జి స్పాట్
జి స్పాట్ అనబడే కామకేంద్రం స్త్రీ యోని లోపల దాగి వుంటుంది. సంభోగంలో, స్త్రీ భావ ప్రాప్తి చెందడానికి ఈకామకేంద్రం ప్రేరింపబడ చేస్తే చాలునని వైజ్గ్ఞానికులు/పరిశోదకులు తేల్చి చెప్పారు.
[1] జి స్పాట్, స్త్రీ ప్రోస్ట్రేట్ గా కొంతమంది పేర్కొన్నారు.[2]. గ్రాఫెన్ బెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు, మొట్టమొదటిసారిగా ఇలాటి కామకేంద్రం స్త్రీలలో యోని లోపలి భాగాన ఉందని కనుగొన్నాడు. ఈకామోద్రేక కేంద్రాన్ని అతని పేరులోని మొదటి అక్షరం వచ్చేట్టు జి స్పాట్ అని పిలుస్తారు.[3] ఆకారంలోనూ, పరిమాణంలోనూ, అలసందగింజను పోలివుంటుంది. నిర్వహించిన ప్రయోగల్లో ఎందరో స్త్రీలు, తమ యోనిలోపల ఒక బుడిపె లాంటి ప్రదేశం ఉందని, దాన్ని ఉత్తేజ పరిస్తే, తమలో కామోద్రేకం, కట్టలు తెంచుకుని భావప్రాప్తి (ఆర్గసం) చెందామని, యోనిలో స్కలనం జరిగి, ఆ ప్రదేశం చిత్తడై పోయిందని దృవీకరించారు.[4] సంభోగంలో గాని, స్వయంతృప్తి కోసం చేసే హస్త ప్రయోగం ద్వారా గాని, లేదా ఇప్పుడు లభ్యమౌతున్న వివిద రకాల పరికరాల ద్వారా గానీ జి స్పాట్ ఉత్తేజ పరచబడి, కామోద్రేకానికి గురై, తదుపరి పరాకాష్టలో భావప్రాప్తి కలిగిస్తుంది.
క్రీ.శ. 1940లో, కనుగొనబడ్డా, జి స్పాట్ మీద వివాదాలు ఇప్పటి వరకు ఓ కొల్లిక్కి రాలేదు.[5][6][7] బ్రిటిష్ వైజ్జ్గ్ఞానికులు క్రీ.శ. 2009లో జరిపిన పరిశోదనలలో, అసలు జి స్పాట్ అనేదే లేదని తేల్చి చెప్పారు.[8] ఆయితే ఆ తరువాతి ప్రయోగాల్లో, భావ ప్రాప్తి చెందామని చెప్పిన వారిని అల్ట్రాసౌండ్ పరికరాలతో మరియు బౌతికంగా పరీక్షలు, నిర్వహించి పరిశొధకులు జి స్పాట్ ఉందని తతేల్చారు.[9][10] కొన్ని పరిశొధనలలో ఉందని, మరికొన్ని పరిశోధనలలో లేదని వైజ్గ్ఞానిక వర్గాలు కొట్టుకుంటుంటే, మాస్టర్స్ మరియు జాన్సన్ తమ పుస్తకం జి స్పాట్ క్లిటారిస్ ఎక్స్తటెంషన్ అని బావించారు.[11][12]
ఈ వివాదాలన్నీ మరో విచిత్ర పరిస్తిథికి దారి తీసింది! తమలో జిస్పాట్ కనుగొనలేక పోయిన మహిళలు, తాము జడులమని భావించి, మానసిక ఒత్తిడికి లోనయినట్టు బిబిసి తెలిపింది.[13] తమలోని జి స్పాట్ మరింత సులువుగా ఉత్తేజపడేట్టు చేయడానికి, కొంతమంది (జి స్పాట్ యాంప్లిఫికేషన్ అనే) ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు.[5]
[మార్చు] మూలం
గ్రాఫెన్ బెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు, మొట్టమొదటిసారిగా ఇలాటి కామకేంద్రం స్త్రీలలో యోని లోపలి భాగాన ఉందని కనుగొన్నాడు కనుక, ఈకామోద్రేక కేంద్రాన్ని అడ్డిఎఇగో 1981, అతని పేరులోని మొదటి అక్షరం వచ్చేట్టు జి స్పాట్ అని పేరు పెట్టాడు.[14][15]
[మార్చు] Female prostate
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోషీషన్స్ ఆఫ్ అనాటమిస్ట్స్, 2001లో జి స్పాట్, మహిళా ప్రోస్ట్రేట్ గాగుర్తించారు.[2]
[మార్చు] బయటి లింకులు
- About.com – Sexuality, "What is the G-Spot?", Cory Silverberg
- About.com – How to Locate Your G Spot
- The-Clitoris.com – Female Ejaculation, the Female Prostate, and The G-Spot
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found