జలుబు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జలుబు
Classification and external resources
Rhinovirus.PNG
A representation of the molecular surface of one variant of human rhinovirus.
ICD-10 J00.0
ICD-9 460
DiseasesDB 31088
MedlinePlus 000678
eMedicine med/2339
MeSH D003139

జలుబు లేదా పడిసం పై శ్వాసనాళ వ్యవస్థ(ముక్కు,గొంతు,స్వరపేటిక) పై వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు.సాధారణంగా జ్వరముతో కలిగే ముక్కు కారడాన్ని జలబు అని పిలుస్తారు.సర్వసాధారణంగా మామూలు జలుబు లేదా పడిసం రైనో వైరస్ అనే వైరస్ క్రిమి వల్ల , లేదా కొరోనా అనే వైరస్ ల వల్ల కలుగుతుంది. వాతావరణంలో ఉండే ఈ వైరస్ లుదేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం(ముక్కు దిబ్బడ) దీని ముఖ్యమైన లక్షణాలు.

జలుబు చేస్తే[మార్చు]

జలుబు సోకిన వ్యక్తికి మంచి ఆహారం, పండ్ల రసాలు ఇవ్వాలి. రోగి వీపు, రొమ్ముపై యూకలిప్టస్ నూనె రాయాలి. ఆవిరి పట్టాలి. ఇంకా క్రింది పద్దతులను అనుసరించడం వల్ల ఉపయోగముంటుంది.

  • వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి త్రాగితే తెల్లారేసరికల్లా జలుబు తగ్గుముఖం పడుతుంది.
  • పొద్దున్నే వేడి పాలలో, మిరియాల పొడి (వీలుంటే శోంఠి ) వేసుకోని కలిపి వేడివేడిగా త్రాగవచ్చు.
  • ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని అందులో పసుపు వేసుకొని చెమటలు పట్టె దాకా ఆవిరి పడితె చాలా తేడా కనిపిస్తుంది. దానిలో కాస్త అమృతాంజనం వేస్తే ఇంకా ప్రభావం కనిపిస్తుంది.
  • తులసి, అల్లపు ముక్కల రసం తేనెతో కలిపి మూడు పూటలా సేవిస్తే జలుబు తగ్గుతుంది.
  • శొంఠి, మిరియాలు, తులసి ఆకులు సమభాగంగా తీసుకుని కషాయం కాచాలి. దానికి చక్కెర చేర్చి, వేడిగా తాగితే పడిశం తగ్గుతుంది.
  • ఇరవై గ్రాముల దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి ఒక గ్లాసు నీటితో మరిగించి, వడగట్టి, ఒక చెంచా తేనె కలిపి వేడిగా తాగాలి.
  • ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి, రోజు పరగడుపున తాగితే నిమ్మలోని 'సి' విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తొందరగా జలుబు తగ్గేలా చేస్తుంది.
"http://te.wikipedia.org/w/index.php?title=జలుబు&oldid=1448933" నుండి వెలికితీశారు