మాతృభాష

వికీపీడియా నుండి

మాతృభాష (ఆంగ్లం: Mother Tongue లేదా first language) ఇంకనూ, ప్రధమ భాష, మొదటి భాష, ప్రాంతీయ భాష మొదలగు పేర్లు గలది. మానవుడు పుట్టిన తరువాత మొదటగా నేర్చుకునే భాష. ముఖ్యంగా తన తల్లి ఒడిలో నేర్చుకునే భాష, అందుకే మాతృభాష అనే పేరు.[1] ఒక మనిషి మొదటి భాష అతడి సామాజిక-భాషాపర గుర్తింపునకు మూలము.[2]

విషయ సూచిక

[మార్చు] పద కోశము

మాతృభాషకే పలు పేర్లతోనూ పిలుస్తారు;

  • మాతృభాష : మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష. లేదా మాతృభూమిలో మాట్లాడే భాష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ మాతృభూమిగా గలవారు మాట్లాడే భాష (తెలుగు) మాతృభాష.
  • ప్రధమ భాష లేదా మొదటి భాష : చక్కగా మాట్లాడగలిగే, అర్థం చేసుకో గలిగే, మరియు భావాలను వ్యక్తపరచ గలిగే భాషను ప్రధమభాషగా గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో భాషలు మాట్లాడేవారు గలరు. 90% మంది తెలుగు మాట్లాడుతారు. కారణం వీరి మాతృభాష "తెలుగు". అలాగే ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ భాషలు ప్రధమ భాషగా గల వారు కానవస్తారు.
  • ప్రాంతీయ భాష : ఒక ప్రాంతంలో నివసిస్తూ వుంటే, ఆ ప్రాంతపు వ్యావహారిక భాషను కూడా మాతృభాషగా పరిగణించవచ్చు. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ భాష "తెలుగు".

[3]

[మార్చు] బహు భాషా విధానం

తెలుగు భాషను తన మాతృభాషగా కలిగివున్నవాడు ఇతర భాషలు (ఉర్దూ, ఆంగ్లం, హిందీ వగైరా) మాట్లాడ గలిగివుండవచ్చును భారతీయ విద్యావిధానంలో "త్రిభాషా సూత్రము" అవలంబించబడుచున్నది. తెలుగు మాతృభాష (ప్రధమ భాష) కలిగివుండేవారు, హిందీ (దేశ భాష) ని రెండవ భాషగానూ, ఆంగ్లమును (అంతర్జాతీయ భాష) మూడవ భాషగానూ నేర్చుకుని తీరాలి.

[మార్చు] మాతృభాషలో పరీక్షలు

  • తెలుగుమీడియం లో డిగ్రీ చదివినవారికి 1995వరకు ఏ.పి.పి.యస్.సి.నిర్వహించిన గ్రూప్1,2 పరీక్షలలో 5% వైటేజి మార్కులు కలిపేవారు.
  • రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బీ) నిర్వహించే పరీక్షలను ఉద్యోగార్థులు తమ మాతృ భాషల్లోనే రాసే వీలు 2009 నుండి కల్పిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ అవకాశం ఉంటుంది.

[మార్చు] పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే

పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

  1. Bloomfield, Leonard. Language ISBN 81-208-1196-8
  2. The Native Speaker: Myth and Reality By Alan Davies ISBN 1-85359-622-1 మూస:Pn
  3. mother tongue. 2001 census. తీసుకొన్న తేదీ: 2008-08-25. మూస:Verify credibility
పేజీకి సంభందించిన లింకులు