బిర్లా మందిరం, హైదరాబాదు
వికీపీడియా నుండి
బిర్లా మందిరం ప్రసిద్ది చెందిన వెంకటేశ్వర స్వామి అలయం. హైదరాబాదులో రవీంద్రభారతి సమీపాన లకడీ కా పూల్ బస్టాండ్ నుండి దగ్గరగా కల చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మింపబడినది.
[మార్చు] ఆలయ ప్రత్యేకతలు
- ఈ మందిరము హైదరాబాద్ నడి మద్య ఉన్నది.
- కొండ పై భాగమునే కార్ పార్కింగ్ ఉండుటచే సులభముగా చేరుకొనవచ్చును.
- దేవాలయమునకు ప్రక్కన బిర్లా సైన్స్ సిటీ, ప్లానెటేరియం కలవు .
- పార్కింగ్ వద్ద నుండి దేవలయము మొత్తము మెట్లతో సహా పాలరాతితో నిర్మించబడినది.
- మందిర పై భాగము నుండి చూస్తే దగ్గరగా హుస్సేన్ సాగర్, బుద్దవిగ్రహము, అసెంబ్లీ, రవీంద్రభారతి, లాల్ బహుదూర్ స్టేడియం, లుంబిని పార్క్ లాంటివి అందముగా కనిపిస్తుంటాయి.