Jump to content

మేకపాటి గౌతమ్ రెడ్డి

వికీపీడియా నుండి
(మేకపాటి గౌతమ్‌రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
మేకపాటి గౌతమ్‌ రెడ్డి
మేకపాటి గౌతమ్ రెడ్డి


ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 - 2022 ఫిబ్రవరి 21
ముందు ఆనం రామనారాయణరెడ్డి
నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగష్టు 15, 1972
బ్రాహ్మణపల్లి, మర్రిపాడు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2022 ఫిబ్రవరి 21
హైదరాబాద్‌
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి
జీవిత భాగస్వామి శ్రీకీర్తి
బంధువులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (బాబాయి), మేకపాటి విక్రమ్ రెడ్డి (సోదరుడు)[1]
సంతానం అనన్య రెడ్డి (కూతురు), అర్జున్‌ రెడ్డి (కొడుకు)
వృత్తి రాజకీయ నాయకుడు, పారిశ్రామిక వేత్త

మేకపాటి గౌతమ్‌రెడ్డి (1972 ఆగష్టు 15 - 2022 ఫిబ్రవరి 21) నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ఆయన ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. గౌతమ్‌రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో 1972 ఆగష్టు 15న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి దంపతులకు జన్మించాడు. ఆయన ఊటీలోని గుడ్ షెపర్డ్ లో పాఠశాల విద్య, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్లస్ టూ, భద్రుకా కళాశాలలో డిగ్రీ, మాంచెస్టర్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లో ఎమ్మెస్సీ (టెక్స్‌టైల్స్‌) 1994 -1997లో పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

గౌతంరెడ్డి తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గూటూరు మురళి కన్నాబాబు పై 30,191 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చేరారు.[3][4][5]

మరణం

[మార్చు]

మేకపాటి గౌతమ్‌రెడ్డి 2022 ఫిబ్రవరి 21న గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[6] గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.[7] ఆయనకు భార్య మేకపాటి శ్రీకీర్తి, కూతురు సాయి అనన్య రెడ్డి, కుమారుడు అర్జున్ రెడ్డి ఉన్నారు.[8][9]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (28 April 2022). "అన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్‌రెడ్డి". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  2. Sakshi (18 March 2019). "నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
  3. Mana Telangana (8 June 2019). "కొలువుదీరిన ఎపి కొత్త మంత్రులు..." Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  4. The Hans India, Sambasiva Rao (8 June 2019). "AP new Cabinet Ministers portfolios". www.thehansindia.com. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  5. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (21 February 2022). "ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  7. "బిగ్‌ బ్రేకింగ్‌: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం". EENADU. Retrieved 2022-02-21.
  8. Eenadu (22 February 2022). "ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  9. Andhra Jyothy (22 February 2022). "ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.