మార్సే (ప్రాన్స్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్సే [Marseille]
Flag of మార్సే [Marseille]
Coat of arms of మార్సే [Marseille]
దేశంఫ్రాన్సు
RegionProvence-Alpes-Côte d'Azur
DepartmentBouches-du-Rhône
ArrondissementMarseille
IntercommunalityUrban Community of Marseille Provence Métropole
Government
 • Mayor (since 1995) Jean-Claude Gaudin (UMP)
Area
 • Urban
 (2010)
1,731.91 km2 (668.69 sq mi)
 • Metro
 (2010)
3,173.50 km2 (1,225.30 sq mi)
 • Land1240.62 km2 (92.90 sq mi)
Population
 (Jan. 2011[3])
 • Rank2nd after Paris
 • Urban
 (Jan. 2011)
15,60,921[1]
 • Metro
 (Jan. 2011)
17,20,941[2]
 • Population2
8,50,636
 • Population2 density3,500/km2 (9,200/sq mi)
INSEE/Postal code
13055 / 13001-13016
Dialling codes0491 or 0496
Websitemarseille.fr
1 French Land Register data, which excludes lakes, ponds, glaciers > 1 km² (0.386 sq mi or 247 acres) and river estuaries. 2 Population without double counting: residents of multiple communes (e.g., students and military personnel) only counted once.

ఫ్రాన్స్‌లో పాఠిస్ తర్వాత చూడదగ్గ పట్టణం మార్సే. 241 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పదహారు లక్షల జనాభా గల ఇది ఫ్రాన్స్‌లోని రెండవ పెద్ద నగరం. ఫ్రాన్స్‌లోని అతి పెద్ద వ్యాపార నౌకాశ్రయం ఇక్కడ మెడిటరేనియన్ తీరంలో ఉంది. క్రీ.పూ.600వ శతాబ్దంలో యూరప్‌లో గల అతి తక్కువ పట్టణాల్లో ఇదొకటి. టెర్రకోట, పండిన ఏప్రికాట్ రంగు లేదా విచ్చుకున్న గోధుమరంగు పైకప్పులు గల భవంతులు ఈ నగరం నిండా కనిపిస్తాయి. ‘లా మార్సెలైస్’ అని ఈ ప్రాంతాన్ని పొగుడుతూ రాసిన గీతమే నేటి ఫ్రాన్స్ జాతీయ గీతం. నార్త్ ఆఫ్రికాతో ఈ రేవు నించి చాలా వందల ఏళ్లుగా వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ చూడదగ్గ విశేషాలు బహిలిక్ డినోట్రడేమ్ డిలాగార్డే: ‘అవర్ లేడీ ఆఫ్ ది గార్డ్’ అని అర్థం. ఈ రోమన్ కేథలిక్ చర్చి 1864లో నిర్మించబడింది. పాత నౌకాశ్రయం పక్కన సున్నపు రాతితో నిర్మించబడ్డ ఈ చర్చి మార్సే నగరానికి చిహ్నం. 490 అడుగుల ఎత్తుగల దీన్ని ఓ పురాతన కోట పునాదుల మీద నిర్మించారు. అంతకు మునుపు ఇక్కడ 1214లో నిర్మించిన చర్చి ఉండేది. ఈ చర్చిలో 135 అడుగుల ఎత్తుగల గంట స్తంభం, 27 అడుగుల ఎత్తుగల మడోనా అండ్ చైల్డ్ విగ్రహం చూడొచ్చు. ఆకుపచ్చ రంగు సున్నపు రాతితో ఇది నిర్మించబడింది. ఇటీవల దీనికి మరమ్మతులు చేశారు.

చూడవలసినవి[మార్చు]

కాంక్యు డి మార్జియో:[మార్చు]

కాంక్యు అంటే సముద్రంలోకి చొచ్చుకు వెళ్లిన రెండు పర్వత పాదాల మధ్యగల నీరు అని అర్థం. ఇక్కడ అలాంటిది ఒకటి ఉంది. టునా చేపలు ఇక్కడ విస్తారంగా దొరుకుతాయి. 1622లో కింగ్ పనె్నండవ లూరుూ ఇక్కడ టూనా చేపలు పట్టేవాడు. ఆనాడు నిర్మించిన చిన్న చెక్క కుటీరాలు ఇంకా ఉండటం విశేషం. పార్క్ బోర్లీ: ఇది మార్సేలోని ఫ్రెంచ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నిర్వహించే పబ్లిక్ పార్క్. సముద్ర తీరానికి సమీపంలో పాయింట్ రోగ్ దగ్గర గల ఈ పార్క్‌లో నడవవచ్చు. ఈత కొట్టొచ్చు. సైక్లింగ్ చేయొచ్చు. వేసవిలో ఇది చాలా రద్దీగా ఉండి ఆరు బయట కాన్సర్ట్స్, సినిమాల ప్రదర్శన జరుగుతాయి. మెడిటరేనియన్ థీమ్‌తో జరిగే కార్నివాల్ పరేడ్‌లో నాట్యకారులు, అనేక విన్యాసాలు చేసే వారు ఇక్కడ కనిపిస్తారు. వియక్స్‌పోర్ట్: ఈ ప్రాచీన నౌకాశ్రయంలో చేపలు పట్టేవాళ్లు చేపలని వేలం వేసే కార్యక్రమాన్ని చూడటానికి చాలామంది టూరిస్టులు వెళ్తుంటారు. వేసవి మధ్యాహ్నాల్లో మాత్రమే దీన్ని చూడగలం. ఇక్కడ నించి క్రూయిజ్‌లో ఫ్రియోల్ లేదా ఛటావు ద్వీపాలకి వెళ్లి రావచ్చు. లీ కోర్స్ జూలియన్: ఫౌంటెయిన్స్, పిల్లల గ్రౌండ్స్, కేఫ్స్, పుస్తకాలు, సావనీర్ షాప్స్ మొదలైనవి గల ఈ షాపింగ్ సెంటర్‌లో టూరిస్టులు చక్కటి కాలక్షేపం చేయొచ్చు.

లా కోరెన్ష్:[మార్చు]

సముద్రంలోకి గల వాక్ వే మీద నడవడం చక్కటి అనుభవం. ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. లా ప్లేస్ కేస్టలానే: ఫౌంటెయిన్స్, శిల్పాలు, ప్రాచీన స్తంభాలు గల ఈ సెంటర్‌లో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు అనేకం ఉంటాయి. టూరిస్ట్‌లు అధికంగా కనపడే ప్రదేశం ఇది. పేవ్‌మెంట్ మీది బల్ల ముందు కూర్చుని తింటే ధర అధికం. లీ పేనియర్: ఫ్రెంచ్ భాషలో పేనియర్ అంటే బుట్ట అని అర్థం. ఇది మార్సేలోని అతి ప్రాచీన భాగం. ఇక్కడ అతి పురాతన చిహ్నం ‘వియల్నే ఛారిట్’ని చూడొచ్చు. ఇక్కడి అనేక ఎగ్జిబిషన్స్, మ్యూజియంలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి.

యునైటెడ్ హేబిటేషన్ భవంతి:[మార్చు]

దీనికి మరో పేరు లా మైసన్ డూ ఫడా అంటే మూర్ఖుల ఇల్లు అని అర్థం. ఈ కాంప్లెక్స్‌లో వివిధ దుకాణాలు, ఓ చర్చ్, పిల్లల స్కూలు, ఇళ్లు మొదలైనవి ఉన్నాయి. పురాతన మార్సేని చూడడానికి పర్యాటకులు ఇక్కడికి కూడా వస్తుంటారు. నోవాలిస్: ఈ సబ్ వే స్టేషన్‌లోంచి బయటకి వస్తే ఇక్కడ అరబిక్, ఇండో చైనీస్ దుకాణాలు, అల్జీరియన్ బజారులో అల్జీరియన్ షాపులు ఉంటాయి. వీటిలో ఫ్రాన్స్‌లో దొరకని దిగుమతి అయిన అనేక వస్తువులు కొనొచ్చు.

మజార్గెస్ వార్ సెమెట్రీ:[మార్చు]

మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో మరణించిన అనేక మంది సైనికుల శ్మశాన వాటిక ఇది. చాలా ప్రశాంతంగా ఉండే ఇక్కడ ఇండియన్, చైనీస్ సైనికుల సమాధులు కూడా ఉన్నాయి.

ఛటావు డిఫ్:[మార్చు]

సమీపంలోని చిన్న ద్వీపంలో తొలుత జైలుగా నిర్మించబడ్డ దీనికి పడవలో వెళ్లి రావచ్చు. అలెగ్జాండర్ డ్యూమాస్ రాసిన ‘ది కౌంట్ ఆఫ్ వౌంట్ క్రిస్టో’ నవల ఇక్కడే జరిగినట్లుగా రాయబడింది.

పలైస్ లాంగ్‌ఛాంప్:[మార్చు]

ఇది తప్పక చూడదగ్గ భవంతి. ఈ పేలస్‌లో నేచురల్ హిస్టరీ మ్యూజియం, ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం ఉన్నాయి. దీన్ని 1870లో నిర్మించారు. ఆర్కిటెక్చర్‌లో ఇది అద్వితీయమైంది. దీని చుట్టుపక్కల గల పార్క్‌ని రాత్రిళ్లు చూస్తే బావుంటుంది. మార్సేకి పారిస్ నించి రైల్లో మూడు గంటల 20 నిమిషాల ప్రయాణం (టిజివి ఫ్యాన్స్ ట్రైన్) యూరప్‌లోని అన్ని దేశాల నించి ఇక్కడికి విమాన సర్వీసులు ఉన్నాయి. పారిస్ నించి బస్‌లో కూడా రావచ్చు. మార్సేలో సైకిల్, సిటీ బస్, టాక్సీలలో తిరగొచ్చు. మే నించి సెప్టెంబర్ దాకా సీజన్.

మూలాలు[మార్చు]

  1. "Séries historiques des résultats du recensement - Unité urbaine 2010 de Marseille - Aix-en-Provence (00759)". INSEE. Retrieved 30 July 2014.
  2. "Séries historiques des résultats du recensement - Aire urbaine 2010 de Marseille - Aix-en-Provence (003)". INSEE. Retrieved 30 July 2014.
  3. "Séries historiques des résultats du recensement - Commune Marseille (13055)". INSEE. Retrieved 30 July 2014.