ఆక్యుపంక్చర్
వికీపీడియా నుండి
| వైద్యం ఆరోగ్యం |
||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||
ఆక్యుపంక్చర్ (Acupuncture) చైనా దేశములో బహుళ ప్రఖ్యాతగాంచిన వైద్యవిధానాలలో ఒక రకము. శరీరంలో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో సన్నటి సూదులను గుచ్చడం ద్వారా నొప్పిని తగ్గించడం, చికిత్స చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. చైనీయుల సాంప్రదాయ వైద్య విధానం ప్రకారం ప్రత్యేకమైన ప్రదేశాలు శరీరం లోకి జీవశక్తి ప్రవేశించే మార్గంలో అమరి ఉంటాయి. శరీర ధర్మ శాస్త్రం ప్రకారం కానీ, కణజాల శాస్త్రం ప్రకారంగానీ ఈ ప్రదేశాల గురించి ఎటువంటి ఆధారాలూ లేవు.[1]
[మార్చు] చరిత్ర
చైనాలో రాతి యుగం నుంచే ఈ విధానం వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానంలో వారు పదునైన రాయితో చేసిన సూదులను వాడేవారు. క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందిన అలాంటి రాళ్ళను కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తలు మంగోలియా ప్రాంతంలో కనుగొనడం జరిగింది. [2][3]ఇది ఆవిర్భవించింది చైనాలో కానీ జపాన్, టిబెట్, వియత్నాం, కొరియా లలో కూడా ఈ విధానాన్ని అవలంభించేవారూ, బోధించేవారు ఉన్నారు.
ఇటీవల ఓట్జీ (Ötzi) అనే ప్రాంతంలో ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో 5000 సంవత్సరాలనాటి ఒక మమ్మీ ని కనుగొన్నారు. దాని మీద సుమారు 50 ప్రదేశాల్లో పచ్చబొట్లు కనుగొన్నారు. అవి ఉన్న ప్రదేశాలన్నీ ఇప్పుడు ఆక్యుపంక్చర్ విధానంలో కొన్ని రోగాల నివారణకు సూదులు గుచ్చడానికి గుర్తించిన ప్రదేశాలే.
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మూలాలు
- ↑ Felix Mann. Chinese Medicine Times, vol 1 issue 4, Aug. 2006, "The Final Days of Traditional Beliefs? - Part One"
- ↑ MoonDragon's Health & Wellness Therapy: Acupuncture
- ↑ Acupuncture