కన్ను

వికీపీడియా నుండి

మానవుని కన్ను
మానవుని కన్ను

కన్ను (Eye) మానవుని జ్ఞానేంద్రియం. మానవునికి ముఖంలో రెండువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి కెమెరా వలె పనిచేసి, బాహ్య రూపాల్ని మెదడుకి పంపుతాయి.

విషయ సూచిక

[మార్చు] కంటిజబ్బులు

[మార్చు] కంటి జాగ్రత్తలు

కళ్ళు మనిషికి చాల ప్రధానమైనవి. అంధకారమైన జీవితము ఊహించడానికి కూడా సాహసించరు. కళ్ళను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి.

చదివేటపుడు

  • పుస్తకము 30 సెం.మీ. దూరము లో ఉంచుకోవాలి. నిటారుగా కూర్చొని చదవాలి. పడుకొని చదవకూడదు. సరిపడా వెలుతురు ఉండాలి . కదులుతున్న కుర్చీలో కూర్చొని చదివితే కళ్ళకు శ్రమ కలుగుతుంది.

టెలివిజన్ చూస్తున్నప్పుడు

  • ఒక గంటకు మించి విడవకుండా టివి చూడడము మంచిదికాదు.
  • టీ.వీ. చూస్తున్నపుడు శరీరాన్ని పలురకాల భంగిమల్లో ఉంచడం చాలామందికి అలవాటు, అయితే వెన్నెముకకి సపోర్టు ఇచ్చే కుర్చీలో కూర్చొని టీ.వీ. చూడడము కంటికి మేలుచేస్తుంది.
  • చూసేటపుడు మనకు టీ.వీ. కి కనీసము 3 మీటర్లు దూరము ఉండాలి.
  • చీకటిగ ఉన్న గదిలో కూర్చోని టీ.వీ. చూడడం కంటికి శ్రేయస్కరము కాదు. టివి చూస్తున్నపుడు వెలుతురు సరిపడా ఊండాలి. ఆ లైటు కూడా టివి వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది.

కంప్యూటర్ తో పనిచేస్తున్నపుడు

  • కంప్యూటర్ తెర మధ్యభాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది.
  • రెప్ప వేయకుండా పనిచేయడము మంచిదికాదు. తరచుగా రెప్పలు వేస్తూ ఉండాలి. నిరంతరము పనిచేయకుండా మద్యలో విరామము ఇవ్వాలి.
  • కాల్లూ నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చొవాలి. మీ ద్రుస్ఠి మరీ అంత తీక్షణముగా ఉండకూడదు.
  • మరింత కాంతివంతముగా కనిపించేలా మానిటర్ లైటింగ్ యేర్పాటు చేసుకోవాలి. మానిటర్ మీద యాంటిగ్లేర్ స్క్రీన్ యేర్పాటు చేసుకుంటే మంచిది.

డ్రైవింగ్ చేస్తున్నపుడు

  • డ్రైవింగ్ చేసెటపుడు సన్ గ్లాసెస్ ని వాడాలి.సూర్యుని నుంచి వచ్చే అతి నీలిలోహిత కిరణాలు యు.వి. (ultra violet rays) కిరణాలు తాకిడికి కళ్ళకు హానికలగకుండా, దుమ్మి, ధూళి పడకుండా కళ్ళకు రక్షణగా ఉంటాయి.
  • రాత్రులు డ్రైవింగ్ చేస్తున్నపుడు యాంటి గ్లేర్ గ్లాస్లు వాడాలి ,ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ల కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి.

కొన్ని కంటి వ్యాయామాలు

  • తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తిగా చివర్లకు తిప్పాలి. కనుగుడ్లు ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు ; ఆ ప్రక్కనుంచి ఈ ప్రక్కకు తిప్పాలి.
  • తలను విశ్రాంతిగా ఉంచి చూపును క్లాక్ వైజ్ గాను,యాంటి క్లాక్ వైజు గాను,తిప్పాలి, ఇలా 3 సార్లు చేయాలి.
  • తలను ఏమాత్రము కదల్చకుండానే వీలైన పైకి, మల్లీ వీలైనంత క్రిందకూ చూడాలి
  • తలను నిటారుగా వుంచిచూపును పైకి తిప్పుతూ పూర్తి కుడివైపు నుండి చూడండి, అలాగే చూపును క్రిందకి దించి పూర్తిగా ఎడమవైపు నుంచి చూడండి.

[మార్చు] మూలము

  • A guide to text book of Ohthalmology by Dr.ReddiNaidu. MS(Ophth), Prof & Head of Dept.Ophthalmology AMC Visakhapatnam
  • Dr.Seshagirirao Exprience & Knowledge


[మార్చు] బయటిలింకులు


"http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు