పాకిస్తాన్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం : Pakistan) (ఉర్దూ : پاکستان) : దక్షిణాసియాలోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది. కామన్‌వెల్తులోను (2004 మరియు 2007లో కొంతకాలము బహిష్కరించబడినది), ఇస్లామిక్ దేశాల సంస్థలోను సభ్యత్వం ఉంది. 1947కు పూర్వం భారత అంతర్భాగమైన ఈ పాకిస్తాన్, 1947లో భారత్ నుండి వేరుపడి పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) మరియు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) ఏర్పడింది. ఈ విభజనకు ముఖ్య కారకులలో ముహమ్మద్ అలీ జిన్నా ఒకడు.
విషయ సూచిక |
పాక్ అధ్యక్షుడి అధికారాలకు కత్తెర [మార్చు]
పాక్‌లో త్వరలో తీసుకురానున్న 232వ రాజ్యాంగ సవరణ ద్వారా 'అత్యవసర పరిస్థితి విధింపు', 'న్యాయమూర్తుల, ముఖ్య ఎన్నికల అధికారి నియామకం' వంటి అధ్యక్షుడి అసాధారణ అధికారాలకు కత్తెర వేయనున్నారు. రాష్ట్ర శాసనసభలను సంప్రదించకుండా అధ్యక్షుడు తనంత తానుగా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించలేరు. అలాకాకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే దానికి పార్లమెంటు ఉభయసభలు 10రోజుల వ్యవధిలో ఆమోదముద్ర వేస్తేనే అమల్లోకి వచ్చే విధంగా ముసాయిదాలో పొందుపరిచారు.
ఆరోపణలు [మార్చు]
ఉత్తరకొరియా మరియు లిబియావంటి దేశాలకు అణుపరిఘ్నానాన్ని అక్రమముగా తరలించబడిందని ఆరోపణలు ఉన్నాయి.
వివాదాలు [మార్చు]
భారతదేశముతో 1947 నుంచి కాశ్మీరు గురించి వివాదము నడుస్తోంది. భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరు వివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999(కార్గిల్)) అలాగే భారత్, చైనా దేశాల మధ్య 1962 (బ్రిటిష్ వలస పాలన కాలములో భారత చైనాలను విదదీసే మెక్ మెహాన్ రేఖను చైనా గుర్తించనందుకు) యుద్ధానికి కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది.
కాశ్మీరులో భాగమైన గిల్గిత్-బాల్టిస్థాన్‌ను స్థానిక గిరిజనుల సాయంతో పాకిస్థాన్ 1947లో ఆక్రమించింది. ఇప్పటి వరకూ ఈ భూభాగం ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్థాన్ అధ్యక్షుడి ప్రత్యక్ష పాలనలో ఉంది. ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్థాన్ చైనాకు అప్పగించింది. అరబ్బు దేశాలకు, చైనాకు మధ్య సిల్క్ రవాణా మార్గంలో గిల్గిత్-బాల్టిస్థాన్ భూభాగం ఉంది.
భారత్-పాక్‌ను సన్నిహితం చేద్దాం [మార్చు]
భారత్-పాకిస్థాన్ మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇరుదేశాలకు చెందిన ఏడుగురు మాజీ మంత్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్‌కు చెందిన జశ్వంత్‌సింగ్, నట్వర్‌సింగ్, మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ నుంచి ఖుర్షీద్ ఎం.కసూరీ, సర్తాజ్ అజీజ్, అబ్దుల్ సత్తార్, గొహర్ అయూబ్‌ఖాన్ ఇరుదేశాల మధ్య నలుగుతున్న కాశ్మీర్ వ్యవహారం, జలాల పంపిణీ, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై వారు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇకపై ప్రతిఏటా సమావేశం కావాలని నిర్ణయించారు.
ఇవి కూడా చూడండి [మార్చు]
భారత్ పాక్ యుద్దం 1965
భారత్ పాక్ యుద్దం 1971
మూలాలు [మార్చు]
- ↑ "Area, Population, Density and Urban/Rural Proportion by Administrative Units". Population Census Organization, Government of Pakistan. Retrieved 2008-02-13.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Pakistan". International Monetary Fund. Retrieved 2008-10-09.
- ↑ 2008 HDI Statistical Update
|
|
|
|---|---|
|
బంగ్లాదేశ్ · భూటాన్ · భారత దేశము · మాల్దీవులు · నేపాల్ · పాకిస్తాన్ · శ్రీలంక కొన్నిసార్లు ఈ దేశాలను కూడా దక్షిణాసియా దేశాలుగా పరిగణిస్తారు: ఆఫ్ఘనిస్తాన్ • ఇరాన్ • మయన్మార్ • British Indian Ocean Territory • టిబెట్ |
|
||||||||
|
||||||||||||||||||