వికీపీడియా నుండి
ఎముకలు (Bones) మన శరీరానికి ముఖ్యమైన ఆధారము. ఇవి రకరకాల సైజులలో ఆకారాలలో ఉంటాయి.
[మార్చు] ఎముకల పట్టిక
[మార్చు] ఎముక విరుపు
- ప్రధాన వ్యాసం: ఎముక విరుపు
ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు ఇలా విరుగుతుంటాయి.
[మార్చు] ఎముక విరుపులోని రకాలు
- సామాన్య ఎముక విరుపు (Simple or Closed fracture): ఈ రకమైన విరుపులో ఎముక పూర్తిగా లేదా కొమ్త భాగం విరగవచ్చును. విరిగిన చోట ఎలాంటి గాయం కనిపించదు.
- చాలాచోట్ల ఎముక విరుపు (Compound or Open fracture): ఇందులో ఎముక విరిగిన దగ్గర కొన్ని ముక్కలుగా అయి, దానితో పాటు ఆ ప్రదేశంలో గాయం కనిపిస్తుంది. విరిగిన ఎముక కొనలు చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి.
- జటిలమైన ఎముక విరుపు (Complicated fracture): ఈ రకమైన విరుపులో ఎముక విరగడంతో పాటు ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, పేగులు మొదలైన భాగాలు దెబ్బతింటాయి.
- విఖండిత విరుపు:
- లేత ఎముక విరుపు: ఇందులో ఎముకకు ఒకవైపు భాగం మాత్రమే విరిగి ఎముక వంగుతుంది. ఇది లేతగా ఉండే చిన్నపిల్లలలో కనిపిస్తుంది.
[మార్చు] ఎముక విరుపు గుర్తించడం
- ఎముక విరిగిన చోట నొప్పిగా ఉంటుంది. ఒత్తిడిని ఏ మాత్రం భరించలేదు.
- విరిగిన చోట చుట్టూ వాపు ఉంటుంది.
- విరిగిన శరీర భాగాన్ని మామూలుగా కదల్చలేరు.
- విరిగిన చోట విరిగిన లేదా రాసుకున్న శబ్దం వస్తుంది లేదా తెలుస్తుంది.
- విరిగిన చోట కదలక అసామాన్యంగా ఉంటుంది.
- చెయ్యి లేదా కాలు వంకరపోవచ్చును. దీనికి కారణం ఎముక విరిగినప్పుడు దానికి అంటిపెట్టుకొని వున్న కండరాలు సంకోచించి, విరిగిన ఎముకల కొనలను ఒక దానిపై మరొకటి వచ్చేలా లాగుతాయి. దానితో ఆ భాగం పొట్టిగా అవుతుంది.
[మార్చు] ఎముక విరుపుకు ప్రథమ చికిత్స
- ప్రమాదం జరిగిన చోటనే ప్రథమ చికిత్స చేయాలి.
- రక్తస్రావం జరుగుతున్నప్పుడు గాయాన్ని శుభ్రపరచి రక్తస్రావాన్ని అరికట్టాలి.
- దెబ్బ తగిలిన భాగానికి కర్రబద్దలతో ఆధారం కల్పించాలి. జాగ్రత్తగా మరియు గట్టిగా కట్టుకట్టాలి.
- విరిగిన ఎముక కదలకుండా కర్రబద్దలు ఉపయోగింగి కట్టుకట్టాలి. బ్యాండేజీ విరిగిన ఎముక మీద కాకుండా దానికి అటూ, ఇటూ కట్టాలి. అయితే రక్త ప్రసరణ ఆగిపోయేంత గట్టిగా కట్టకూడదు.
- ప్రమాదానికి గురైన వ్యక్తిని దగ్గరలోని వైద్యుని వద్దకు తీకుకొని వెళ్ళాలి.
|
మానవశరీరభాగాలు |
|
| శరీరంలో వ్యవస్థలు |
|
|
| తల, మెడ |
|
|
| వీపు (వెనుకభాగం) |
|
|
| ఛాతీ |
|
|
| ఉదరము |
|
|
| కటి |
|
|
| కాళ్ళు, చేతులు |
|
|