చిత్రలేఖనం
ఊహను రూపంగా మలచగల ఒకే ఒక సాదనం చిత్రలేఖనం. ఈ కళకు పరిమితులు లేవు. మానవ చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించి మానవుని అభివృద్దిలో కీలకమైనది చిత్రలేఖనం. ఇలాంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించేవారిని చిత్రకారులు అంటారు.
విషయ సూచిక |
చిత్ర కళలో రకాలు[మార్చు]
- రేఖా చిత్రాలు
- వ్యంగ్య చిత్రాలు (Cartoons)
- నీటి వర్ణ చిత్రాలు (Watercolor paintings)
- తైల వర్ణ చిత్రాలు (Oil paintings)
ఇతర చిత్రలేఖన పద్దతులు[మార్చు]
సమగ్ర చిత్రలేఖనం[మార్చు]
ప్రధాన వ్యాసం సమగ్ర చిత్రలేఖనం
చిత్రలేఖనం ద్వారా చిత్రించిన చిత్రంలో పొందుపరచాలనుకున్న సమగ్ర విషయాన్ని లేక చూపించాలనుకున్న సమస్త సమాచారాన్ని ఒకే చిత్రంలో అగుపరచడాన్ని లేక చూపించడాన్ని సమగ్ర చిత్రలేఖనం అంటారు. సమగ్ర చిత్రలేఖనాన్ని ఆంగ్లంలో పనోరమ పెయింటింగ్ అంటారు. సమగ్ర చిత్రాలు విశాలమైన ప్రాంతంలో ఆవరించి ఉన్న విశేషాన్ని సమూలంగా వీక్షించేందుకు తయారు చేసిన భారీ కళాఖండాలు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని తరచుగా ప్రకృతి దృశ్యం, సైనిక యుద్ధం, లేక చారిత్రక సంఘటనలను వంటి చిత్రాలను ఈ సమగ్ర చిత్రాల ద్వారా చిత్రిస్తుంటారు. 19 వ శతాబ్దం నుండి యూరప్ మరియు అమెరికా రాష్ట్రాలలో ఈ సమగ్ర చిత్రలేఖనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. ఈ చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నారని శృంగారభరిత కవిత్వ రచయితల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కొన్ని సమగ్ర చిత్రలేఖనాలు 21 వ శతాబ్దంలో మనుగడ సాగించాయి మరియు ప్రజా ప్రదర్శనలో ఉన్నాయి.
చిత్ర రచన[మార్చు]
ప్రధాన వ్యాసం చిత్ర రచన
ఒక వస్తువు యొక్క చరిత్రను ఆ వస్తువు యొక్క రూపురేఖలు వచ్చేలా అక్షరాలను కూర్చుతూ వ్రాసే రచనను చిత్రరచన లేక చిత్ర చరిత్ర రచన అంటారు. చిత్రచరిత్రరచనను ఆంగ్లంలో ఐకోనో రైటింగ్ అంటారు. ఐకోనో అంటే చిత్రపట పరిశీలన శాస్త్రం, రైటింగ్ అంటే వ్రాయడం అని అర్థం. చదువుకునే పిల్లల్లో ఆసక్తిని కలిగించడానికి బొమ్మలోనే ఆ బొమ్మకు సంబంధించిన చరిత్రను లేదా విషయాన్ని అక్షర రూపంలో కూర్చుతున్నారు. ఈ విధమైన నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది.