ఊర్ట్ మబ్బు
ఊర్ట్ మబ్బు , ఒక బంతి ఆకారపు మబ్బు, ఈ మబ్బు తోకచుక్కల నిలయం. ఇది సూర్యుడి నుండి 50,000 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో వున్నది.[1] సూర్యుడినుండి ప్లూటో కు గల దూరం కంటే ఇది 1000 రెట్లు అధికం. దాదాపు ఒక కాంతి సంవత్సరానికి సమానం. ఊర్ట్ మబ్బు యొక్క బాహ్య అంచు మన సౌరమండల అంచునకు ప్రాక్సిమా సెంటారీ (సూర్యునికి అతి దగ్గరలో వున్న నక్షత్రం) దూరానికి పావువంతు విస్తరింపబడి ఉన్నది.
ఈ ఊర్ట్ మబ్బులో రెండు వివిధ భాగాలున్నట్లు భావిస్తున్నారు. ఒకటి, బంతి-ఆకార 'బాహ్య ఊర్ట్ మబ్బు', రెండవది, డిస్క్-ఆకార 'అంతర్ ఊర్ట్ మబ్బు' (లేదా పర్వతాల మబ్బు). ఊర్ట్ మబ్బులో గల శరీరాలు మంచు, ఉదాహరణకు నీరు, అమ్మోనియా మరియు మీథేన్ లతో తయారైన ఆకృతులుగా భావిస్తున్నారు. ఊర్ట్ మబ్బు గురించి సంపూర్ణమైన పరిశోధనలు ఇంకనూ జరగవలసి వున్నవి, అయిననూ ఎక్కువ కాలానికి చెందిన హేలీ తోకచుక్క, బృహస్పతి కుటుంబానికి చెందిన తోకచుక్కలూ మరియు ఇతర తోకచుక్కలకు పుట్టినిల్లు ఈ ఊర్ట్ మబ్బే.[2] తక్కువ కాలానికి చెందిన తోకచుక్కలు క్యూపర్ బెల్ట్ కు చెందినవి.[1], కానీ ఈ తక్కువకాలానికి చెందిన కొన్ని తోకచుక్కలూ ఊర్ట్ మబ్బుకే చెందినవి అని భావిస్తున్నారు. [2] క్యూపర్ బెల్ట్ మరియు సుదూర విసరబడ్డ డిస్క్ ను పరిశీలించి పటాలనూ తయారు చేశారు, కానీ ప్రస్తుతం తెలిసిన శరీరాలు, 90377 సెడ్నా మరియు 2000 CR105 లు అంతర్ ఊర్ట్ మబ్బు సభ్యులని భావించడం జరిగినది.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 Alessandro Morbidelli (2008-02-03). Origin and dynamical evolution of comets and their reservoirs (PDF). arxiv. తీసుకొన్న తేదీ: 2007-05-26.
- ↑ 2.0 2.1 V. V. Emelyanenko, D. J. Asher, M. E. Bailey (2007). The fundamental role of the Oort cloud in determining the flux of comets through the planetary system. Royal Astronomical Society. తీసుకొన్న తేదీ: 2008-03-21.
[మార్చు] బయటి లింకులు
- Oort Cloud Profile by NASA's Solar System Exploration
- Representation, Southwest Research Institute
- The Kuiper Belt and The Oort Cloud
- The effect of perturbations by the Alpha Cen A/B system on the Oort Cloud