నాలుక
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
నాలుక (Tongue) పూర్తిగా కండరాలతో చేయబడిన నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడం మరియు మింగడంలో ఉపకరిస్తుంది. దీనివల్లనే మనకు రుచి తెలుస్తుంది. లాలాజలం దీన్ని ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఇది నోటి అడుగుభాగంలో క్రింది పల్లు నుండి గొంతు వరకు వ్యాపించింది.
[మార్చు] నిర్మాణము
- ఉపకళా కణజాలము: జిహ్వా మొగ్గలు కలిగి ఉండి, రుచిని తెలియజేస్తాయి.
- గ్రంధులు: వీటి స్రావాలు నాలుకను తేమగా ఉంచుతాయి.
- కండరాలు: ముఖ్యంగా చారల కండరాలు. నాలుక చలనంలో తోడ్పడతాయి.
[మార్చు] వైద్యశాస్త్రంలో
- నాలుక క్రింద మాత్రలు ఉంచడం ఒక వైద్యవిధానం. మందు త్వరగా కరిగి గుండెను చేరి అతి త్వరగా పనిచేయడం మొదలుపెడుతుంది. గుండెనొప్పి వచ్చిన వెంటనే మనతో ఉన్న నైట్రోగ్లిజరిన్ మాత్రలు వెంటనే పనిచేసి నొప్పి తొందరగా తగ్గుతుంది.
- నాలుక పూత ఒకరకమైన శిలీంద్ర సంబంధమైన వ్యాధి.
- మనిషి శరీరంలో నీరు ఎక్కువగా తగ్గినప్పుడు నాలుక ఎండిపోయినట్లు పొడిగా కనిపిస్తుంది.
- కొన్ని నరాల వ్యాధులలో నాలుక వంకరపోతుంది. అది తిరిగిన వైపును బట్టి వ్యాధిని గురించి అవగాహన కలుగుతుంది.
- నోటిలోని కాన్సర్ నాలుకకు కూడా రావచ్చును.
- నాలుక ద్వారా చూపు:కంటి చూపు కోల్పోయిన వారు నాలుకతో చూసే విధంగా బ్రెయిన్ పోర్ట్ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు.
[మార్చు] మూలాలు
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
|
|||||||||||||||||||||||