పాదము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| పాదము | |
|---|---|
| మానవుని పాదము | |
| లాటిన్ | pes |
| ధమని | dorsalis pedis, medial plantar, lateral plantar |
| నాడి | medial plantar, lateral plantar, deep fibular, superficial fibular |
| MeSH | Foot |
పాదము (ఆంగ్లం: Foot) అనేది మనుష్యులు మరియు జంతువులలో కాలి చివరన ఉండి నడవడానికి ఉపయోగపడే నిర్మాణం. దీనిలో చీలమండ (Ankle), ప్రపాదం (Forefoot), కాలివేళ్ళు (Toes) ఉంటాయి. చాలా జంతువులలో పాదంలో భాగంగా గోళ్ళు, డెక్కలు కూడా ఉంటాయి. కాళ్ళు నడవడానికి ఉపయోగపడే అవయవాలు.
మనుషులు పాదాల రక్షణ మరియు అందం కోసం రకరకాల పాదరక్షలు ధరిస్తారు.
[మార్చు] జంతువులలో పాదాలు
భూమి మీద సంచరించే సకశేరుకాల పాదాలు మూడు రకాలు: ప్లాంటిగ్రేడ్ (Plantigrade), డిజిగ్రేడ్ (digitigrade), లేదా అన్గ్యులిగ్రేడ్ (unguligrade). మనుషులు, కప్పలు లేదా ఎలుగుబంట్ల వంటి ప్లాంటిగ్రేడ్ జంతువులలో పాదం అడుగుభాగం శరీరభారమంతా మోస్తుంది. పిల్లులు, తోడేళ్ళు, పక్షులు మొదలైన డిజిగ్రేడ్ జంతువులలో కాలివ్రేళ్ళమీద మొత్తం భారం పడుతుంది. చివరి రకం జీవులలో కాలి గిట్టల మీద శరీరమంతా నిలబడుతుంది. వీటిని ఖురిత జంతువులు (Ungulates) అంటారు.
[మార్చు] వ్యాధులు
- చదును పాదము (Flat foot): పాదములో నిలువులోను, అడ్డములోను ఉండే చాపము లేకుండా చదునుగా అవుతుంది.
|
|||||||||||||||||||||||
