మేమ్ ఫేమస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేమ్ ఫేమస్
దర్శకత్వంసుమంత్‌ ప్రభాస్‌
రచన
నిర్మాతఅనురాగ్‌ రెడ్డి
శరత్‌ చంద్ర
చంద్రు మనోహర్‌
తారాగణంసుమంత్‌ ప్రభాస్‌
మౌర్య చౌదరి
మణి ఏగుర్ల
సిరి రాశి
ఛాయాగ్రహణంశ్యామ్ దూపాటి
కూర్పుసృజన అడుసుమిల్లి
సంగీతంకళ్యాణ్ నాయక్
నిర్మాణ
సంస్థ
ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్
విడుదల తేదీs
2023 మే 26 (2023-05-26)(థియేటర్)
2023 జూన్ 30 (2023-06-30)( అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

మేమ్‌ ఫేమస్‌ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌ నిర్మించిన ఈ సినిమాకు సుమంత్‌ ప్రభాస్‌ దర్శకత్వం వహించగా కళ్యాణ్ నాయక్ సంగీతం అందించాడు. సుమంత్‌ ప్రభాస్‌, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మంత్రి మల్లారెడ్డి మార్చి 26న ఆవిష్కరించగా[1], సినిమాను మే 26న విడుదలై,[2][3] జూన్ 30 నుండి అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4][5]

కథ[మార్చు]

మయి అలియాస్ మహేశ్ (సుమంత్ ప్రభాస్), బాలి అలియాస్ బాలకృష్ణ (మౌర్య చౌదర్య), దుర్గ (మణి ఏగుర్ల) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. బండనర్సింపల్లిలో అల్లరి చిల్లరగా తిరుగుతూ జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటారు. ఊరిలో ప్రతి ఒక్కరితో తిట్టించుకున్న ఈ ముగ్గురూ ఎలాగైనా ఫేమస్ అయ్యి అందరితో శభాష్ అనిపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో పంచాయతీ ప్రెసిడెంట్ జింక వేణు (కిరణ్ మచ్చా), అంజి మామ (అంజి మామ మిల్కూరి వాళ్లకు ఎలా సహాయపడ్డారు. మయి, మామ కూతురు మౌనిక (సార్య లక్ష్మణ్)తో అతడి ప్రేమ కథ ఏమిటి? ఫేమస్ కావడానికి మయి తన మిత్రులతో కలిసి ఏం చేశాడు? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

  • సుమంత్‌ ప్రభాస్‌
  • మణి ఏగుర్ల
  • మౌర్య చౌదరి
  • సార్య
  • సిరి రాశి
  • కిరణ్ మచ్చా
  • అంజి మామ
  • ఐరేని మురళీధర్ గౌడ్
  • నరేంద్ర రవి
  • శివ నందన్

పాటల జాబితా[మార్చు]

  • అయ్యయ్యో, రచన: కళ్యాణ్ నాయక్, సార్య, గానం. రాహూల్ సింప్లీ గoజ్
  • దోస్తులం, రచన: కోటీ మామిడాల, కళ్యాణ్ నాయక్, గానం. కాలభైరవ
  • దింకచిక, రచన: కోటీ మామిడాల, కళ్యాణ్ నాయక్,గానం. కళ్యాణ్ నాయక్
  • గల్లీ చిన్నది , రచన: గోరేటి వెంకన్న, గానం. గోరేటి వెంకన్న
  • మినిమం సాంగ్, రచన: కోటి మామిడాల, కళ్యాణ్ నాయక్, గానం . రాహూల్ సింప్లీ గంజ్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్[6]
  • నిర్మాత: అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుమంత్‌ ప్రభాస్‌
  • సంగీతం: కళ్యాణ్ నాయక్
  • సినిమాటోగ్రఫీ: శ్యామ్ దూపాటి
  • ఎడిటర్: సృజన అడుసుమిల్లి
  • సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి
  • ఆర్ట్ డైరెక్టర్: అరవింద్ ములి

మూలాలు[మార్చు]

  1. 10TV Telugu (26 March 2023). "'మేమ్ ఫేమస్' టీజర్ రిలీజ్ చేసిన మంత్రి మల్లారెడ్డి.. ఫేమస్ అవ్వాలంటే కొట్టాల్సిందే!". Archived from the original on 27 March 2023. Retrieved 27 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhra Jyothy (27 March 2023). "ఫేమస్‌ అవ్వాలనుకొంటే..?". Archived from the original on 27 March 2023. Retrieved 27 March 2023.
  3. Namasthe Telangana (8 May 2023). "మేము ఫేమస్‌ మూవీ ప్రీ పోన్.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..!". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
  4. Namasthe Telangana (30 June 2023). "మేమ్‌ Famousను థియేటర్‌లో మిస్సయ్యారా..? అయితే గెట్‌ రెడీ". Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
  5. Sakshi (30 June 2023). "ఓటీటీలోకి వచ్చేసిన మేమ్‌ ఫేమస్‌ సినిమా, ఎక్కడంటే?". Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
  6. Disha Daily (23 March 2023). "'మేమ్ ఫేమస్'.. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్". Archived from the original on 27 March 2023. Retrieved 27 March 2023.

బయటి లింకులు[మార్చు]