పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం
రకంప్రభుత్వ
స్థాపితం2014, నవంబరు 22
ఛాన్సలర్తెలంగాణ గవర్నర్
వైస్ ఛాన్సలర్వంగూరు రవీందర్ రెడ్డి[1]
చిరునామరాజేంద్రనగర్‌, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
17°19′34″N 78°24′30″E / 17.326235°N 78.4083168°E / 17.326235; 78.4083168
అనుబంధాలుఐసిఏఆర్

పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఒక పశువైద్య విశ్వవిద్యాలయం.[2] ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 నవంబరు 22న ఈ విశ్వవిద్యాలయం ఏర్పడింది. భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు మీదుగా ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడమైనది.

చరిత్ర[మార్చు]

హైదరాబాద్ నిజాం సహకారంతో 1946 ఆగస్టు 8న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హైదరాబాదు పశువైద్య కళాశాలగా ఇది స్థాపించబడింది. 1964లో ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పుడు ఈ కళాశాల, విశ్వవిద్యాలయ పరిధిలోకి వచ్చింది. 2005 జూన్ 12న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత, పశువైద్య ఇన్‌స్టిట్యూట్‌లు విభజించబడ్డాయి.

2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ ఏర్పడిన తరువాత, తెలంగాణ ప్రభుత్వ చట్టం ద్వారా పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య, జంతు, మత్స్య శాస్త్రాల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది.[3] 2016 మే 24 నుండి పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చబడింది.[4][5]

వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్[మార్చు]

పశువులకు అత్యాధునిక పద్ధతిలో చికిత్స, ఇతర సేవలు అందించడంకోసం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 12.75 కోట్ల రూపాయలతో నిర్మించిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ను 2022 నవంబరు 29న రాష్ట్ర పశుసంవర్థక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపి జి. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, షీఫ్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, డైరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆదార్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం బూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[6][7]

విధులు[మార్చు]

  1. పశువులు, జంతువులు, మత్స్య మొదలైన కోర్సులలో విద్యను అందించడం.
  2. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు పశువులు, జంతువులు, మత్స్య కోర్సులపై పరిశోధనలు చేపట్టడం
  3. పశువులు, జంతువులు, మత్స్య ప్రొడక్షన్, హార్వెస్ట్ టెక్నాలజీని ప్రోత్సహించడం

లక్ష్యాలు[మార్చు]

  1. పశువులు, జంతువులు, మత్స్యరంగంలో తగిన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం
  2. అధిక పనితీరు గల జంతువులు, ఆధునిక రోగనిర్ధారణ, రోగనిరోధక సాధనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రాథమిక పరిశోధనను చేపట్టడం
  3. రాష్ట్రంలోని పశువుల పెంపకందారులలో వ్యవస్థాపక సామర్థ్యాలను అభివృద్ధి చేయడం
  4. పశువుల, పశువుల ఉత్పత్తులపై పరిజ్ఞానాన్ని నవీకరించడం ద్వారా రాష్ట్ర రైతులకు సేవ చేయడం

మూలాలు[మార్చు]

  1. "VCs appointed". The Hindu (in Indian English). 11 January 2021. Retrieved 2022-03-12.
  2. "Universities". Indian Council of Agricultural Research. Archived from the original on 18 August 2011. Retrieved 2022-03-12.
  3. "About Us". Sri P. V. Narasimha Rao Telangana State University for Veterinary, Animal and Fishery Sciences. Archived from the original on 2018-05-16. Retrieved 2022-03-12.
  4. "ABOUT US". tsvu.nic.in. Retrieved 2021-11-05.
  5. "Universities renamed". Retrieved 2022-03-12.
  6. "Veterinary clinical complex inaugurated at PVNRTV varsity". The New Indian Express. 2022-11-30. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.
  7. "వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ప్రారంభం". EENADU. 2022-11-30. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.

బయటి లింకులు[మార్చు]