ వైరస్ మందులను తట్టుకునే సామర్ధ్యం పెంచేసుకుంటున్నాయి అలాగే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్‌టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటె ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.
హెచ్ఐవి చికిత్సకు సంబంధించి ఆరు ముఖ్యమయిన మందులు వీటినే ART ( Antiretroviral Therapy) లేదా ARV's(Antiretrovirals) అని పిలుస్తారు. ఇవి కాక ఇంకా చాల రకాల మందులు ఉన్నాయి
- D4T (stavudine) స్టావిడైన్
- 3TC (Lamivudine) లామివుడైన్
- NVP (nevirapine) నెవిరపైన్
- AZT (zidovudine) జిడోవుడైన్
- EFZ (efavirenz) ఎఫావిరెంజ్
- DDI (Didanosine) డిడనొసిన్
ఈ మందులు ఒకప్పుడు కేవలం ధనిక దేశాలలొ మాత్రమె లబించేవి. ఒకప్పటితొ పొలిస్తె ఇప్పుడు వీటికయ్యె ఖర్చు చాల తక్కువ. పెటెంట్ల ను అడ్డం పెట్టుకొ వెలాది రుపాయలకు అమ్ముకునె కంపనీలకు మన ఇండియా కంపనీలు నిర్గాంతపొయెలా చేశాయి. మన దెశానికి చెందిన సిప్లా , అరబిందో, హెటెరో, రాంబక్సి, ఏంక్యుర్ వంటి పార్మసి కంపనీలు ఆంట్రి రిట్రోవైరల్స్ తయారి మొదలుపెట్టాక ART మందుల దరలు చాల వరకు తగ్గాయి. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక రొగికి మొదటి లైనుకు అయ్యె చికిత్స ఖర్చును రుపాయలు 14000 నుండి 17000 వరకు తగ్గించగలిగాయి.[9] [10] [11] [12]. ప్రపంచంలొ ఉత్పత్తి అయ్యే ART మందుల వాటాలొ మన ఇండియా కంపనీలే 65%-70% వరకు ఉత్పత్తి చేస్తున్నాయి[13]. ఎన్నొ అప్రికా దేశాల హెచ్ ఐ వి పాజిటవ్ వ్యక్థుల ప్రాణాలను ఈ కంపనీలు కాపాడుతున్నాయి
[మార్చు] ఎయిడ్స్‌ని అరికట్టడం
అయితే ఎయిడ్స్‌కి సరయిన, ఖరీదు కాని చికిత్స ఇప్పటివరకూ లేదు. అందుకని దానిని నివారించడం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రిఫరల్ ఆసుపత్రులలో స్వఛ్ఛందంగా రక్తం పరీక్షించుకోడానికి, సరియైన సలహాలు పొందడానికి VCTC కేంద్రాలను ఏర్పరచింది.
సురక్షితమయిన శృంగారం === తొడుగులను (కండోమ్) ఉపయోగించండి. తొడుగులను ఉపయోగించటం వలన ఎయిడ్స్ వ్యాప్తి దాదాపు సున్నాగా ఉంటుంది. దాదాపుగా, యెందుకంటే అప్పుడప్పుడు కొంతమంది తొడుగును సరిగ్గా ఉపయోగించరు కాబట్టి. కాబట్టి సాధ్యమయినంత వరకూ తెలియని వారితో సంపర్కించవద్దు. భారత దేశంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ తొడుగులను ప్రజలకు విరివిగా అందుబాటులో ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు ఒక సారి వాడిన తొడుగులను ఎట్టి పరిస్తితుల్లోను రెండోసారి వాడరాదు. తొడుగులకు కూడా మురిగిపోవు తారీఖు ఉంటుంది, ఒక సారి పరిశీలించి తీసుకోండి. తొడుగులు మగవారికే కాదు ఆడవారికి కూడా లభ్యమవుతున్నాయి.
[మార్చు] ఎయిడ్స్‌పై ఎయిడ్స్‌తో పోరు
మేరీల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్‌ఐవీ వైరస్‌ను నిష్క్రియపరిచిన తర్వాత కోతుల్లోకి వ్యాక్సిన్ రూపంలో ప్రవేశపెట్టారు. ఆరునెలల తర్వాత తిరిగి అవే కోతుల్లోకి క్రియాశీలకంగా ఉన్న ఎస్‌ఐవీని ఎక్కించారు. కొన్ని వారాల వ్యవధిలోనే కోతుల్లో ఉన్న ఎయిడ్స్ వైరస్ 95 శాతానికి పడిపోయింది.(ఈనాడు 20.2.2010)
[మార్చు] ఎయిడ్స్ ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల వేతన సెలవు
ఎయిడ్స్ వ్యాధితో బాధపడే ప్రభుత్వ ఉద్యోగులు 18 నెలలపాటు వేతనంతో కూడిన సెలవు పొందే వేసులుబాటును
తమిళనాడు ప్రభుత్వం కల్పించింది.ఇప్పటి వరకు క్యాన్సర్, టీబీ, గుండె, మూత్రపిండాలు, నేత్ర సంబంధిత శస్త్రచికిత్సలకు
మాత్రమే వేతనంతో కూడిన దీర్ఘకాలిక సెలవు మంజూరు చేసేవారు.ఎయిడ్స్ కలిగిన ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు,
ప్రభుత్వం వారితో ఉందన్న భావన కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.(ఈనాడు తేదీ:27.9.2009)
[మార్చు] ఎయిడ్స్ ఇలా వ్యాపించదు
ఈ క్రింది మార్గాలలో ఎయిడ్స్ వ్యాధి వ్యాపించదు
- ఈగలు,దోమ కాటు,నల్లులు,పేల వలన.
- స్పర్శించటం వలన,హెచ్‍ఐవి/ఎయిడ్స్ సోకిన వ్యక్తిని కౌగలించుకొవడం వలన
- వ్యాధిగ్రస్తుని బట్టలు ధరించటం వలన.
- ఒకే మరుగు దొడ్లను ఉపయోగించటం ద్వారా.
- ఎయిడ్స్‌గల వారితో కలిసిమెలిసి జీవించడం వల్ల
- ఎయిడ్స్‌పీడితుల స౦రక్షణ బాధ్యతవహించేవారికి ఆ కారణంగా ఇది సోకడం జరగదు.
- హెచ్‍ఐవి/ఎయిడ్స్ ఉన్నవారితో కలసి పనిచేయడం వలన సంక్రమణకు గురయ్యే ప్రమాద౦ ఎ౦తమాత్ర౦ లేదు.
[మార్చు] కొన్ని ప్రశ్నలు
- ఎయిడ్స్ రాకుండా ఏవైనా టీకాలు ఉన్నాయా?
- హెచ్.ఐ.వి. రాకుండా నిరొదింఛే టీకా ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తున్నారు కూడా. భారతదేశం విషయానికొస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ "నారి" (జాతీయ ఎయిడ్స్ పరిశొధనా సంస్థ, పుణె ) ఈ దిశగా ఎంతో కృషి చేస్తోంది. వ్యాక్సిన్ పరిశొధనలు,వివిధ దశలలొ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే ఇది ఇప్పటికే వ్యాధిగ్రస్తులైన వారికి మాత్రం ఉపయోగపడదు. కొత్తగా ఎవరూ హెచ్.ఐ.వి బారిన పడకుండా మాత్రమే కాపాడగలదు.
- శరీరంలోని రోగనిరోధక శక్తికి అందకుండా దాక్కు ని ఉన్న హెచ్.ఐ.వీ వైరస్ లక్షణాలను గుర్తించి దానిపై పోరాడే వ్యాక్సిన్ తయారైంది. ఈ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇది శరీరంలోని హెచ్ఐవీ వైరస్‌పై తీవ్రంగా పనిచేస్తుంది.శరీరంలో ఏ మూలన దాక్కున్న వైరస్‌నైనా ని యంత్రించి ఇతర శరీర భాగాలపై దాని ప్రభావం లేకుండా చేస్తుంది. వ్యాక్సిన్‌ను ఇంజక్షన్ ద్వారా అందిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వైరస్ వృద్ధి చెందకుండా చూస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.(ఆంధ్రజ్యోతి 6.10.2009)
- ఎయిడ్స్ గ్యారంటీగా నయం చేయగలమని కొందరు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. నమ్మవచ్చా?
- ఇంతవరకు ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేసే మందులు తయరు కాలేదు.అయితే ఎయిడ్స్ దశలో రోగి జీవిత కాలాన్ని పొడిగించే "ఎ.అర్.టి." మందులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 45 ART సెంటర్లలొ NACO ఉచితంగా మందులను ఇస్తుంది. [14] ART మందులు తప్ప వెరె ఏ మందులు హెచ్ ఐ వి / ఎయిడ్స్ పైన పని చేయవు గ్యారంటీగా ఎయిడ్స్ నయం చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవారిని నమ్మకండి.
- హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల్లో సిడి-4 కౌంట్ 200కు తగ్గగానే పలు కేంద్ర నాడీ మండల వ్యాధులు చుట్టుముడతాయి.హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ (హార్ట్) చికిత్సతో వ్యాధిని నియంత్రించే అవకాశం కలిగిఇంది.
- డాక్టర్లు నేను హెచ్ ఐ వి పాజిటివ్ గా నిర్దారించారు, నేను వెంబడే చనిపోతానా? [15]
- లేదు, హెచ్ ఐ వి పాజిటివ్ పర్సన్ అంటె ఎయిడ్స్ ను కలగచెసె హెచ్ ఐ వి అనె వైరస్ మీ శరీరంలొ వున్నది అని అర్థం. అంతే కాని మీకు ఎయిడ్స్ ఉన్నది వెంబడె చనిపోతారని మాత్రం కాదు. ఏయిడ్స్ కు పూర్తి స్థాయిలొ నివారించె మందులు లేవు కాని ఎయిడ్స్ వల్ల వచ్చె అన్ని రుగ్మతలకు (opportunistic infections) పూర్తిగా నివారించె మందులు, రాకుండా అరికట్టె మందులు ప్రస్తుతానికి అందుబాటులో వున్నాయి. ఇవన్ని కలిపి హెచ్ ఐ వి / ఎయిడ్స్ తొ జీవించె వ్యక్థుల జీవన ప్రామాణాల్ని చాలవరకు పెంచాయి.
[మార్చు] పాదపీఠికలు మరియు మూలాలు
- ↑ http://www.avert.org/hiv-opportunistic-infections.htm
- ↑ http://aids.gov/hiv-aids-basics/prevention/your-hiv-status/testing-window-period/
- ↑ http://www.medicinenet.com/human_immunodeficiency_virus_hiv_aids/article.htm
- ↑ http://www.thebody.com/content/art49930.html
- ↑ http://www.aidsmeds.com/articles/hiv_survival_uk_1667_21328.shtml
- ↑ http://www.aidsmap.com/page/1430966/
- ↑ http://www.aidstruth.org/denialism/myths/ltnp
- ↑ http://www.merck.com/media/mmpe/pdf/Table_280-3.pdf
- ↑ http://www.avert.org/generic.htm
- ↑ http://aids.about.com/od/hivmedicationfactsheets/a/affordable.htm
- ↑ http://www.business-standard.com/india/news/low-cost-hivaids-drugs-to-be-available-in-india-by-oct-end/113628/on
- ↑ http://en.wikipedia.org/wiki/Cipla#Struggle_against_HIV.2FAIDS_in_the_developing_world
- ↑ http://articles.timesofindia.indiatimes.com/2011-02-10/india-business/28542384_1_arvs-generic-companies-pepfar
- ↑ http://www.nacoonline.org/upload/Directory%20of%20Service%20Facilities/List%20of%20functional%20355%20ART%20Centres%20as%20on%20March-2012.pdf
- ↑ http://www.thebody.com/content/art46391.html#10
[మార్చు] ఇతర గ్రంధాలు
- 2007 AIDS epidemic update (pdf). UNAIDS. తీసుకొన్న తేదీ: 2008-03-21.
- UNAIDS Annual Report — Making the money work (pdf). UNAIDS. తీసుకొన్న తేదీ: 2008-03-21.
- Financial Resources Required to Achieve, Universal Access to HIV Prevention, Treatment Care and Support (pdf). UNAIDS. తీసుకొన్న తేదీ: 2008-03-21.
- Practical Guidelines for Intensifying HIV Prevention (pdf). UNAIDS. తీసుకొన్న తేదీ: 2008-03-21.
- Antiretroviral Formulations (pdf). US Department of Health and Human Services. తీసుకొన్న తేదీ: 2008-03-21.
- Approved Medications to Treat HIV Infection (pdf). US Department of Health and Human Services. తీసుకొన్న తేదీ: 2008-03-21.
- The HIV Life Cycle (pdf). US Department of Health and Human Services. తీసుకొన్న తేదీ: 2008-03-21.
[మార్చు] బయటి లింకులు
[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి
- AIDSinfo - HIV/AIDS Treatment Information, U.S. Department of Health and Human Services
- UNAIDS: The Joint United Nations Programme on HIV/AIDS
- Portal to all Federal HIV/AIDS information - Office of HIV/AIDS Policy
- భారతదేశంలో ఎయిడ్స్ గురించిన సమాచారం
