ఉస్మానియా విశ్వవిద్యాలయము

వికీపీడియా నుండి

ఉస్మానియా విశ్వవిద్యాలయము

Osmania University Logo.png
కొసరు తమసోమా జ్యోతిర్గమయ
స్థాపన 1918
తరహా ప్రభుత్వ సంస్థ
కులపతి నరసింహన్
ఉప కులపతి మొహమ్మద్ సులేమాన్ సిద్దిఖి
ప్రదేశం హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
చిరునామా ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ - 500 007 భారతదేశం
క్యాంపస్ పట్టణ
వెబ్‌సైటు www.osmania.ac.in
Osmania University is accredited with 5 stars level by NAAC

ఉస్మానియా విశ్వవిద్యాలయము (ఆంగ్లం: Osmania University) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధాన విశ్వవిద్యాలయం. ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం[1] ప్రస్తుత ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులలో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా బాషగా మారింది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసిఫ్ జా VII చే 1917 లో స్థాపించబడింది. భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాద్ సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది.

[మార్చు] ప్రతిష్ట మరియు బోధించే విషయాలు

1,600 ల ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని బహూశ దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి భూగోళ శాస్త్ర విభాగం దక్షిణ భారతావనిలోనే పురాతనమైనది మరియు పెద్దది. ఇది 1942లో స్థాపించబడింది.

[మార్చు] ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఆర్ట్స్ కళాశాల భవనం
ప్రధాన వ్యాసం: ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ

ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైక శాఖ. తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడతంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధన (పీ.హెచ్.డి) లను అందిస్తున్నది.

[మార్చు] ప్రత్యేక తెలంగాణ ఉద్యమం

ప్రత్యేక తెలంగాణకై విశ్వవిద్యాలయ విద్యార్థులు 2009 నుంచి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రాతంలో ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉండటం, ఇక్కడి విద్యార్థులు తెలంగాణ వారే అధికసంఖ్యలో ఉండటం మరియు స్వాతంత్ర్యోద్యమం సమయంలో ఇక్కడ విజయవంతంగా జరిగిన వందేమాతరం ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని ఇక్కడి విద్యార్థులు, మేధావులు ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తున్నారు.

[మార్చు] చెప్పుకోదగిన పూర్వవిద్యార్ధులు

[మార్చు] అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు

[మార్చు] అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలలు

  • సర్దార్ పటేల్ కళాశాల, సికిందరాబాదు
  • ఆంధ్ర విద్యాలయ కళాశాల, లిబర్టీ, హైదరాబాదు
  • ప్రగతి కళాశాల, కోఠి, హైదరాబాదు

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు

  1. ఆదాబ్ హైదరాబాద్, మల్లాది కృష్ణానంద్ రచన, ద్వితీయ ముద్రణ అక్టోబరు 2008, పేజీ సంఖ్య 70
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు